PUBG: పబ్‌జీ ఆడుతున్నారా? ఈ 10 తప్పులు అస్సలు చేయొద్దు

PUBG MOBILE | పబ్‌జీ మొబైల్ ఆడేప్పుడు మౌస్, మొబైల్ గేమ్ కంట్రోలర్ లాంటి థర్డ్-పార్టీ హార్డ్‌వేర్‌ని ఉపయోగించడాన్ని గేమ్ డెవలపర్లు ఒప్పుకోరు. అలాంటి డివైజ్‌లు ఉపయోగిస్తే కంపెనీ మీపైన లీగల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు.

news18-telugu
Updated: January 11, 2019, 9:42 AM IST
PUBG: పబ్‌జీ ఆడుతున్నారా? ఈ 10 తప్పులు అస్సలు చేయొద్దు
PUBG: పబ్‌జీ ఆడుతున్నారా? ఈ 10 తప్పులు చేస్తే నిషేధం తప్పదు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పబ్‌జీ మొబైల్... యూత్‌లో ఓ ఊపు ఊపేస్తున్న వీడియో గేమ్. యుద్ధక్షేత్రంలో దిగి గెలిచేందుకు యూత్ ఎన్నో వ్యూహాలు రచిస్తుంటారు. అయితే కొందరు పబ్‌జీలో ఛీటింగ్ చేసి గెలుస్తుండటంతో... నిజాయితీగా ఆడుతున్నవాళ్లు ఓడిపోవాల్సివస్తోంది. అందుకే ఛీట్ చేసేవాళ్లను పబ్‌జీ డెవలపర్లు బ్యాన్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ బాట్ రాడార్ హ్యాక్ చీట్ ఉపయోగించి ఛీట్ చేస్తున్న 30,000 మంది ప్లేయర్స్‌పై గత నెలలో నిషేధం విధించారు. మరి మీరు పబ్‌జీ గేమ్ ఆడేప్పుడు ఏఏ తప్పులు చేయకూడదో తెలుసుకోండి.

1. పబ్‌జీలో వీపీఎన్ లేదా థర్డ్ పార్టీ ప్రోగ్రామ్స్ ఉపయోగించడంరాయల్ పాస్ మిషన్‌ని పూర్తి చేసేందుకు చాలా మంది వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ ద్వారా డిఫాల్ట్ లొకేషన్ మారుస్తున్నారు. థర్డ్ పార్టీ బాట్ రాడార్ హ్యాక్ చీట్ ద్వారా ఛీట్ చేస్తున్నారు. వీపీఎన్ సర్వర్ ఉపయోగించి సెకండ్ స్క్రీన్ ద్వారా ఇతర ప్లేయర్లను గుర్తిస్తున్నారు. ఇలాంటి అక్రమ సాఫ్ట్‌వేర్ మీరు ఉపయోగిస్తే మీరు బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్తారు జాగ్రత్త.

2. పబ్‌జీలో అనధికారిక హార్డ్‌వేర్


పబ్‌జీ మొబైల్ ఆడేప్పుడు మౌస్, మొబైల్ గేమ్ కంట్రోలర్ లాంటి థర్డ్-పార్టీ హార్డ్‌వేర్‌ని ఉపయోగించడాన్ని గేమ్ డెవలపర్లు ఒప్పుకోరు. అలాంటి డివైజ్‌లు ఉపయోగిస్తే కంపెనీ మీపైన లీగల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు.

3. పబ్‌జీ గేమ్ డేటా ట్యాంపరింగ్


ఫైల్ ఫార్మాట్స్ లాంటి గేమ్ డేటాను మార్చడాన్ని పబ్‌జీ నిషేధించింది. ఇలా చేస్తే కాపీరైట్స్ చట్టాలను ఉల్లంఘించినట్టే. గేమ్ సర్వీసెస్ ద్వారా ప్యాకెట్ డేటా, సర్వర్ ఇంటర్‌ఫీర్స్ మార్చడం కూడా తప్పే.

4. పబ్‌జీ బగ్స్‌ని వాడుకోవడం


ఏ సాఫ్ట్‌వేర్ అయినా బగ్స్ ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు బగ్స్ ఫిక్స్ చేస్తుంటారు డెవలపర్లు. ప్లేయర్లు ఎవరైనా బగ్స్‌ని గుర్తించి అడ్వాంటేజ్ తీసుకోవడం కూడా తప్పే. జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

5. పబ్‌జీ గేమ్‌ ప్రారంభమవగానే వదిలేయడం


గేమ్‌లో జాయిన్ కావడం, ఆట మొదలుకావడానికి ముందే వెళ్లిపోవడం చాలామంది ప్లేయర్లకు అలవాటు. కొత్త రూల్ ప్రకారం మీరు తరచూ ఇలా చేస్తే మిమ్మల్ని కొన్ని గంటలపాటు బ్యాన్ చేయొచ్చు.

6. పబ్‌జీలో సొంత టీమ్ మేట్స్‌ని చంపడం


యూజర్లు తమ టీమ్ ప్లేయర్స్‌ని లోడెడ్ గన్స్‌తో చంపడం సరికాదు. అయితే గ్రెనేడ్ ఉపయోగించి, కారుతో గుద్ది చంపడం మామూలే. ప్లేయర్లు దొంగాట ఆడినట్టు డెవలపర్లు గుర్తిస్తే పెనాల్టీలు తప్పవు.

7. పబ్‌జీ గేమ్ నుంచి లాభాలు పొందడం


పబ్‌జీ గేమ్ నుంచి నేరుగా లాభాలు పొందడాన్ని డెవలపర్లు నిషేధించారు. ఇందుకోసం పబ్‌జీ నుంచి ముందస్తుగా అప్రూవల్ పొందాలి.

8. పబ్‌జీలో ఇతర ప్లేయర్లను హ్యాక్ చేయడం


ఇతర ప్లేయర్ల అకౌంట్లను వారి అనుమతి లేకుండా, అనధికారికంగా హ్యాక్ చేస్తే మీరు నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

9. పబ్‌జీలో ప్లేయర్స్‌ని దూషించడం


పబ్‌జీ ప్లేయర్లు ఒకరితో మరొకరు సంభాషించే అవకాశముంటుంది. అయితే ఈ సమయంలో ప్లేయర్లు అసభ్య పదజాలం ఉపయోగిస్తే జీవితాంతం నిషేధం ఎదుర్కొంటారు.

10. పబ్‌జీలో ఇతర ప్లేయర్ల సమాచారాన్ని పంచుకోవడం


ప్రైవసీ గైడ్‌లైన్స్ ప్రకారం మీది లేదా ఇతర ప్లేయర్ల పర్సనల్ డేటాను షేర్ చేయడం ద్వారా మీపై చర్యలు తప్పవు.

ఇవి కూడా చదవండి:

పబ్‌జీ గేమ్ ఆడితే పిచ్చెక్కింది... జమ్మూలో ఆస్పత్రిపాలైన ఫిట్‌నెస్ ట్రైనర్

Good News: వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్

మొబైల్ వ్యాలెట్‌లో డబ్బులు పోయాయా? మీరేం చేయాలో తెలుసుకోండి

Fake Apps: 85 యాప్స్ తొలగించిన గూగుల్... అవి మీ దగ్గరున్నాయా?
First published: January 11, 2019, 9:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading