హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhone Discount: కేవలం రూ.21 వేలకే యాపిల్‌ ఐఫోన్ 11.. భారీ ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్‌..

iPhone Discount: కేవలం రూ.21 వేలకే యాపిల్‌ ఐఫోన్ 11.. భారీ ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్‌..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ఈ–కామర్స్​ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ బంపరాఫర్ ప్రకటించింది. యాపిల్‌ ​ ఫోన్లలో అత్యంత ప్రజాదరణ కలగిన ఐఫోన్​ 11పై అదిరిపోయే డిస్కౌంట్‌ అందిస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

గ్లోబల్​ మార్కెట్​లో యాపిల్‌ ​ ఐఫోన్​లకు (Apple iphone) ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రిలీజైన కొద్ది గంటల్లోనే ఐఫోన్‌లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. అయితే వీటి ధర కాస్త ఎక్కువగా ఉండటంతో చాలా మంది కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. అటువంటి వారి కోసమే ప్రముఖ ఈ–కామర్స్​ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ బంపరాఫర్ ప్రకటించింది. యాపిల్‌ ​ ఫోన్లలో అత్యంత ప్రజాదరణ కలగిన ఐఫోన్​ 11పై (iphone 11) అదిరిపోయే డిస్కౌంట్‌ అందిస్తోంది.

ఏమాత్రం తగ్గని క్రేజ్‌

2020లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఈ స్మార్ట్‌ఫోన్‌కి ఇప్పటికీ భారీ క్రేజ్​ ఉంది. ఇప్పటికీ ఐఫోన్​11ను మంచి కెమెరా, మంచి పర్ఫార్మెన్స్ గల స్మార్ట్‌ఫోన్‌గా ​ ఐఫోన్ లవర్స్ భావిస్తుంటారు. అందుకే యాపిల్‌ సంస్థకు చెందిన​ అత్యంత ప్రజాదరణ పొందిన ఐఫోన్ మోడల్‌గా నిలిచింది. అయితే ఇటీవల యాపిల్‌​ ఐఫోన్​14 సిరీస్‌ను ప్రారంభించిన తర్వాత వీటి తయారీని కంపెనీ నిలిపివేసింది. అయినప్పటికీ యాపిల్‌ ఐఫోన్ 11 అనేక ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. యాపిల్‌ ​ నుంచి కొత్త సిరీస్​లు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. దీని క్రేజ్​ ఏమాత్రం తగ్గలేదు.

2020లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌

యాపిల్‌ ఐఫోన్ 11 సిరీస్ భారతదేశంలో 2019లో రూ.64,900 ప్రారంభ ధరతో లాంచ్‌ అయింది. ఐఫోన్ 11 సిరీస్‌లో యాపిల్‌ ఐఫోన్ 11 బేస్ మోడల్, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో వంటి మొత్తం మూడు మోడల్స్ ఉన్నాయి. అయితే తాజా ఆఫర్​ కింద ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కేవలం రూ.21,450 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్​11 రూ.40,999 వద్ద లిస్ట్​ అయ్యింది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై అందిస్తున్న డిస్కౌంట్​ ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. అంటే దాదాపు రూ.2,049 తగ్గింపును అందుకోవచ్చు. దీనితో పాటు, ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ కింద మరో రూ.17,500 తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ ఆఫర్‌లను వినియోగించుకొని ఫోన్‌ను కేవలం రూ.21,450 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్​ 11 అదిరిపోయే ఫీచర్లు

ఇటీవల దసరా, దీపావళి పండుగల సందర్భంగా నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో యాపిల్‌ ఐఫోన్​ 11కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ ఫోన్‌లకు విపరీతమైన డిమాండ్‌ కనిపించింది. ఐఫోన్​ 11 ఫీచర్లను పరిశీలిస్తే.. ఇది 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది A13 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ 12MP సెన్సార్​ కెమెరా, ముందు భాగంలో 12MP సెల్ఫీ షూటర్‌ కెమెరాలు ఉంటాయి.

First published:

Tags: Apple iphone, Iphone

ఉత్తమ కథలు