APPLE WATCHES APPLE TO LAUNCH THREE SMARTWATCHES THIS YEAR RELEASED IN SEPTEMBER GH VB
Apple Watches: ఈ ఏడాది మూడు స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేయనున్న యాపిల్.. ఆ నెలలో మార్కెట్లోకి రిలీజ్..
ప్రతీకాత్మక చిత్రం
యాపిల్ సెప్టెంబర్ 13న ఐఫోన్ 14ను లాంచ్ చేస్తూ ఒక ఈవెంట్‌ను హోస్ట్ చేయనుంది. ఈ ఈవెంట్‌లో కొత్త ఐఫోన్‌లతో పాటు మూడు కొత్త స్మార్ట్‌వాచ్‌లను కంపెనీ విడుదల చేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
ప్రీమియం(Premium), హై క్వాలిటీ డివైజ్‌లలో(High Quality Device) టెక్ రంగంలో ఫుల్ క్రేజ్(Craze) సంపాదించుకున్న యాపిల్ కంపెనీ ఎన్నో రకాల ప్రొడక్ట్స్‌ను(Products) రిలీజ్ చేస్తోంది. ప్రతి సంవత్సరం వేర్వేరు డివైజ్‌లకు సంబంధించిన కొత్త సిరీస్‌లను యాపిల్ లాంచ్ చేస్తుంది. ఈ క్రమంలో కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే వీటితో పాటు యాపిల్ కొత్త తరం స్మార్ట్‌వాచ్‌లను (Smartwatch) కూడా రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. యాపిల్ సెప్టెంబర్ 13న ఐఫోన్ 14ను లాంచ్ చేస్తూ ఒక ఈవెంట్‌ను హోస్ట్ చేయనుంది. ఈ ఈవెంట్‌లో కొత్త ఐఫోన్‌లతో పాటు మూడు కొత్త స్మార్ట్‌వాచ్‌లను కంపెనీ విడుదల చేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
Phone Arena రిపోర్ట్(Report) దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించింది. యాపిల్ నాలుగు ఐఫోన్ 14 మోడళ్లను రిలీజ్ చేస్తుందని గతంలో పుకార్లు వినిపించాయి. వీటిలో ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. ఇదే సెప్టెంబర్ లాంచ్ ఈవెంట్‌లో యాపిల్ మూడు వాచ్ మోడళ్లను తీసుకువస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి. యాపిల్ నుంచి వచ్చిన ఫ్లాట్-ఎడ్జ్ యాపిల్ వాచ్, గత సంవత్సరం యాపిల్ వాచ్ సిరీస్ 7గా (Apple Watch Series 7) వస్తుందని పుకార్లు వచ్చాయి. ఇది ఈ ఏడాది కొత్తగా యాపిల్ వాచ్ 8 (Apple Watch 8) సిరీస్‌గా కొత్త ఐఫోన్ 12 లాంటి ఫ్లాట్ డిజైన్‌తో వస్తుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. దీంతోపాటు యాపిల్ కొత్తగా వాచ్ ఎస్‌ఈ (Apple Watch SE) వేరియంట్, ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ యాపిల్ వాచ్‌ను (Extreme Edition Apple Watch) కూడా లాంచ్ చేస్తుందని PhoneArena నివేదిక సూచించింది.
యాపిల్ వాచ్, ఐఫోన్‌తో పాటు, యాపిల్ ఈ సంవత్సరం సెకండ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్ ప్రోను కూడా విడుదల చేయనుంది. AirPods Pro 2 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, లాస్‌లెస్ ఆడియో సపోర్ట్, స్పేషియల్ ఆడియో వంటి అనేక ప్రీమియం ఫీచర్‌లతో రావచ్చు. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ డివైజ్‌లు పాపులర్ నాచ్ డిజైన్‌తో రానున్న ఐఫోన్లుగా కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. లీక్‌ల ప్రకారం ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడళ్లు పిల్-షేప్డ్ హోల్-పంచ్ కటౌట్‌తో రానున్నాయి. నాచ్ లోపల ఉండే ఫ్రంట్ కెమెరాలు, సెన్సార్‌లతో యూజర్లను ఆకట్టుకోనున్నాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.