టాప్ టెక్ బ్రాండ్స్ తయారు చేస్తున్న ఫిట్ బ్యాండ్స్, స్మార్ట్ వాచ్‌లు హెల్త్ ట్రాకర్స్‌గా బెస్ట్ రిజల్ట్స్ అందిస్తున్నాయి. అందుకే అడ్వాన్స్‌డ్ సెన్సార్స్‌తో ఆరోగ్యాన్ని పర్యవేక్షించించే యాపిల్ స్మార్ట్‌వాచ్‌లు (Apple watches) పాపులర్ అవుతున్నాయి. ఇప్పటికే ఎందరో ప్రాణాలను కాపాడి వార్తల్లో నిలిచిన యాపిల్ వాచ్ ఇప్పుడు అమెరికా(America)కు చెందిన మరొకరి ప్రాణాలను కాపాడి (Apple Saves Life) హాట్ టాపిక్‌గా మారింది. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడాన్ని గుర్తించి సదరు వ్యక్తికి యాపిల్ వాచ్ తెలియజేసింది. దాంతో అతడి ప్రాణాలు నిలిచాయి.
వివరాల్లోకి వెళితే... ఒహైయో (Ohio) రాష్ట్రంలోని క్లీవ్‌ల్యాండ్ (Cleveland) సిటీలో నివసిస్తున్న కెన్ కౌనిహన్ (Ken Counihan) గతంలో ఒక యాపిల్ వాచ్‌ని కొనుగోలు చేశారు. అప్పటినుంచి దానితో వర్కౌట్స్, కేలరీలు, నిద్రను ట్రాక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక రోజు శ్వాస రేటు (Respiratory Rate) పెరిగిందని యాపిల్ వాచ్ చూపించింది. ఈ రేటు అనేది నిమిషానికి తీసుకునే శ్వాసల సంఖ్య కాగా అది అకారణంగా పెరిగినా లేదా తగ్గినా అనారోగ్యానికి సూచన అని చెప్పవచ్చు. సాధారణంగా పెద్ద వారి శ్వాస రేటు నిమిషానికి 12 నుంచి 16 ఉండాలి. కానీ దీనికంటే పెరగడంతో కౌనిహన్ అలర్ట్ అయ్యాడు.
కౌనిహన్ నిద్రించే సమయంలో తన బ్రీతింగ్ రేట్ తెలుసుకునేందుకు రోజూ రాత్రి యాపల్ వాచ్‌ను ధరించేవారు. తర్వాత హెల్త్ యాప్‌లో రెస్పిరేటరీ రేట్ డేటాను చెక్ చేసుకునేవారు. అయితే గత అక్టోబరులో యాపిల్ వాచ్ కౌనిహన్‌ను హెచ్చరించింది. ఏంటా అని చూస్తే నిమిషానికి తీసుకునే తన శ్వాసల సంఖ్య 14 నుంచి 17-18కి పెరిగింది. మొదట ఇది చిన్న సమస్సే అని భావించిన కౌనిహన్ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, కౌనిహన్‌ను హాస్పిటల్‌కు వెళ్లమని సూచించారు. దీంతో ఎక్స్-రే తీయించుకొని, మందులు వాడిన తర్వాత కూడా యాపిల్ వాచ్ అతనికి పదే పదే హెల్త్ అలర్ట్స్ పంపించింది. ఈ నేపథ్యంలోనే కౌనిహన్ రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు 90-95 నుంచి 80-85 తగ్గడం ప్రారంభించాయి. ఆ సమయంలో బాగా అలసిపోయినట్లు అతనికి అనిపించింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతన్ని తక్షణమే ఎమర్జెన్సీ రూమ్‌కి వెళ్లమని బలవంతం చేశారు.
ఇది కూడా చదవండి : ఇండియాలో 45,000 AI ఉద్యోగాలు .. రూ.45 లక్షల వరకు జీతం!
అలా ఆసుపత్రికి వెళ్లిన తర్వాత కొన్ని స్కానింగ్స్ చేయించుకున్నారు. అప్పుడే కౌనిహన్ ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారు. ఈ సందర్భంగా క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌లోని పనిచేస్తున్న డాక్టర్ లూసీ ఫ్రాన్జిక్ మాట్లాడుతూ, రక్తం గడ్డకట్టడం గురించి ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిదని, లేదంటే అది ప్రాణాపాయం కావచ్చని అన్నారు. యాపిల్ వాచ్ పుణ్యమా అని కౌనిహన్ విషయంలో ఆ ఆలస్యం జరగలేదు. అందుకే యాపిల్ వాచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఏది ఏమైనా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనుషుల ఆరోగ్యంపై ఓ కన్నేసి, ప్రాణాలు కాపాడటంలో స్మార్ట్‌వాచ్‌ల పాత్ర చాలా కీలకంగా మారుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apple watch, Smart watch, Tech news