APPLES NEW AD ON PRIVACY PROTECTION THE COMPANY THAT HIGHLIGHTED THE FEATURE OF CHECKING FOR DATA ACTION GH VB
Apple New Privacy: ప్రైవసీ ప్రొటెక్షన్‌పై యాపిల్ కొత్త యాడ్.. డేటా ఆక్షన్‌కు చెక్..! వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
ఐఫోన్(iPhone)లలో ప్రైవసీ(Privacy)కి ఇస్తున్న ప్రాధాన్యతను హైలైట్ చేయడానికి యాపిల్ సంస్థ(Apple Company) ఓ కొత్త అడ్వెర్టైజ్మెంట్ను విడుదల చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో యాపిల్ విడుదల చేసిన 'యాప్ ట్రాకింగ్ ట్రాన్స్పరెన్సీ' ఫీచర్‌ని ఈ యాడ్ హైలైట్ చేసింది.
ఐఫోన్(iPhone)లలో ప్రైవసీ(Privacy)కి ఇస్తున్న ప్రాధాన్యతను హైలైట్ చేయడానికి యాపిల్ సంస్థ(Apple Company) ఓ కొత్త అడ్వెర్టైజ్మెంట్ను(Advertisement) విడుదల చేసింది. ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా, 'మెయిల్ ప్రైవసీ ప్రొటెక్షన్' నుంచి చాలా వ్యతిరేకత వ్యక్తమైన తర్వాత గత ఏడాది ఏప్రిల్‌లో యాపిల్ విడుదల చేసిన 'యాప్ ట్రాకింగ్ ట్రాన్స్పరెన్సీ' ఫీచర్‌ని(Feature) ఈ యాడ్ హైలైట్ చేసింది. ఇతర యాప్‌లతో ఈ మెయిల్, లొకేషన్, అడ్వర్టైజింగ్ ఐడెంటిఫైయర్ వంటి డేటాను షేర్ చేయడాన్ని తగ్గించడం రెండు ఫీచర్ల లక్ష్యంగా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్లు(Users) ఉపయోగిస్తున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్(Instagram) సంస్థల పేరెంట్ కంపెనీ అయిన Meta, పర్సనలైజ్డ్ అడ్వెర్టైజ్మెంట్లను అందించడానికి వినియోగదారుల డేటాపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో దాని సెక్యూరిటీ ఫీచర్లను హైలైట్ చేయడానికి గూగుల్ కొత్త వీడియోను కూడా విడుదల చేసింది.
ప్రైవేట్ డేటా వేలంతో యాడ్ మొదలు
ఐఫోన్ ప్రైవసీ- డేటా ఆక్షన్ పేరుతో ఉన్న యాపిల్ యాడ్.. ఒక మహిళా యూజర్‌కు సంబంధించిన 'ప్రైవేట్ డేటా'ను ఆక్షన్‌లో వేలం వేయబోతున్నట్లు ఆమె తెలుసుకోవడం నుంచి యాడ్ మొదలవుతుంది. ఆక్షన్ వేదికపై మల్టిపుల్ యాప్స్‌కు సమాంతరంగా, లొకేషన్, కాంటాక్ట్, ఈ మెయిల్ ఐడీ వంటి డేటాను వేలం వేయడాన్ని చూడవచ్చు. వేలం నిర్వాహకుడు ఈ డేటా విక్రయ ప్రక్రియను వాణిజ్యంగా చెబుతూ సరదాగా సమర్థిస్తాడు.
దీనికి సంబంధించి యాపిల్ గత సంవత్సరం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది, సగటు మొబైల్ యాప్‌లో ఆరు ఎంబెడెడ్లు ఉన్నాయని సూచించింది. కంపెనీ విడుదల చేసిన పత్రంలో..‘డెవలపర్లు తమ యాప్‌లను రూపొందించడంలో సహాయపడే థర్డ్-పార్టీ కోడ్‌లో ట్రాకర్లు తరచుగా పొందుపరుస్తారు. ట్రాకర్లను చేర్చడం ద్వారా, డెవలపర్లు థర్డ్ పార్టీలను వివిధ యాప్‌లలో సమాచారాన్ని సేకరించడానికి అనుమతిస్తారు. వివిధ యాప్‌లలో పంచుకొన్న చేటా, సేకరించిన యూజర్ డేటాను సేకరించడానికి, లింక్ చేయడానికి కూడా అనుమతిస్తారు.’ అని పేర్కొంది.
* యాపిల్ యాడ్‌తో భారీ రెవెన్యూ అంచనా వేసిన మెటా
యాప్ ట్రాకింగ్ పారదర్శకత ద్వారా, యాప్‌లు ఇతర కంపెనీల యాజమాన్యంలోని యాప్‌లు లేదా వెబ్సైట్లలో తమ డేటాను ట్రాక్ చేసే ముందు తప్పనిసరిగా వినియోగదారు అనుమతి తీసుకోవాలని యాపిల్ ఆదేశిస్తుంది. సెట్టింగ్‌ల కింద, వినియోగదారులు ఏ యాప్‌లు ట్రాక్ చేయడానికి అనుమతిని అభ్యర్థించారో చూసుకొనే అవకాశం ఉంది. దానికి తగిన విధంగా యూజర్లు మార్పులు చేయగలరు. ఈ విషయాన్ని యాపిల్ తాజా యాడ్‌లో ప్రముఖంగా హైలైట్ చేసింది. ఈ సంవత్సర ప్రారంభంలో యాపిల్ యాప్ ట్రాకింగ్ పారదర్శకత యాడ్ కారణంగా 10 బిలియన్ల డాలర్ల ప్రకటన రాబడిని కంపెనీ అంచనా వేస్తుందని మెటా పేర్కొంది.
యాడ్‌లో యాపిల్ సంస్థ హైలైట్ చేసిన మరో ఫీచర్ iOS 15, iPad OS, macOS Monterey తో రూపొందించిన మెయిల్ ప్రైవసీ ప్రొటెక్షన్. ఇది తప్పనిసరిగా థర్డ్-పార్టీ యాప్‌లలో సైన్ అప్ చేస్తున్నప్పుడు యూజర్ మెయిల్ ఐడీని దాచాలని సూచిస్తుంది.
ఆండ్రాయిడ్ సంస్థ సెక్యూరిటీ, ప్రొటెక్షన్ కోసం ప్రొటెక్టెడ్ బై ఆండ్రాయిడ్ బ్రాండింగ్‌ను ఆవిష్కరించింది. ఒక వీడియోలో లొకేషన్ డేటా, మరిన్నింటిని రక్షించడంలో వినియోగదారులకు సహాయపడటానికి దాని Android OSను అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.