Home /News /technology /

APPLES AFFORDABLE SMARTPHONE IPHONE SE IS AVAILABLE AT A DISCOUNTED PRICE FOR AS LOW AS RS 18K ON FLIPKART AND HERE THE FULL DETAILS GH SRD

iPhone SE 2020: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.18 వేలకే లభిస్తున్న ఐఫోన్‌.. పూర్తి వివరాలు ఇక్కడ..!

iPhone SE 2020

iPhone SE 2020

iPhone SE 2020: గతేడాది విడుదలైన మోడల్ ఫోన్ల ధరలపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తోంది యాపిల్. ఈ క్రమంలోనే ఐఫోన్ ఎస్ఈ 2020 మోడల్ పై అదిరిపోయే డిస్కౌంట్ ప్రకటించింది.

యాపిల్ కంపెనీ ఇటీవల ఐఫోన్ 13 సిరీస్ మొబైల్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మోడల్ ఫోన్లను లాంచ్ చేసిన తర్వాత యాపిల్.. గతేడాది విడుదలైన మోడల్ ఫోన్ల ధరలపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే ఐఫోన్ ఎస్ఈ 2020 మోడల్ పై అదిరిపోయే డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫోన్ ని కేవలం రూ. 25,999 ధరకే అమ్మకానికి తీసుకొచ్చింది. అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days sale) అక్టోబర్ 10 వరకు కొనసాగనుంది. అయితే ఈ సెల్ ఇంకా ప్రారంభం కాకముందే రూ.38,900 ఎంఆర్పీ గల ఐఫోన్ ఎస్ఈ (IPhone SE) పై దాదాపు రూ.14 వేల తగ్గించింది.

గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ ఎస్ఈ 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.30,999గా... 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 40,999గా యాపిల్ సంస్థ నిర్ణయించింది. ఈ మొబైల్ ఫోన్ స్పెసిఫికేషన్లు దాదాపు మొన్నీమధ్య విడుదలైన ఎస్ఈ ఫోన్ తో సమానంగా ఉండటంతో మొబైల్ ప్రియులు కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సేల్ ఆఫర్స్ ప్రస్తుతం కొనసాగుతున్న ఫ్లిప్‌కార్ట్ కర్టెన్ రైజర్‌లో ఒక భాగంగా కస్టమర్లకు అందుబాటులోకి వచ్చాయి. ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్స్ లో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్‌ ప్రొడక్ట్స్ లపై ఆఫర్‌లను అందిస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌(ICICI Bank), యాక్సిస్ బ్యాంక్(Axis Bank) క్రెడిట్ కార్డుదారులు రూ.5వేల కంటే ఎక్కువ ఆర్డర్‌లపై రూ.1500 వరకు క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు పొందవచ్చు. ఇదే బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డు కస్టమర్లు రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. ఒకవేళ పాత మొబైల్ ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేయాలనుకుంటే.. ఫ్లిప్‌కార్ట్ పాత ఫోన్‌లపై రూ.15,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ అందిస్తోంది. వర్కింగ్ కండిషన్ లో ఉన్న ఐఫోన్ 7 ఎక్స్‌ఛేంజ్ పై ఫ్లిప్‌కార్ట్ రూ. 6 వేల డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది.

ఎక్స్‌ఛేంజ్ తో సహా క్యాష్‌బ్యాక్ వంటి అదనపు బ్యాంక్ ఆఫర్‌తో ఐఫోన్ ఎస్‌ఈ ని కేవలం రూ.18,499 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ అనేవి ఫోన్ బ్రాండ్ ఆధారంగా నిర్ణయిస్తారనేది యూజర్లు గమనించాలి. ఐఫోన్ ఎక్స్‌ఛేంజ్ లపై సాధారణంగా ఎక్కువ విలువైన ఆఫర్ లభిస్తుంది. ప్రస్తుతానికి ఐఫోన్ 7 మోడల్ కి మించిన మొబైల్ ఫోన్లకు మంచి ఎక్స్‌ఛేంజ్ ధర లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్, రెడ్, వైట్ ఐఫోన్ ఫోన్లకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ అందిస్తోంది.

ప్రస్తుతం ఐఫోన్‌ ఎస్‌ఈ 2020 మోడల్ అరుదైన కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలుస్తోంది. దీని స్పెసిఫికేషన్లు చూసుకుంటే.. ఇందులో 4.7 అంగుళాల రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లే, యాంబినెట్‌ లైటింగ్‌, హెచ్‌డీఆర్‌ 10 కాంపర్ట్‌బులిటీతో డాల్బీ విజన్‌ ఉన్నాయి. ఇది యాపిల్ ఏ13 బయోనిక్ చిప్‌ పై నడుస్తుంది. ఈ చిప్ కి యాపిల్‌ ఐఫోన్‌ 11 కూడా యాడ్ చేయడంతో ఇది అత్యంత ఫాస్ట్ గా నడుస్తుంది.

ఇది కూడా చదవండి : వాట్సాప్ ద్వారా డబ్బు ఎలా పంపాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి..

ఏ13 బయోనిక్‌లో సెకను వ్యవధిలో ట్రిలియన్‌ ఫంక్షన్స్ చేసే సామర్ధ్యం గల 8-కోర్ న్యూరల్ ఇంజిన్ అందించారు. సీపీయూలో రెండు మెషిన్ లెర్నింగ్ యాక్సిలరేటర్లు, న్యూ మెషిన్ లెర్నింగ్ కంట్రోలర్లు కూడా ఉంటాయి. అలాగే ఇందులో 18వాల్ట్‌ల వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా అందించారు. ముఖ్యంగా, ఐఫోన్ ఎస్ఈ లేటెస్ట్ ఐఓస్ 15 అప్‌డేట్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Apple, Flipkart, Flipkart Big Billion Days, Iphone, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు