యాపిల్ ఈవెంట్‌కు కౌంట్‌డౌన్ షురూ!

యాపిల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ ఈవెంట్ సెప్టెంబర్ 12న జరగనుంది. ఆ రోజు యాపిల్ ఏఏ ప్రొడక్ట్స్ లాంఛ్ చేస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

news18-telugu
Updated: September 4, 2018, 6:20 PM IST
యాపిల్ ఈవెంట్‌కు కౌంట్‌డౌన్ షురూ!
యాపిల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ ఈవెంట్ సెప్టెంబర్ 12న జరగనుంది. ఆ రోజు యాపిల్ ఏఏ ప్రొడక్ట్స్ లాంఛ్ చేస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
  • Share this:
కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో గల స్టీవ్ జాబ్స్ థియోటర్‌లో సెప్టెంబర్ 12న అతిపెద్ద ఈవెంట్ నిర్వహించబోతోంది యాపిల్. ఐఫోన్ లైనప్‌ని యాపిల్ ప్రకటిస్తుందన్న ఇన్నాళ్లూ జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్టే. ఈ ఈవెంట్‌లో యాపిల్ ఏఏ గ్యాడ్జెట్స్ లాంఛ్ చేస్తుందా అన్న ఆసక్తి మాత్రం అభిమానుల్లో కనిపిస్తోంది. ఈ విషయంలో మాత్రం కంపెనీ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా అభిమానులతో టెక్‌ గురూలను సస్పెన్స్‌లో ఉంచింది. మరి యాపిల్ ఏఏ ప్రొడక్ట్స్ లాంఛ్ చేయనుందో తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 12 వరకు ఆగాల్సిందే.  ఈ ఈవెంట్‌కు సంబంధించి యాపిల్ అందరికీ పంపిస్తున్న ఇన్విటేషన్ ఇదే. ఇందులోని బ్రాంజ్ సర్కిల్ గతేడాది ప్రారంభించిన యాపిల్ పార్క్ క్యాంపస్‌ను తలపిస్తోంది.

APPLE’S 2018 IPHONE EVENT TO BE HELD ON 12 SEPTEMBER: HERE'S ALL WE KNOW SO FAR, యాపిల్ ఈవెంట్‌కు కౌంట్‌డౌన్ షురూ!

మూడు ఫోన్లు
ప్రొడక్ట్ లాంఛింగ్‌పై కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. వాటి ప్రకారం ఈ ఏడాది మూడు ఐఫోన్లు లాంఛ్ కానున్నాయి. 5.8 అంగుళాల ఓలెడ్ మోడల్, 6.5 అంగుళాల ఓలెడ్ మోడల్, 6.1 అంగుళాల ఎల్‌సీడీ మోడల్ లాంఛ్ కానున్నాయని అంచనా. ఈ ఫోన్లు సరసమైన ధరలతో మార్కెట్‌లో పోటీలో నిలుస్తాయని భావిస్తున్నారు.

రెండు ఐప్యాడ్ ప్రో మోడల్స్
ఐఫోన్లతో పాటు యాపిల్ ఐప్యాడ్ ప్రో మోడల్స్‌ని కూడా లాంఛ్ చేయనుంది. అవి హోమ్ బటన్ లేకుండా ఫేస్ ఐడీతో వస్తాయని భావిస్తున్నారు. ఒకటి 12.9 అంగుళాలు, మరొకటి 10.5 అంగుళాల డిస్‌ప్లేతో ఉంటాయని అంచనా.

సరికొత్త మ్యాక్ లైనప్

ఈ ఈవెంట్‌లో సరికొత్త మ్యాక్ లైనప్‌ కూడా లాంఛ్ కానుందని ప్రచారం జరుగుతోంది. మ్యాక్ బుక్, మ్యాక్ బుక్ ప్రో, ఐమ్యాక్‌తో పాటు మ్యాక్ మినీ కూడా ఉండొచ్చు. డిస్‌ప్లే పెర్ఫామెన్స్‌లో అప్‌గ్రేడ్స్ చాలా ఉంటాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో పాటు తక్కువ ధర గల నోట్‌బుక్‌ను మ్యాక్ బుక్ ఎయిర్ పేరుతో లాంఛ్ చేయనుంది యాపిల్.

2018 యాపిల్ వాచ్
వీటన్నిటితో పాటు 2018 యాపిల్ వాచ్ కూడా లాంఛ్ కానుంది. 1.57 అంగుళాలు, 1.78 అంగుళాల పెద్ద డిస్‌ప్లేలతో యాపిల్ వాచ్ ఉంటాయని భావిస్తున్నారు. ఇంకా ఎలాంటి మార్పులు ఉంటాయన్నది తెలియదు.

మొత్తానికి సెప్టెంబర్ 12న జరగబోయే ఈవెంట్‌ కోసం యాపిల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నది వాస్తవం. మరి అభిమానుల అంచనాల్ని యాపిల్ ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

సెప్టెంబర్ 5న షావోమీ 6 సిరీస్ ఫోన్ల లాంఛింగ్

సెప్టెంబర్ 6న 'జియో ఫోన్ 2' ఫ్లాష్ సేల్

ఎల్జీ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

లక్ష కోట్ల డాలర్ల క్లబ్‌ రేస్‌లో అమెజాన్

5 నిమిషాలు... రూ.200 కోట్లు... పోకోఫోన్ సేల్స్ రికార్డ్

ఆండ్రాయిడ్‌ గోతో సాంసంగ్ గెలాక్సీ జే2 కోర్!

#జర భద్రం: ఆన్‌లైన్‌‌లో మీ పిల్లల ఫోటోలు పోస్ట్ చేశారా?

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://telugu.news18.com/technology/
Published by: Santhosh Kumar S
First published: August 31, 2018, 10:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading