ARE YOU NOT USING OLD GMAIL ID KNOW HOW TO DELETE YOUR GOOGLE ACCOUNT SS
Google Account: పాత జీమెయిల్ ఐడీ వాడట్లేదా? గూగుల్ అకౌంట్ పర్మనెంట్‌గా డిలిట్ చేయండి ఇలా
Google Account: పాత జీమెయిల్ ఐడీ వాడట్లేదా? గూగుల్ అకౌంట్ పర్మనెంట్‌గా డిలిట్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
Google Account | మీరు మీ జీమెయిల్ అకౌంట్‌ను (Gmail Account) శాశ్వతంగా డిలిట్ చేయాలనుకుంటున్నారా? మీరు వాడని గూగుల్ అకౌంట్‌ను సింపుల్‌గా డిలిట్ చేయొచ్చు. అకౌంట్ ఎలా డిలిట్ చేయాలో, అకౌంట్ డిలిట్ చేయడం కన్నా ముందు ఏం చేయాలో తెలుసుకోండి.
ఒకరి పేరు మీద రెండుమూడు జీమెయిల్ అకౌంట్స్ ఉండటం మామూలే. ముందు ఓ జీమెయిల్ అకౌంట్ (Gmail Account) క్రియేట్ చేయడం, ఆ తర్వాత కొత్త ఐడీ క్రియేట్ చేసి పాత అకౌంట్‌ను వదిలేయడం చాలామందికి అలవాటు. అయితే పాత జీమెయిల్ ఐడీ వాడకుండా వదిలేసేవారు ఉంటారు. అయితే వారి గూగుల్ అకౌంట్ (Google Account) యాక్టీవ్‌గా ఉంటుంది. ఒకవేళ ఆ జీమెయిల్ ఐడీతో హ్యాకర్లు లాగిన్ అయ్యారంటే చిక్కులు తప్పవు. చాలావరకు సైబర్ నేరాలకు ఇది కారణమవుతోంది. అందుకే మీరు పాత జీమెయిల్ ఐడీ ఉపయోగించనట్టైతే గూగుల్ అకౌంట్‌ను డిలిట్ చేయాలి.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి ప్లాట్‌ఫామ్స్ లాగానే గూగుల్ కూడా యూజర్లు తమ అకౌంట్‌ను డిలిట్ చేసే అవకాశం ఇస్తోంది. మీ గూగుల్ అకౌంట్‌ను పర్మనెంట్‌గా డిలిట్ చేయొచ్చు. మరి మీ గూగుల్ అకౌంట్‌ను ఎలా డిలిట్ చేయాలో తెలుసుకోండి.
మీ గూగుల్ అకౌంట్ డిలిట్ చేసేముందు ముఖ్యమైన డేటా ఉంటే డౌన్లోడ్ చేయడం మర్చిపోవద్దు. జీమెయిల్, గూగుల్ ఫోటోల్, గూగుల్ డ్రైవ్‌లో ఏవైనా ఫైల్స్ ఉంటే ముందు డౌన్లోడ్ చేసిన తర్వాత గూగుల్ అకౌంట్ డిలిట్ చేయాలి. ఒక్కసారి మీ గూగుల్ అకౌంట్ డిలిట్ చేశారంటే ఇక ఆ అకౌంట్‌తో లాగిన్ చేయడం సాధ్యం కాదు. అంతేకాదు... మీరు గతంలో గూగుల్ అకౌంట్‌తో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో లాగిన్ అయినట్టైతే మళ్లీ అదే అకౌంట్‌తో లాగిన్ చేయలేరు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.