Apple Watch: నీళ్లల్లో మునిగిపోతుంటే కాపాడిన యాపిల్ వాచ్... నమ్మాల్సిందే

Apple Watch | ఫ్లోటేషన్ డివైజ్ ధరించినా నీళ్లల్లో తేలడం సాధ్యం కాలేదు. ఇంతలో అతనికో ఐడియా వచ్చింది. తన చేతికి ధరించిన యాపిల్ వాచ్ గుర్తొచ్చింది.

news18-telugu
Updated: July 15, 2019, 5:23 PM IST
Apple Watch: నీళ్లల్లో మునిగిపోతుంటే కాపాడిన యాపిల్ వాచ్... నమ్మాల్సిందే
Apple Watch: నీళ్లల్లో మునిగిపోతుంటే కాపాడిన యాపిల్ వాచ్... నమ్మాల్సిందే (Image: tech2/Omkar Patne)
news18-telugu
Updated: July 15, 2019, 5:23 PM IST
యాపిల్ వాచ్ ఓ వ్యక్తి ప్రాణం కాపాడిందంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. చికాగోలో జరిగిన ఘటన ఇది. యాపిల్ వాచ్‌తో ప్రాణాలు కాపాడుతున్న అతని పేరు ఫిలిప్ ఈషో. చికాగో స్కైలైన్ ఫోటోలు తీసేందుకు 31 స్ట్రీట్ హార్బర్ నుంచి మెక్‌కార్మిక్ ప్లేస్‌కు జెట్ స్కీ రైడింగ్ చేస్తున్నాడు. ఓ పెద్ద అల రావడంతో జెట్ స్కీ తిరగబడింది. దీంతో అతను నీళ్లల్లో పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని ఫోన్ కూడా నీళ్లల్లో పడిపోయింది. దగ్గర్లో బోట్లు కనిపించినా, అందులో ప్రయాణిస్తున్నవారెవరూ ఫిలిప్‌ను చూడలేదు. అతని అరుపులు వినలేదు. వేగంగా వస్తున్న అలలు అతడిని ముంచేస్తున్నాయి. అతను ఫ్లోటేషన్ డివైజ్ ధరించినా నీళ్లల్లో తేలడం సాధ్యం కాలేదు. ఇంతలో అతనికో ఐడియా వచ్చింది. తన చేతికి ధరించిన యాపిల్ వాచ్ గుర్తొచ్చింది.

యాపిల్ వాచ్‌లో అధునాతనమైన ఫీచర్లుంటాయి. అందులో ఒకటి SOS ఫీచర్. ప్రమాదంలో ఉన్నప్పుడు సాయం కోరేందుకు ఉపయోగపడే ఫీచర్ ఇది. యాపిల్ వాచ్ నుంచి SOS కాల్ చేస్తే స్థానికంగా ఉండే ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ వెళ్తుంది. వెంటనే ఆ ఫీచర్ ద్వారా ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు కాల్ చేశాడు. అంతే... నిమిషాల్లో హెలికాప్టర్‌లో చికాగో పోలీసులు వచ్చారు. ఫైర్ బోట్స్ కూడా వచ్చాయి. పోలీసులు నీళ్లల్లో మునిగితేలుతున్న ఫిలిప్‌ను కాపాడారు. యాపిల్ వాచ్ తన ప్రాణాలను కాపాడిందని ప్రపంచానికి చాటి చెబుతున్నాడు ఫిలిప్. ఇలా అత్యవసరమైన పరిస్థితుల్లో యాపిల్ వాచ్ ప్రాణాలు కాపాడటం ఇదే కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి.

Realme X: రియల్‌మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?
ఇవి కూడా చదవండి:

PAN-Aadhar Link: పాన్ కార్డుతో ఆధార్ లింక్ అయిందా? 30 సెకన్లలో తెలుసుకోండి ఇలా

Realme 3i: మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ రిలీజ్... ధర రూ.7,999
Loading...
Passport: పాస్‌పోర్ట్‌కు అప్లై చేస్తున్నారా? ఈ నకిలీ సైట్లతో జాగ్రత్త
First published: July 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...