హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartphone: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా? జనవరి 1 నుంచి కొత్త రూల్

Smartphone: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా? జనవరి 1 నుంచి కొత్త రూల్

Smartphone: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా? జనవరి 1 నుంచి కొత్త రూల్
(ప్రతీకాత్మక చిత్రం)

Smartphone: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా? జనవరి 1 నుంచి కొత్త రూల్ (ప్రతీకాత్మక చిత్రం)

Smartphone | దొంగిలించిన స్మార్ట్‌ఫోన్లు దుర్వినియోగం కాకుండా, నకిలీ మొబైల్స్‌ని (Fake Smartphones) గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి కొత్త రూల్ అమలుచేయబోతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

గుర్తుతెలియని వ్యక్తుల దగ్గర్నుంచి సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌‌ఫోన్ (Second Hand Smartphone) కొంటున్నారా? అది దొంగిలించిన ఫోన్ కావొచ్చు. లేదా నకిలీ మొబైల్ కూడా కావొచ్చు. అలాంటి మొబైల్ కొంటే చిక్కుల్లో పడబోయేది మీరే. ఇలాంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని కొత్త రూల్ తీసుకొస్తోంది. దొంగిలించిన, పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం అతిపెద్ద చర్య తీసుకోబోతోంది. 2023 జనవరి 1 నుంచి భారతదేశంలో స్మార్ట్‌ఫోన్స్, ఫీచర్ ఫోన్స్ తయారుచేసే కంపెనీలన్నీ, ఆ హ్యాండ్‌సెట్స్ అమ్మడానికన్నా ముందే ఇండియన్ కౌంటర్‌ఫీటెడ్ డివైజ్ రిస్ట్రిక్షన్ పోర్టల్ https://icdr.ceir.gov.in లో రిజిస్టర్ చేయాలి. ప్రతీ హ్యాండ్‌సెట్ ఐఎంఈఐ నెంబర్ ఈ పోర్టల్‌లో రిజిస్టర్ చేయాలి.

భారతదేశంలో డూప్లికేట్ ఐఎంఈఐ నెంబర్లు, ఫేక్ ఐఎంఈఐ నెంబర్లతో లక్షలాది ఫీచర్ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో బయటపడ్డ సంగతి తెలిసిందే. పాపులర్ బ్రాండ్లకు చెందిన మొబైల్స్ లాగానే చైనా నుంచి డూప్లికేట్ ఫోన్లు వచ్చాయి. ఒరిజినల్, డూప్లికేట్ గుర్తించడం కూడా కష్టం. ఈ కొత్త నిబంధనతో ఇలాంటి డూప్లికేట్ ఫోన్లకు చెక్ పెట్టొచ్చు. కంపెనీ స్వయంగా ఐఎంఈఐ నెంబర్‌ను ఈ పోర్టల్‌లో రిజిస్టర్ చేస్తుంది కాబట్టి ట్రాక్ చేయడం సులువవుతుంది.

Exchange Offer: మీ పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేసి ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,000 లోపే కొనండి

అంతేకాదు ఎవరైనా తమ మొబైల్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా బ్లాక్ చేయడం కూడా సాధ్యం అవుతుంది. దీనివల్ల పోగొట్టుకున్న ఫోన్ దుర్వినియోగం కాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. దీంతో పాటు భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల బ్లాక్ మార్కెటింగ్‌ను కూడా నిరోధించవచ్చు. రెండేళ్ల క్రితం మీరట్ పోలీసులు ఒకే ఐఎంఈఐ నెంబర్ ఉన్న 13,500 వివో స్మార్ట్‌ఫోన్లను గుర్తించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇకపై ఇలాంటి వాటికి చెక్ పెట్టొచ్చు. భారతదేశంలో తయారయ్యే ఫోన్లతో పాటు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఐఫోన్లు, సాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లకు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది.

ప్రతీ ఫోన్‌కు ఐఎంఈఐ నెంబర్ విభిన్నంగా ఉంటుంది. సేమ్ ఐఎంఈఐ నెంబర్‌తో మరో ఫోన్ ఉండదు. ఒకవేళ అలా ఉంటే అందులో ఒకటి డూప్లికేట్ ఫోన్ అని అర్థం చేసుకోవచ్చు. ఐఎంఈఐ నెంబర్ ద్వారా క్రిమినల్స్‌ని ట్రాక్ చేయొచ్చు. ఏదైనా నేరంలో ఒక ఫోన్ ఉపయోగించి, తర్వాత సిమ్ కార్డ్ తీసేసి కొత్త సిమ్ కార్డ్ వాడటం నేరగాళ్లకు అలవాటు. సిమ్ కార్డ్ మార్చొచ్చు కానీ ఐఎంఈఐ నెంబర్ మార్చడం సాధ్యం కాదు. కాబట్టి పోలీసులు ఐఎంఈఐ నెంబర్ ద్వారా అనేక కేసుల్ని ఛేదించిన ఘటనలున్నాయి.

Amazon Offer: ఈ మొబైల్‌పై రూ.12,300 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్... ఆఫర్ వివరాలివే

మీరు కొత్త మొబైల్ కొన్నా, సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్నా మీ ఫోన్‌కు ఐఎంఈఐ నెంబర్ ఉందో లేదో చెక్ చేయండి. ఐఎంఈఐ నెంబర్ లేకుండా ఏదైనా ఫోన్ ఉందంటే అది నకిలీదే. ఐఎంఈఐ నెంబర్ చెక్ చేయడానికి డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి *#06# నెంబర్ ఎంటర్ చేస్తే చాలు. డ్యూయెల్ సిమ్ కార్డ్ సపోర్ట్ ఉన్న ఫోన్లకు రెండు ఐఎంఈఐ నెంబర్లు ఉంటాయి.

First published:

Tags: 5G Smartphone, Smartphone

ఉత్తమ కథలు