హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

AC Buying Guide: కొత్త ఏసీ కొంటున్నారా? కెపాసిటీ, ఫీచర్స్ ఇలా సెలెక్ట్ చేయండి

AC Buying Guide: కొత్త ఏసీ కొంటున్నారా? కెపాసిటీ, ఫీచర్స్ ఇలా సెలెక్ట్ చేయండి

AC Buying Guide: కొత్త ఏసీ కొంటున్నారా? కెపాసిటీ, ఫీచర్స్ ఇలా సెలెక్ట్ చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)

AC Buying Guide: కొత్త ఏసీ కొంటున్నారా? కెపాసిటీ, ఫీచర్స్ ఇలా సెలెక్ట్ చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

AC Buying Guide | కొత్త ఏసీ కొంటున్నారా? అయితే కెపాసిటీ, ఫీచర్స్ గురించి తెలుసుకోకపోతే మీరు సరైన ఏసీ సెలెక్ట్ చేయలేకపోవచ్చు. ఏసీ కొనేముందు ఏసీ పనితీరుపై అవగాహన పెంచుకోవాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

వేసవి వచ్చిందంటే చాలు ఎయిర్ కండీషనర్లకు (Air Conditioner), ఎయిర్ కూలర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇప్పుడే ఎండలు మండిపోతున్నాయి. మే నాటికి టెంపరేచర్లు పెరిగిపోవడం ఖాయం. మరి ఈ వేసవితాపాన్ని తట్టుకోవడం కోసం మీరు ఏసీ కొనాలనుకుంటున్నారా? ఇప్పుడు ఉన్న ఏసీ తీసేసి మంచి ఫీచర్స్ ఉన్న కొత్త ఏసీ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? ఏసీ కొనే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి. ఏసీ కెపాసిటీ (AC Capacity), గది సైజ్, ఏసీలో లభించే ఫీచర్స్ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మళ్లీ మళ్లీ కొనే వస్తువు కాబట్టి అన్నీ పరిశీలించిన తర్వాతే ఏసీ కొనాలి. మరి ఏసీ కొనే ముందు ఏఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలో తెలుసుకోండి.

ఏసీల్లో స్ప్లిట్ ఏసీ, విండో ఏసీ, పోర్టబుల్ ఏసీ, సెంట్రలైజ్డ్ ఏసీ అని వేర్వేరు రకాలు ఉంటాయి. వీటి మధ్య తేడాలు ఏంటో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఇళ్లల్లోకి ఎక్కువగా తీసుకునే ఏసీల్లో విండో ఏసీ, స్ప్లిట్ ఏసీ ఉంటాయి. ఇంట్లో అవసరాలకు ఈ రెండు రకాల ఏసీలు సరిపోతాయి. వీటిలో విండో ఏసీ ధర కాస్త తక్కువగా ఉంటుంది. కిటికీకి అమర్చే ఏసీ ఇది. స్ప్లిట్ ఏసీ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. స్ప్లిట్ ఏసీలో రెండు యూనిట్స్ ఉంటాయి. రూమ్‌లో ఒక యూనిట్ ఇన్‌స్టాల్ చేసి, మరో యూనిట్‌ను బాల్కనీలో ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ గదిని బట్టి విండో ఏసీ లేదా స్ప్లిట్ ఏసీ ఎంచుకోవాలి.

Redmi Note 12: రెడ్‌మీ నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్ ... ధర రూ.8,999 నుంచే

ఇక ఏసీ కెపాసిటీని టన్నుల్లో కొలుస్తారు. గదిని చల్లగా చేసే కెపాసిటీని టన్నుతో కొలుస్తారు. సాధారణంగా ఏసీలు 1 నుంచి 2 టన్నుల మధ్యే లభిస్తాయి. గది పరిమాణం 100 చదరపు అడుగుల నుంచి 125 చదరపు అడుగుల మధ్య ఉంటే 1 టన్ ఏసీ సరిపోతుంది. 150 చదరపు అడుగుల నుంచి 200 చదరపు అడుగుల మధ్య గది ఉన్నట్టైతే 1.5 టన్ ఏసీ తీసుకోవాలి. ఇక గది సైజ్ 200 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉంటే 2 టన్ ఏసీ తీసుకోవాలి.

ఇంట్లో ఏసీ ఉంటే కరెంట్ బిల్ భారీగా రావడం ఖాయం. ఏసీకి విద్యుత్ ఎక్కువ ఖర్చవుతుంది. అందుకే ఏసీ కొనేప్పుడు ఎనర్జీ ఎఫీషియెంట్ రేటింగ్ చెక్ చేయాలి. ప్రతీ ఏసీపైన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ-BEE రేటింగ్ 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ అని ఉంటుంది. 5 స్టార్ ఉన్న ఏసీ తీసుకుంటే విద్యుత్ తక్కువ ఖర్చవుతుంది. అయితే 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ ధర ఎక్కువగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి.

JioFiber Plan: రేపటి నుంచి ఐపీఎల్... నేటి నుంచి జియోఫైబర్ కొత్త ప్లాన్

ఏసీ ఫీచర్స్ విషయానికి వస్తే కొన్ని ఏసీల్లో యాంటీ బ్యాక్టీరియా ఫిల్టర్స్, ఆటో క్లీన్ ఫంక్షన్స్, కాపర్ కాయిల్స్ లాంటి ఫీచర్స్ ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ ఉన్న ఏసీ తీసుకుంటే దుమ్ము పురుగులు, బ్యాక్టీరియా, చిన్న హానికరమైన పదార్థాలు, సూక్ష్మజీవులను ఫిల్టర్ చేస్తుంది. కూలింగ్, హీటింగ్ ఫీచర్ ఉన్న ఏసీ తీసుకుంటే చలికాలంలో గదిని వెచ్చగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.

డీహ్యూమిడిఫైయర్ ఫీచర్ ఉంటే వర్షాకాలంలో గాలిలోని అదనపు తేమను వదిలించుకోవచ్చు. ఆటో క్లీన్ ఫంక్షన్ ఫీచర్ ఉంటే హానికరమైన సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించవచ్చు. స్లీప్ మోడ్ ఫీచర్‌తో ప్రతీ గంటకు కూలింగ్ తగ్గిస్తూ మీ పవర్ బిల్‌ను ఆదా చేయొచ్చు. ఏసీ కండెన్సర్లు కాయిల్స్ ద్వారా గాలిని చల్లబరుస్తాయి. కాపర్ కాయిల్స్ ఉన్న ఏసీతో గాలి త్వరగా చల్లబడుతుంది. మెయింటైన్ చేయడం కూడా సులువే.

First published:

Tags: Air conditioners, Summer