Home /News /technology /

APPLE WATCH SERIES 6 NEW IPAD AIR LAUNCHING EVENT TODAY KNOW HOW TO WATCH LIVE STREAM SS

iPhone 12: ఈరోజే యాపిల్ లాంఛింగ్ ఈవెంట్... చూడండి ఇలా

iPhone 12: ఈరోజే యాపిల్ లాంఛింగ్ ఈవెంట్... చూడండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

iPhone 12: ఈరోజే యాపిల్ లాంఛింగ్ ఈవెంట్... చూడండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Time Flies Apple Event | ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నారా? ఈ రోజు యాపిల్ ఈవెంట్ జరగనుంది. మరి ఆ ఈవెంట్‌లో ఐఫోన్ 12 మోడల్స్ పరిచయం అవుతాయా? ఇంకేం ప్రొడక్ట్స్ లాంఛ్ అవుతాయి? తెలుసుకోండి.

    యాపిల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. సెప్టెంబర్ 15న కొత్త ప్రొడక్ట్స్ లాంఛ్ చేస్తామని గతంలోనే ప్రకటించింది యాపిల్. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఈవెంట్ ఇన్విటేషన్స్‌ని అందరికీ పంపింది. టైమ్ ఫ్లైస్ పేరుతో ఈ ఈవెంట్ నిర్వహిస్తోంది యాపిల్. ఇది ఆన్‌లైన్ ఈవెంట్ మాత్రమే. ప్రతీ ఏటా సెప్టెంబర్‌లో కొత్త ఫోన్లు, గ్యాడ్జెట్స్‌ని పరిచయం చేస్తూ ఉంటుంది యాపిల్. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈసారి ఆలస్యం అవుతుందని అనుకున్నారు. సెప్టెంబర్‌లో కాకుండా అక్టోబర్‌లో లాంఛింగ్ ఈవెంట్ ఉండొచ్చని భావించారు. కానీ సెప్టెంబర్ 15న ఈవెంట్ నిర్వహిస్తోంది. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 15 రాత్రి 10.30 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ఈవెంట్‌కు సంబంధించిన యూట్యూబ్ లింక్ క్రియేట్ చేసింది కంపెనీ. మీరు యాపిల్ ప్రొడక్ట్స్ రిలీజ్ ఈవెంట్‌ను ఇక్కడ చూడొచ్చు.

    Poco M2: పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్... తక్కువ ధరకే 6GB+64GB స్మార్ట్‌ఫోన్

    Android Apps: అలర్ట్... మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ 17 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి


    యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈ ఈవెంట్ చూడొచ్చు. అయితే ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 12 సిరీస్ మోడల్స్ లాంఛ్ అవుతాయా, కాదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ ఈవెంట్‌లో కేవలం యాపిల్ వాచ్ సిరీస్ 6, ఐప్యాడ్ ఎయిర్ లాంఛ్ కావొచ్చని, ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ లాంఛ్ అయ్యే అవకాశం లేదన్న వార్తలొస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఐఫోన్ 12 మోడల్స్ రిలీజ్ ఆలస్యం కావచ్చని ఇప్పటికే యాపిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక యాపిల్ వాచ్ సిరీస్ 5 మోడల్ లాగానే యాపిల్ వాచ్ సిరీస్ 6 ఉండొచ్చని అంచనా. అయితే ఈసారి యాపిల్ వాచ్‌లల్లో బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, ఇంప్రూవ్ ఈసీజీ లాంటి ఫీచర్స్‌ని పరిచయం చేసే అవకాశముంది. తక్కువ ధరలో మరో యాపిల్ వాచ్ కూడా రిలీజ్ అవుతుందన్న వార్తలొస్తున్నాయి.

    Jio IPL Plans: స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడాలా? జియో క్రికెట్ ప్లాన్స్ ఇవే

    Realme 7 Pro: రియల్‌మీ 7 ప్రో ఫస్ట్ సేల్ ఈరోజే... ఆఫర్స్ తెలుసుకోండి

    ఒకవేళ ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ లాంఛ్ కాకపోతే ఈ కొత్త మోడల్స్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించే అవకాశముంది. ఇంకొన్ని రోజుల తర్వాత ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ కావొచ్చు. ఇక ఐఫోన్ 12 సిరీస్‌లో నాలుగు స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అవుతాయన్న ప్రచారం చాలాకాలంగా ఉంది. అందులో ఐఫోన్ 12, ఐఫోన్ 12 మ్యాక్స్, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లు ఉండొచ్చు. ఇవన్నీ 5జీ ఫోన్స్ అనే ప్రచారం జరుగుతోంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Apple, Iphone, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు