హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhone 14 Plus: భారత్ లో రేపే ఐఫోన్ 14 ప్లస్ సేల్ ప్రారంభం.. ధర, ఫీచర్ల వివరాలివే..

iPhone 14 Plus: భారత్ లో రేపే ఐఫోన్ 14 ప్లస్ సేల్ ప్రారంభం.. ధర, ఫీచర్ల వివరాలివే..

iPhone 14 Plus: భారత్ లో రేపే ఐఫోన్ 14 ప్లస్ సేల్ ప్రారంభం.. ధర, ఫీచర్ల వివరాలివే..

iPhone 14 Plus: భారత్ లో రేపే ఐఫోన్ 14 ప్లస్ సేల్ ప్రారంభం.. ధర, ఫీచర్ల వివరాలివే..

iPhone 14 Plus: కొన్ని రోజుల క్రితం ఐఫోన్ 14 ప్లస్‌ ప్రీ-ఆర్డర్ బుకింగ్ ఓపెన్ అయింది. ఆ సమయంలో బుకింగ్ చేసుకున్న వారికి ఈ సేల్‌లో ఫోన్స్ ఫాస్ట్‌గా డెలివరీ అవుతాయని తెలుస్తోంది. మరి ఈ ఫోన్ సేల్ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

యాపిల్ (Apple) కంపెనీ ఐఫోన్ 14 (iPhone 14) సిరీస్ ఫోన్లను గత నెలలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. వీటిలో హై-రిజల్యూషన్ కెమెరా, లార్జ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వచ్చే ఐఫోన్ 14 ప్లస్ కూడా ఉంది. ఈ మొబైల్ లాంచ్‌ అయి నెల రోజులు గడుస్తోంది. కాగా ఇండియా (India)లో రేపటి (అక్టోబర్ 7) నుంచి ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. 6.7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో వచ్చే ఈ మొబైల్ ఇండియాలో రూ.89,900 ధరకి లభిస్తుంది. కొన్ని రోజుల క్రితం ఐఫోన్ 14 ప్లస్‌ ప్రీ-ఆర్డర్ బుకింగ్ ఓపెన్ అయింది. ఆ సమయంలో బుకింగ్ చేసుకున్న వారికి ఈ సేల్‌లో ఫోన్స్ ఫాస్ట్‌గా డెలివరీ అవుతాయని తెలుస్తోంది. మరి ఈ ఫోన్ సేల్ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* డెలివరీ ఆలస్యం

ఐఫోన్ 14 ప్లస్ సేల్ ఇప్పుడు ప్రారంభమైనా.. అది కస్టమర్లకు డెలివరీ అయ్యేలోపు చాలా ఎక్కువ కాలం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. యాపిల్ ఇండియా వెబ్‌సైట్ ఈ మొబైల్ డెలివరీ టైమ్‌ను 21 రోజులుగా చూపిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ మాత్రం రెండు రోజుల డెలివరీ సమయాన్ని చూపుతుంది.

అయితే ఫ్లిప్‌కార్ట్ 2-డేస్ డెలివరీ టైమ్ అనేది ప్రీ-బుక్ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే అని తెలుస్తోంది. అయితే అసలు సేల్ ప్రారంభమైన తర్వాత, కొత్త స్టాక్‌లు వచ్చే వరకు కంపెనీ ప్లాట్‌ఫామ్‌లో ఆర్డర్‌లను పాజ్ చేయవచ్చు. దీనికి మళ్లీ వారం పట్టవచ్చు. యూజర్లు ఫోన్ MRPలో 2 శాతం అడ్వాన్స్‌గా చెల్లించి యాపిల్ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా ఐఫోన్‌ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు.

* ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్స్

ఐఫోన్ 14 ప్లస్ ఫోన్‌లో 6.7-అంగుళాల సూపర్ రెటినా హెచ్‌డీఆర్ డిస్‌ప్లే, యాపిల్ A15 బయోనిక్ చిప్, 12MP డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఆఫర్ చేశారు. ఇందులో పెద్ద సెన్సార్, పెద్ద పిక్సెల్స్‌ ఉన్న కొత్త 12MP ప్రైమరీ కెమెరా అందించారు. ఇది iOS 16 వెర్షన్‌పై రన్ అవుతోంది. ఐఫోన్ 14 ప్లస్ అనేది ఈ సంవత్సరం ఐఫోన్ మినీ-సిరీస్‌కి రీప్లేస్‌మెంట్ మోడల్‌గా అందుబాటులోకి వచ్చింది. ఈ 14 ప్లస్‌ మోడల్‌కు ఎక్కువ డిమాండ్‌ లేదని తెలుస్తోంది. వాస్తవానికి, గతేడాది ఐఫోన్ 13 మినీ అమ్మకాల కంటే ఐఫోన్ 14 ప్లస్‌ సేల్స్ తక్కువగా నమోదయ్యాయి.

ఇది కూడా చదవండి : ఆఫర్లతో పిచ్చెక్కిస్తోన్న ఫ్లిప్‌కార్ట్.. ఈ ఫ్రిజ్ పై ఏకంగా రూ.80 వేల డిస్కౌంట్.. ఫైనల్ ధర ఎంత తక్కువంటే?

* ఐఫోన్ 14 ప్లస్ ధర

ఐఫోన్ 14 ప్లస్ బేస్ మోడల్ రూ.89,900 ధర తో లాంచ్ అయ్యింది. 256GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.99,900, 512GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.1,19,900గా కంపెనీ ధరలు నిర్ణయించింది. ఐఫోన్ 14 ప్లస్ మిడ్‌నైట్, బ్లూ, స్టార్‌లైట్, పర్పుల్, రెడ్ అనే 5 కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Apple, Iphone 14, Tech news

ఉత్తమ కథలు