హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Redmi: మీరు కొన్న రెడ్‌మీ ప్రొడక్ట్స్ నకిలీవా? గుర్తించండి ఇలా

Redmi: మీరు కొన్న రెడ్‌మీ ప్రొడక్ట్స్ నకిలీవా? గుర్తించండి ఇలా

Redmi: మీరు కొన్న రెడ్‌మీ ప్రొడక్ట్స్ నకిలీవా? గుర్తించండి ఇలా

Redmi: మీరు కొన్న రెడ్‌మీ ప్రొడక్ట్స్ నకిలీవా? గుర్తించండి ఇలా

మీరు రెడ్‌మీ, ఎంఐ పవర్ బ్యాంక్, ఇయర్‌ఫోన్, బ్లూటూత్ హెడ్‌సెట్ కొనాలనుకుంటున్నారా? నకిలీ ప్రొడక్ట్స్‌ని ఈ టిప్స్‌తో గుర్తించండి.

మీరు షాపులో కాకుండా బయట ఎక్కడైనా ఎంఐ పవర్ బ్యాంక్ కొన్నారా? రెడ్‌మీ ఇయర్‌ఫోన్స్ తీసుకున్నారా? ఇలా మీరు బయట కొన్న ప్రొడక్ట్స్ అన్నీ ఒరిజనలేనా? లేక నకిలీ ప్రొడక్ట్స్ కొన్నారా? మార్కెట్‌లో కుప్పలుతెప్పలుగా నకిలీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో షావోమీకి చెందిన ఎంఐ, రెడ్‌మీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. బెంగళూరు, చెన్నైలో ఎంఐ ఇండియా నకిలీ ప్రొడక్ట్స్ భారీగా బయటపడ్డాయి. అక్టోబర్, నవంబర్‌లో బెంగళూరులో ముగ్గురు సప్లయర్స్, చెన్నైలో నలుగురు సప్లయర్స్ నుంచి రూ.33 లక్షల రూపాయల నకిలీ ప్రొడక్ట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇయర్‌ఫోన్స్, ఛార్జర్లు, పవర్ బ్యాంక్స్, హెడ్‌ఫోన్స్, బ్యాక్ కేసెస్ లాంటి 3000 నకిలీ ప్రొడక్ట్స్ గుర్తించినట్టు షావోమీ ఇండియా ప్రకటించింది. ఇవే కాదు... దేశవ్యాప్తంగా షావోమీ ఇండియా సబ్ బ్రాండ్స్ అయిన ఎంఐ, రెడ్‌మీ ప్రొడక్ట్స్ నకిలీవి కోట్లల్లో ఉన్నాయి. ఇలాంటి ప్రొడక్ట్స్ షాపుల్లో కాకుండా ఎక్కువగా రోడ్డుమీద అమ్ముతుంటారు. బ్రాండ్ పేరు రెడ్‌మీ, ఎంఐ అని కనిపించేసరికి కస్టమర్లు అవి ఒరిజినల్ ప్రొడక్ట్స్ అనుకొని కొంటున్నారు. కానీ వాటిలో దాదాపుగా అన్నీ నకిలీ ప్రొడక్ట్సే ఉంటాయి.

WhatsApp OTP scam: అలర్ట్... వాట్సప్‌లో ఓటీపీ స్కామ్ కలకలం... తప్పించుకోండి ఇలా

Prepaid Plans: 84 రోజుల వేలిడిటీ, 4జీ డేటా కావాలా? Airtel, Jio, Vi ప్లాన్స్ ఇవే

' isDesktop="true" id="669386" youtubeid="WKh7gVPDK1w" category="technology">

ఈ ఫేక్ ప్రొడక్ట్స్ షావోమీ ఇండియాకు పెద్ద తలనొప్పిగా మారాయి. నకిలీవి ఎలా గుర్తించాలో వివరిస్తూ గతంలో యూట్యూబ్‌లో క్యాంపైన్ నిర్వహించింది షావోమీ ఇండియా. మీరు ఒరిజినల్ ప్రొడక్ట్స్ కొనాలంటే కొన్ని టిప్స్ గుర్తుంచుకోవాలి. ఒరిజినల్ ప్యాకేజింగ్, నకిలీ ప్రొడక్ట్ ప్యాకేజింగ్‌లో చాలా తేడా ఉంటుంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే అసలు షావోమీ నుంచి లేని ప్రొడక్ట్స్‌ని కూడా ఆ బ్రాండ్ పేరుతో అమ్మేస్తున్నారు. మీరు అఫీషియల్ స్టోర్స్ నుంచే ప్రొడక్ట్స్ కొంటే మోసపోయే ఛాన్స్ ఉండదు. అందుకే ఎంఐ ఆథరైజ్డ్ స్టోర్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని అక్కడే ప్రొడక్ట్స్ కొనాలి. ఇక మీరు ఏదైనా షావోమీ ప్రొడక్ట్స్ కొనాలనుకుంటే ముందుగా ఆ కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రొడక్ట్ చెక్ చేయాలి. ఎలా ఉందో చూడాలి. మీరు బయట కొనే ప్రొడక్ట్ అలాగే ఉందో లేదో చూడాలి. లేదా యూట్యూబ్‌లో ఆ ప్రొడక్ట్ వీడియో చెక్ చేయాలి. దీని వల్ల ఒరిజినల్ ప్రొడక్ట్ చూడ్డానికి ఎలా ఉంటుందో మీకు ఓ అవగాహన వస్తుంది.

Earphones: ఇయర్‌ఫోన్స్ ఎక్కువగా వాడితే ఎంత డేంజరో తెలుసా?

రూ.3.999 విలువైన Google Nest Mini స్పీకర్ ఫ్రీగా ఇస్తున్న గూగుల్... వారికి మాత్రమే

' isDesktop="true" id="669386" youtubeid="UOn9HTUE53c" category="technology">

మీరు నకిలీ ప్రొడక్ట్స్ గుర్తించాలంటే ముందుగా ప్యాకెట్ పూర్తిగా చెక్ చేయాలి. నకిలీ ప్రొడక్ట్స్ బాక్సుపై చాలావరకు స్పెల్లింగ్ మిస్టేక్స్ కనిపిస్తాయి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నట్టైతే అవి నకిలీ ప్రొడక్ట్‌గా భావించొచ్చు. పవర్ బ్యాంకులు కూడా అంతే. చూడ్డానికి ఒకేలా ఉంటాయి. కానీ బాక్సు ఓపెన్ చేసి చూస్తే అసలు విషయం తెలుస్తుంది. షావోమీ అమ్మే ప్రతీ ప్రొడక్ట్‌పై సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. ఆ కోడ్‌ని స్క్రాచ్ చేసి https://www.mi.com/ వెబ్‌సైట్‌లో వెరిఫై చేయొచ్చు. ప్రొడక్ట్‌పై లోగో సరిగ్గా ఉందో లేదో చూడా చెక్ చేయాలి.

First published:

Tags: MI BAND, Redmi, Xiaomi

ఉత్తమ కథలు