Home /News /technology /

APPLE WATCH SERIES 3 SHOCKING NEWS FOR APPLE LOVERS APPLE WATCH SERIES 3 PRODUCTION CLOSED REASON FULL DETAILS HERE GH VB

Apple Watch Series 3: యాపిల్​ లవర్స్​కు షాకింగ్​ న్యూస్​.. యాపిల్ వాచ్ సిరీస్ 3 ప్రొడక్షన్ బంద్.. ఎందుకంటే?​

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యాపిల్ సంస్థ తన యూజర్లకు ఓ షాకింగ్ ​న్యూస్​ చెప్పింది. యాపిల్​కు చెందిన అత్యంత పాపులర్​ స్మార్ట్​వాచ్​గా పేరొందిన వాచ్ సిరీస్ 3​ని నిలిపివేసే ఆలోచనలో ఉంది. యాపిల్ వాచ్​ 3 సిరీస్​లో ఉపయోగించే హార్డ్‌వేర్ ఇకపై కొత్త ఫీచర్లకు అప్‌గ్రేడ్ అవ్వదు.

ఇంకా చదవండి ...
యాపిల్(Apple )ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్​ ఉంటుందో తెలిసిందే. విడుదలైన వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. ఎప్పటికప్పుడు అప్​డేటెడ్​ ఫీచర్లతో ప్రొడక్ట్స్ లాంచ్​ చేస్తుండటమే భారీ డిమాండ్​కు(Demand) ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అటువంటి, యాపిల్ సంస్థ తన యూజర్లకు ఓ షాకింగ్ ​న్యూస్​ చెప్పింది. యాపిల్​కు చెందిన అత్యంత పాపులర్​ స్మార్ట్​వాచ్​గా పేరొందిన వాచ్ సిరీస్ 3​ని నిలిపివేసే ఆలోచనలో ఉంది. యాపిల్ వాచ్​ 3 సిరీస్​లో ఉపయోగించే హార్డ్‌వేర్ ఇకపై కొత్త ఫీచర్లకు అప్‌గ్రేడ్ అవ్వదు. అందుకే, ఈ మోడల్​ను నిలిపివేసే యోచనలో ఉంది. అయితే దీని బదులు కొత్త యాపిల్​ వాచ్ మోడల్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ వివరాలను యాపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో వినియోగదారులతో పంచుకున్నారు. ‘‘రాబోయే వాచ్‌ ఓఎస్‌కి మరింత కంప్యూటింగ్ శక్తి అవసరం.

అయితే, ఇప్పుడు మార్కెట్​లో ఉన్న యాపిల్ వాచ్​ సిరీస్​ 3 మోడల్ ఈ ఓఎస్​కు మద్దతివ్వదు. కాబట్టి యాపిల్​ వాచ్ సిరీస్ 3 స్మార్ట్​వాచ్​ అమ్మకాలను త్వరలోనే నిలిపివేయనున్నాం. దీని బదులు సరికొత్త యాపిల్ వాచ్​ను మార్కెట్​లోకి విడుదల చేస్తాం.” అని మింగ్​చి కువో తాజా ట్వీట్​లో పేర్కొన్నారు.



ఏడాది చివర్లో యాపిల్​ కొత్త స్మార్ట్​వాచ్​..

కాగా, యాపిల్ వాచ్ సిరీస్ 3 ఐదేళ్లుగా మార్కెట్​లో ఉంది. దీనికి ఇతర స్మార్ట్​వాచ్​ల కంటే మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు అకస్మాత్తుగా యాపిల్ వాచ్​ సిరీస్​ 3 నిలిపివేస్తుండటంతో ఇప్పటికే ఉన్న యాపిల్​ వాచ్​ సిరీస్​ 3 కొన్న వారు అయోమయంలో పడ్డారు. అయితే, నిజంగానే యాపిల్​ వాచ్ 3ని నిలిపివేస్తే.. ఆయా యూజర్లు యాపిల్ వాచ్​ ఎస్​ఈ వెర్షన్‌కి లేదా యాపిల్​ ఈ సంవత్సరం చివర్లో ప్రకటించే ఏదైనా కొత్త మోడల్‌కి మారాల్సి ఉంటుంది.

యాపిల్​ నుంచి కొత్త స్మార్ట్​వాచ్​​ WWDC 2022 ఈవెంట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. యాపిల్ సంస్థ త్వరలోనే వాచ్ సిరీస్ 8తో పాటు కొత్తగా మూడు యాపిల్ వాచ్ సిరీస్ ఎడిషన్లను ప్రవేశపెట్టవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ధరించగలిగిన స్మార్ట్​వాచ్​ అన్ని ఫిట్‌నెస్ ఫీచర్లతో వస్తుంది. ఇది రోజువారీ హెల్త్​, ఫిట్​నెస్​ ట్రాకింగ్​కు బాగా ఉపయోగపడుతుంది. ప్రజలు తమ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి యాపిల్ వాచ్ బాగా ఉపయోగపడుతుంది. హెల్త్​ ట్రాకింగ్​ కోసం చాలా మంది యాపిల్ స్మార్ట్​వాచ్​లను వాడుతున్నారు. సాధారణ ప్రజలే కాదు వైద్యులు సైతం యాపిల్​ వాచ్​ సహాయంతో ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్​ చేసుకుంటున్నారు. యాపిల్​ వాచ్​లో చూపించే రీడింగ్​ ఖచ్చితత్వంతో కూడుకున్నదని బలంగా విశ్వసిస్తారు. అందుకే, యాపిల్​ స్మార్ట్​వాచ్​కు మార్కెట్​లో ఫుల్ డిమాండ్​ ఉంటుంది.
Published by:Veera Babu
First published:

Tags: Apple, Store, Technology, Watch

తదుపరి వార్తలు