Dual-screen MacBook: డ్యూయల్​ స్క్రీన్ మ్యాక్​బుక్​ పేటెంట్ హక్కులు సాధించిన యాపిల్ సంస్థ.. త్వరలో డిజైన్ మారనుందా?

ప్రతీకాత్మక చిత్రం

యాపిల్​ తాజాగా యూఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్ నుంచి మ్యాక్ బుక్ లాప్ టాప్లకు పేటెంట్ హక్కులు సాధించింది.ఈ పేటెంట్ సాధించిన డిజైన్​నిపేటెంట్లీ యాపిల్ అనేట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడించింది.

  • Share this:
యాపిల్ సంస్థ తన డిజైన్లను ఎప్పటికప్పుడు మారుస్తూ మార్కెట్లో టాప్​ బ్రాండ్​గా కొనసాగుతోంది. యాపిల్​ తాజాగా యూఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్ నుంచి మ్యాక్ బుక్ లాప్ టాప్లకు పేటెంట్ హక్కులు సాధించింది.ఈ పేటెంట్ సాధించిన డిజైన్​నిపేటెంట్లీ యాపిల్ అనేట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడించింది. దీని ప్రకారం చూస్తే, మ్యాక్ బుక్లో డ్యుయల్ డిస్ ప్లే కనిపిస్తోంది. ఫిజికల్ కీ బోర్డ్ స్థానంలో వర్చువల్ కీ బోర్డ్​,బిల్ట్ ఇన్ ఐఫోన్ ఛార్జర్​నిఅందించింది.ఈ పేటెంట్ మూడు సంవత్సరాల క్రితం ఫైల్ చేసింది యాపిల్ సంస్థ. అయితే, ఇప్పుడు దీనికి అనుమతులు లభించాయి. కాగా,ఈ డిజైన్​నిఈ ఏడాదిలేదా వచ్చే ఏడాదివచ్చే మోడల్స్ కి అందించేందుకు ప్రయత్నిస్తోంది.ఇందులో మేజర్గా కనిపించే మార్పు ఫిజికల్ కీబోర్డ్, టచ్ బార్ని తీసేసి సెకండ్ డిస్ ప్లే అందించడమే.. దీని ద్వారా యూజర్ కావాలనుకున్నట్లుగా కీబోర్డ్ లేఅవుట్ పెట్టుకునే వీలుంటుంది. స్మార్ట్ ఫోన్ కీ బోర్డ్ పై టైప్ చేసినట్లుగానే దీనిపై టైప్ చేసే వీలుంటుంది.

అయితే ల్యాప్​టాప్​లలో సెకండరీ డిస్ ప్లేలు కనిపించడం ఇది మొదటిసారేమీ కాదు. ఆసుస్ జెన్ బుక్ డ్యుయో సెకండరీ స్క్రీన్ తోనే విడుదలైంది. మెయిన్ డిస్ ప్లేతో పాటు చిన్న చిన్న పనులకు ఈ డిస్ ప్లేను ఉపయోగించుకునే వీలుంటుంది. అయితే ప్రస్తుతం పేటెంట్ సాధించిన ఈ మ్యాక్ బుక్ డిజైన్ దీనికంటే చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. దీని కింది భాగంలో ఉన్న స్క్రీన్ ని కీ బోర్డ్, గేమ్ ప్యాడ్, ట్రాక్ ప్యాడ్ ఇలా ఏది కావాలంటే దానిలా మార్చుకునే వీలుంటుంది. ఒకవేళ మధ్యలో ఇచ్చే జాయింట్ ని 180 డిగ్రీల మేర వంచే వీలు అందిస్తే అది పెద్ద సర్ఫేజ్ తో పనిచేసుకునే వీలుంటుంది. దీంతో పాటు బాటమ్లో ఐఫోన్ లేదా ఎయిర్ పాడ్స్ కి ఛార్జింగ్ పెట్టేందుకు వీలుగా ఛార్జర్ కూడా అందిస్తోంది. అయితే, యాపిల్ సంస్థ తీసుకున్న చాలా పేటెంట్లలో కొన్ని నిజంగా ఉపయోగంలోకి రాలేదు.ఈ డిజైన్ కూడా వినియోగంలోకిరావడానికి చాలా సమయమే పట్టొచ్చు. ఇక, యాపిల్​ దక్కించుకున్న మరో పేటెంట్ మ్యాక్ బుక్ ప్రోలో టచ్ బార్, యాపిల్ పెన్సిల్ స్లాట్ని చేర్చడాన్నిమనం గమనించవచ్చు.దీని ద్వారా ఈ సంస్థ కొత్త తరహా మ్యాక్ బుక్స్, ఎం1ఎక్స్ ప్రాసెసర్ పై ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది.
Published by:Krishna Adithya
First published: