హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio - Airtel - Vi Prepaid Plans: రూ.100 లోపు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ప్లాన్స్ ఇవే

Jio - Airtel - Vi Prepaid Plans: రూ.100 లోపు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ప్లాన్స్ ఇవే

Data Talktime Plans: రూ.100 లోపు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ప్లాన్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Data Talktime Plans: రూ.100 లోపు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ప్లాన్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Data Talktime Plans | మీరు రూ.100 లోపు ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం చూస్తున్నారా? రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా-Vi, బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్స్ గురించి తెలుసుకోండి.

ప్రస్తుత కాలంలో మొబైల్ వినియోగం విపరీతంగా పెరిగింది. జియో రాకతో భారతీయ టెలికాం రంగంలో అనేక మార్పులు వచ్చాయి. అప్పటివరకు వినియోగదారులకు పరిచయం లేని అన్లిమిటెడ్ ఆఫర్లను ప్రతి ఒక్కరికి దగ్గర చేసింది. దీంతో అన్ని కంపెనీలు అన్లిమిటెడ్ ప్లాన్లను ప్రవేశపెట్టాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో, ఇప్పుడు అందరి ఫోన్లలో అన్లిమిటెడ్ ప్లాన్లు సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే, కొంత మంది వినియోగదారులు తక్కువ వాయిస్ కాలింగ్, డేటాను మాత్రమే వినియోగిస్తుంటారు. అయినప్పటికీ, అన్లిమిటెడ్ ప్లాన్ కింద ఎక్కువ మొత్తంలో రీఛార్జ్ చేయాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా-Vi, బీఎస్ఎన్ఎల్ వంటి అన్ని ప్రముఖ మొబైల్ ఆపరేటర్లు తక్కువ ధరలో ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చాయి. కేవలం రూ.10 నుంచే ఈ ప్లాన్లను అందిస్తున్నాయి. ప్రముఖ మొబైల్ ఆపరేటర్లు రూ.100లోపు అందిస్తున్న టాక్‌టైమ్ ప్లాన్స్ చూద్దాం.

ఎయిర్‌టెల్


ఎయిర్‌టెల్ రూ.10 నుంచి రూ.100 వరకు అత్యంత చౌకైన టాక్‌టైమ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఇందులో భాగంగా రూ.45, రూ.49, రూ.79 విలువ చేసే టాక్‌టైమ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. 28 రోజుల వ్యాలిడిటీ గల ఈ ప్లాన్ల కింద 100 ఎంబీ నుంచి 200 ఎంబీ వరకు డేటా పొందవచ్చు. ఇక పోతే ఎయిర్‌టెల్ అందిస్తున్న మరో అద్భుతమై ప్లాన్ రూ .48 డేటా ప్యాక్ ప్లాన్. ఈ ప్లాన్ కింద 28 రోజుల వ్యాలిడిటీ గల 3 జీబీ డేటాను పొందవచ్చు. దీనితో పాటు ఎయిర్‌టెల్ రూ.98 విలువ చేసే మరో డేటా ప్లాన్ను కూడా అందిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటితో వచ్చే ఈ ప్లాన్ కింద 12 జీబీ డేటా లభిస్తుంది.

Xiaomi: షావోమీ యూజర్లకు షాక్... సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయగానే ఆ ఫోన్లన్నీ స్విచాఫ్

Jio Plans: జియో బెనిఫిట్స్ మారాయి... రోజూ 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఇవే

వొడాఫోన్ ఐడియా-Vi


ప్రముఖ మొబైల్ దిగ్గజాలు వొడాఫోన్, ఐడియాలు జతకట్టి ఇటీవలే ‘వి’ (Vi ) అనే నూతన బ్రాండ్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. Vi రూ.100లోపు అనేక చౌకైన టాక్‌టైమ్ ప్లాన్లను అందిస్తుంది. ‘వి’ అందిస్తున్న రూ .49, రూ .59, రూ .65, రూ .79, రూ .85 కాంబో ప్లాన్‌లతో 400 ఎమ్‌బి వరకు డేటా, టాక్‌టైమ్ బెనిఫిట్స్(Benefits)ను పొందవచ్చు. వీటితో పాటు వోడాఫోన్ ప్రత్యేకంగా రూ .48 విలువ చేసే డేటా ప్యాక్ను అందిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీ(Validity) గల ఈ ప్యాక్ కింద మొత్తం 3 జిబి డేటాను లభిస్తుంది. వొడాఫోన్ యాప్ ద్వారా ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 200 MB అదనపు డేటా కూడా లభిస్తుంది. దీనితో పాటు వొడాఫోన్ ఐడియా రూ. 98 విలువ గల మరో డేటా ప్యాక్ను ఆఫర్ చేస్తోంది. 28 రోజుల వ్యాలిడిటీ గల ఈ ప్యాక్ కింద12GB డేటా లభిస్తుంది.

రిలయన్స్ జియో


రిలయన్స్ జియో(Jio) రూ .10, రూ .20, రూ .50, రూ .100 చొప్పున రీఛార్జ్ వోచర్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్ల కింద వరుసగా 1 జీబీ, 2 జీబీ, 5 జీబీ, 10 జీబీ డేటాతో పాటు టాక్‌టైమ్ బెనిఫిట్స్ లభిస్తాయి. వీటితో పాటు జియో రూ. 101 విలువ చేసే మరో 4జి డేటా వోచర్‌ను కూడా అందిస్తుంది. దీని కింద 1362 ఐయుసి నిమిషాల టాక్‌టైమ్ బెనిఫిట్స్‌తో పాటు 12 జీబీ కాంప్లిమెంటరీ డేటా కూడా లభిస్తుంది.

Xiaomi Mi 11: కేవలం 5 నిమిషాల్లో 3,50,000 స్మార్ట్‌ఫోన్లు అమ్ముడుపోయాయి... ఈ మోడల్ ప్రత్యేకత ఏంటంటే

WhatsApp: ఈ రెండు సెట్టింగ్స్‌తో మీ వాట్సప్ సేఫ్... వెంటనే మార్చేయండి

బీఎస్ఎన్ఎల్


ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ రూ.100లోపు అనేక చౌకైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుంది. ఇందులో భాగంగా రూ .94, రూ .95 విలువచేసే ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. 90 రోజుల వ్యాలిడిటీ గల ఈ ప్లాన్‌ కింద 3 జిబి హై-స్పీడ్ డేటాతో పాటు 100 నిమిషాల ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతో పాటు రూ. 39 విలువ చేసే కాంబో ప్యాక్ను కూడా అందిస్తుంది. 14 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్యాక్ కింద 100 ఎంబి డేటాతో పాటు టాక్‌టైమ్ బెనిఫిట్స్ పొందవచ్చు. దీనితో పాటు రూ. 51లకు మరో ప్లాన్ను కూడా అందిస్తుంది. దీని కింద 656 IUC నిమిషాల టాక్‌టైమ్ బెనిఫిట్స్, 6 జిబి కాంప్లిమెంటరీ డేటా లభిస్తుంది.

First published:

Tags: AIRTEL, Airtel recharge plans, BSNL, Jio, Jio phone, Reliance Jio, VODAFONE, Vodafone Idea

ఉత్తమ కథలు