గూగుల్... ప్రపంచంలో అతిపెద్ద సెర్చ్ ఇంజిన్. కాస్త ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉన్నవాళ్లకు గూగుల్ గురించి తప్పకుండా తెలుసు. గూగుల్ అందించే రకరకాల సేవల్ని ఉపయోగిస్తుంటారు కూడా. ఇమెయిల్, మ్యాప్స్, యూట్యూబ్... ఇలా గూగుల్ అనేక రకాల సేవల్ని అందిస్తుంది. చాలామందికి గూగుల్ ఉపయోగించకుండా రోజు గడవదంటే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రతీ నెలా 100 కోట్ల మంది యాక్టీవ్ యూజర్లున్నారు. మీరు గూగుల్ సేవల్ని ఉపయోగించుకుంటున్నారని అనుకోవచ్చు కానీ... గూగుల్ మీ పర్సనల్ డేటాను కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అసలు గూగుల్ ఎన్ని మార్గాల్లో మీ డేటాను సేకరిస్తుందో తెలుసుకుంటే షాకవ్వాల్సిందే. మీరు గూగుల్‌ను వాడకపోయినా మీ గురించి ఎంతో కొంత గూగుల్‌కు తెలుస్తుంది. మరి గూగుల్ మీ డేటాను ఎలా సేకరిస్తుందో తెలుసుకోండి.
1. గూగుల్ ప్లాట్‌ఫామ్స్: మీరు గూగుల్‌కు చెందిన జీమెయిల్, యూట్యూబ్, సెర్చ్, డ్రైవ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో లాగ్ ఇన్ అయ్యారంటే మీ పర్సనల్ డేటా గూగుల్ చేతుల్లోకి వెళ్తుంది.
2. గూగుల్ యాప్స్: మీరు ఏవైనా యాప్స్ ఉపయోగించినా ఆ డేటా గూగుల్‌కు చేరే అవకాశముంది. మీ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని యాప్స్ రన్నింగ్ స్టేటస్‌లో ఉంటాయి. వాటి ద్వారా మీ డేటా గూగుల్‌కు తెలుస్తుంది.

ప్రతీకాత్మక చిత్రం
3. గూగుల్ మ్యాప్స్: మీరు గూగుల్ మ్యాప్స్‌లో ఏదైనా ప్రాంతం కోసం వెతికినా, ప్రయాణంలో ఉన్నప్పుడు జీపీఎస్ ఆన్ చేసినా, మెట్రోలో ప్రయాణించేందుకు స్టేషన్ సెర్చ్ చేసినా మీ లొకేషన్ గూగుల్‌కు తెలుస్తుంది. మీరు నడుస్తున్నారో, బైక్ పైన వెళ్తున్నారో, కార్లో వెళ్తున్నారో కూడా అంచనా వేయగలదు గూగుల్.
4. గూగుల్ న్యూస్: మీరు గూగుల్‌లో ఏ వార్తలు ఎక్కువ చదువుతున్నారో గూగుల్ ట్రాక్ చేస్తుంది. మీ ఆసక్తి, అభిరుచుల్ని బట్టి యాడ్స్ చూపిస్తుంది.
5. గూగుల్ మ్యూజిక్: మీరు గూగుల్ మ్యూజిక్‌లో పాటలు విన్నా సరే... మీరు విన్న పాటల్ని బట్టి మీ ప్రొఫైల్ రూపొందిస్తుంది గూగుల్. ఆ ప్రొఫైల్‌కు తగ్గ యాడ్స్‌తో టార్గెట్ చేస్తుంది.
6. గూగుల్ పే: గూగుల్ పే ద్వారా మీరు పేమెంట్స్‌తో మీ దగ్గర ఎన్ని డెబిట్ కార్డ్స్ ఉన్నాయి? ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో తెలుసుకోగలదు గూగుల్. అంతేకాదు... మీరు ఏఏ సర్వీసులకు, వస్తువులకు పేమెంట్ చేశారో కూడా తెలుస్తుంది.

ప్రతీకాత్మక చిత్రం
7. జీమెయిల్: మీ జీమెయిల్లో ఉన్న సమాచారాన్ని కూడా స్కాన్ చేస్తుంది గూగుల్. వాటి ద్వారా కస్టమైజ్డ్ యాడ్స్ పంపిస్తుంది.
8. యూట్యూబ్: మీరు యూట్యూబ్‌లో తరచూ ఒకేరకమైన వీడియోలు చూస్తుంటే... కొన్ని రోజుల తర్వాత మీకు ఎక్కువగా అలాంటి వీడియోస్ మీకు కనిపిస్తాయి. మీరు సెర్చ్ చేయకపోయినా అవే వీడియోలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ఇందుకు కారణం గూగుల్ మీ అభిరుచుల్ని తెలుసుకోవడమే.
9. యాప్స్: ఇవి మాత్రమే కాదు... గూగుల్‌కు మీ డేటాను ఎప్పటికప్పుడు అందించే థర్డ్ పార్టీ యాప్స్ అనేకం ఉన్నాయి. ఉదాహరణకు మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇకామర్స్ సైట్లల్లో మీరు ఏదైనా ప్రొడక్ట్ సెర్చ్ చేశారంటే... ఆ తర్వాత మీరు ఏ సైట్ ఓపెన్ చేసినా అవే యాడ్స్ కనిపిస్తాయి.
10. టార్గెటెడ్ యాడ్స్: ఇలా వేర్వేరు మార్గాల్లో మీ డేటాను సేకరించే గూగుల్... ఆ డేటా ఆధారంగా టార్గెటెడ్ యాడ్స్‌తో నెటిజన్లను టార్గెట్ చేస్తుంది గూగుల్.
Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి
ఇవి కూడా చదవండి:
Budget 2019: స్మార్ట్‌ఫోన్ కొనాలా? రూ.15,000 లోపు టాప్-10 మోడల్స్ ఇవే...
Aadhaar Franchise: ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్‌కు దరఖాస్తు చేసుకోండి ఇలా
SBI-Aadhaar: ఒక్క నిమిషంలో మీ ఎస్బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయండి ఇలా...