Home /News /technology /

ARE YOU LISTENING OR TEACHING ZOOM ONLINE CLASSES HERE IS NEW UPDATE FOR STUDENTS AND TEACHERS CHECK FOCUS MODE FEATURES JNK GH

Zoom Update: జూమ్‌లో ఆన్‌లైన్ క్లాసులు చెబుతున్నారా లేదా వింటున్నారా? ఈ కొత్త అప్‌డేట్ మీ కోసమే!

జూమ్‌లో కొత్త అప్‌డేట్ చూశారా? ఆన్‌లైన్ క్లాసుల కోసమే ఇది. (PC: Zoom)

జూమ్‌లో కొత్త అప్‌డేట్ చూశారా? ఆన్‌లైన్ క్లాసుల కోసమే ఇది. (PC: Zoom)

ఫోకస్ మోడ్ విద్యార్థులతో పాటు టీచర్లకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ఉపయోగించి విద్యార్థులు షేర్ చేసే వీడియోలు, స్క్రీన్‌ షేర్లను ఇంకా మంచిగా గమనించే అవకాశం ఉంటుంది.

కరోనా సమయంలో ఉద్యోగుల నుంచి విద్యార్థుల వరకు.. ప్రతి ఒక్కరూ వీడియో కాలింగ్ యాప్(Video Calling App) లకు అలవాటు పడ్డారు. ప్రస్తుతం బాగా వాడకంలో ఉన్న వీడియో కాలింగ్ అప్లికేషన్లలో జూమ్ (Zoom) ఒకటి. ఈ యాప్ ఎప్పటికప్పుడు యూజర్లకు (Users) మంచి ఫీచర్లు అందుబాటులోకి తెస్తుంది. తాజాగా ఫోకస్-మోడ్ (Focus Mode) పేరుతో ఒక అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ పాఠ్యాంశాల బోధన సమయంలో విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలగకుండా చేస్తుంది. ఇది విద్యార్థులు శ్రద్ధగా పాఠాలు వినేందుకు సహకరిస్తుంది.

ఫోకస్ మోడ్ విద్యార్థులతో పాటు టీచర్లకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ఉపయోగించి విద్యార్థులు షేర్ చేసే వీడియోలు, స్క్రీన్‌ షేర్లను ఇతర విద్యార్థులకు కనిపించకుండా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల విద్యార్థుల దృష్టి వేరే విషయాల మీదకు వెళ్లదు. విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలగకుండా ఉండేందుకు ఫోకస్ మోడ్ చాలా ఉపయోగపడుతుందని జూమ్ చెబుతోంది. వారు షేర్ చేసే వీడియోలు, స్క్రీన్‌ షేర్లను తోటి విద్యార్థులు చూడలేరు కానీ టీచర్లు మాత్రం చూడగలరు.

ఫోకస్ మోడ్ ఆన్ చేస్తే జూమ్ కాలింగ్ లో పాల్గొనే విద్యార్థులు ఒకరినొకరు చూసుకోలేరు. అయితే ఉపాధ్యాయులు కావాలనుకున్నప్పుడు ఫోకస్ మోడ్‌ని డిసేబుల్ చేయవచ్చు. అప్పుడు విద్యార్థులు తమ తోటి విద్యార్థులతో మాట్లాడగలరు.. అలాగే ఏదైనా అంశంపై డిస్కస్ చేయగలరు. అప్పటివరకూ విద్యార్థులు తోటి విద్యార్థుల పేర్లను, రియాక్షన్లను మాత్రమే చూడగలుగుతారు. ఫోకస్ మోడ్ సమయంలో విద్యార్థులు టీచర్‌ వీడియోనే కాకుండా తమ సొంత వీడియోను కూడా చూడొచ్చు. టీచర్ తోటి విద్యార్థుల మైక్ ని అన్‌మ్యూట్ చేస్తే.. వారి వాయిస్ కూడా వినొచ్చు.

ఈ ఫీచర్ టీచర్లతో పాటు ఉద్యోగులకు కూడా బాగా ఉపయోగపడుతుంది. వర్చువల్ కార్పొరేట్ మీటింగ్‌లో సహోద్యోగులు మీ ప్రజెంటేషన్ శ్రద్ధగా వినాలి అంటే.. ఫోకస్ మోడ్ ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. ఫోకస్ మోడ్‌ను ఉపయోగించాలంటే విండోస్ లేదా మ్యాక్ యూజర్లు జూమ్ డెస్క్‌టాప్ క్లయింట్ వెర్షన్ 5.7.3 ని కలిగి ఉండాలి. దీన్నిబట్టి ఈ ఫీచర్ ని మొబైల్ లో వినియోగించలేమని తెలుస్తోంది.

అయితే, పార్టిసిపెంట్స్ ఓల్డ్ వెర్షన్‌లు ఉపయోగించినప్పటికీ.. వారికి ఫోకస్ మోడ్ ఫీచర్ ఎనేబుల్ చేయవచ్చు. దీని అర్థం టీచర్ కి మాత్రమే జూమ్ డెస్క్‌టాప్ క్లయింట్ వెర్షన్ 5.7.3 ఉన్నా.. విద్యార్థులందరికీ ఫోకస్ మోడ్ ఎనేబుల్ చేయొచ్చు. అందరిపై లేదా కేవలం తమకు నచ్చిన విద్యార్థులపై ఫోకస్ మోడ్ ఎనేబుల్ చేసేందుకు కూడా వీలు ఉంటుంది. ఆన్‌లైన్ క్లాస్ సమయంలో ఈ ఫీచర్ ఎనేబుల్ చేయడానికి జూమ్ వెబ్ పోర్టల్ ద్వారా మీటింగ్ టూల్‌బార్‌లోని 'మోర్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తరువాత 'స్టార్ట్‌ ఫోకస్ మోడ్' పై క్లిక్ చేసి ఎనేబుల్ చేస్తే సరిపోతుంది.
Published by:John Naveen Kora
First published:

Tags: Online classes, Online service

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు