ARE YOU MEMBER IN FACEBOOK GROUP KNOW HOW TO POST ANONYMOUSLY WITHOUT REVEALING YOUR NAME SS
Facebook Groups: మీ పేరు కనిపించకుండా ఫేస్బుక్లో ఇలా పోస్ట్ చేయొచ్చు
Facebook Groups: మీ పేరు కనిపించకుండా ఫేస్బుక్లో ఇలా పోస్ట్ చేయొచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)
Facebook Groups | మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా? ఫేస్బుక్ గ్రూప్స్‌లో (Facebook Groups) మెంబర్‌గా ఉన్నారా? తరచూ ఫేస్బుక్ గ్రూప్స్‌లో పోస్ట్‌లు చేస్తుంటారా? ఫేస్బుక్ గ్రూప్స్‌లో మీ పేరు కనిపించకుండా పోస్ట్ చేయొచ్చు.
ఫేస్బుక్ రూపొందించిన ఫీచర్స్‌లో గ్రూప్స్ కూడా ఒకటి. వాట్సప్ గ్రూప్ ఎంత పాపులరో ఫేస్బుక్ గ్రూప్స్ (Facebook Features) ఫీచర్ కూడా అంతే పాపులర్. ఫేస్బుక్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఫేస్బుక్ అకౌంట్ (Facebook Account) ఉన్నవారు ఏదో ఓ గ్రూప్‌లో మెంబర్‌గా ఉండటం మామూలే. ఈ గ్రూప్‌లో ఎవరు మెసేజ్ చేసినా, పోస్ట్ చేసినా అది ఎవరు చేశారో తెలుస్తుంది. అయితే ఎవరైనా తమ పేరు కనిపించకుండా గ్రూప్‌లో పోస్ట్ చేయాలంటే సాధ్యం కాదు. అయితే గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ ఓ ఫీచర్ ఎనేబుల్ చేస్తే మాత్రం ఇది సాధ్యమే. ఫేస్బుక్ గ్రూప్ మెంబర్స్‌కు తమ పేరు హైడ్ చేస్తూ పోస్ట్ చేసే స్వేచ్ఛ ఉంది. అయితే గ్రూప్ అడ్మిన్ అనానిమస్ పోస్ట్ ఫీచర్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది.
అయితే ఇక్కడ ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫేస్బుక్ గ్రూప్ అడ్మిన్ అనానిమస్ పోస్ట్ ఫీచర్ ఎనేబుల్ చేస్తే ఎవరైనా తమ పేరు కనిపించకుండా పోస్ట్ చేయొచ్చు. అలాగని వారి పేరు ఎవరికీ కనిపించదనుకుంటే పొరపాటే. ఆ పోస్ట్ ఎవరు చేశారో గ్రూప్ అడ్మిన్లు, మాడరేటర్లు, ఫేస్బుక్ టీమ్స్‌కు తెలిసిపోతుంది. తమ పేరు కనిపించదని అభ్యంతరకరమైన పోస్టులు చేస్తే దొరికిపోవడం ఖాయం. మరి ఈ ఫీచర్ ఎలా వాడుకోవాలో తెలుసుకోండి.
ఫేస్బుక్ గ్రూప్ అనానిమస్ పోస్ట్ ఫీచర్ ఎనేబుల్ చేయండిలా
Step 1- మీ ఫేస్బుక్ అకౌంట్లో లాగిన్ కావాలి.
Step 2- మీరు క్రియేట్ చేసిన గ్రూప్స్ ఓపెన్ చేయాలి.
Step 3- Admin Tools సెక్షన్లో Settings ఓపెన్ చేయాలి.
Step 4- Anonymous Posting సెక్షన్లో ఈ ఫీచర్ ఎనేబుల్ చేయండి.
Step 5- ఆ తర్వాత Save క్లిక్ చేస్తే ఫేస్బుక్ గ్రూప్‌లో అనానిమస్ పోస్ట్ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.