ప్రపంచవ్యాప్తంగా యాపిల్ (Apple) ప్రొడక్ట్స్ ఎంతగా పాపులర్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇవి అద్భుతమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందించడమే కాక SOS, క్రష్ డిటెక్షన్ వంటి ఫీచర్లతో యూజర్ల ప్రాణాలను నిలబెట్టడంలోనూ ముందుంటున్నాయి. ముఖ్యంగా యాపిల్ వాచ్‌లు (Apple Watches) వందలాది యూజర్ల ప్రాణాలను కాపాడుతూ వార్తల్లో నిలుస్తున్నాయి. యూజర్లు ఉలుకు పలుకు లేకుండా ప్రమాదంలో పడిపోతే చాలు ఇవి వెంటనే ఎమర్జెన్సీ నంబర్స్‌కు కాల్ చేసి వారి ప్రాణాలను రక్షిస్తున్నాయి. కాగా తాజాగా ఒక యాపిల్ వాచ్ అమెరికాకు చెందిన గర్భిణితో పాటు ఆమె కడుపులోని బిడ్డను ప్రాణాపాయం నుంచి కాపాడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
యూఎస్‌కి చెందిన జెస్సీ కెల్లీ అనే మహిళ గర్భం ధరించారు. ఈ గర్భధారణ సమయంలో తన హెల్త్ (Health)ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునేందుకు వీలుగా యాపిల్ వాచ్ వాడుతున్నారు. ఈ క్రమంలో తన డెలివరీ డేట్‌కి ఇంకా కొద్ది వారాల సమయం ఉందనగా ఆమెకు యాపిల్ వాచ్ అదేపనిగా అలర్ట్ నోటిఫికేషన్స్ పంపడం ప్రారంభించింది. హార్ట్ బీట్ అసాధారణ రేటులో కొట్టుకుంటుందని ఈ వాచ్ ఆమెకు తెలియజేయడం మొదలుపెట్టింది.
* అసాధారణ హార్ట్‌బీట్
జెస్సీ కెల్లీ ఏం చేయకుండా ఖాళీగా కూర్చున్నా హార్ట్ బీట్ నిమిషానికి 120గా ఉందని యాపిల్ వాచ్ గుర్తించి నోటిఫికేషన్స్ ఇచ్చింది. పది నిమిషాలకు ఒకసారి, తర్వాత అర్థగంటకు, మరి కొంత సమయానికి మరోసారి అలర్ట్స్ బ్యాక్-టు-బ్యాక్ వస్తుంటే.. జెస్సీకి తన ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన, అనుమానం కలిగింది.
* వైద్యుల స్పందన
వెంటనే మరో ఆలోచన లేకుండా ఆమె ఆసుపత్రికి వెళ్లి చెక్ అప్ చేయించుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని చెక్ చేసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. డ్యూ డేట్‌కి కొద్ది వారాల సమయం ఉండగానే ఆ మహిళా బిడ్డను ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నారని డాక్టర్లు తెలుసుకున్నారు. ప్లాసెంటా అబ్రప్షన్ (Placenta Abruption) అనే ఒక సమస్య కారణంగా ఆమె బ్లడ్ ప్రెజర్ బాగా పడిపోతుందని కూడా తెలుసుకున్నారు. ఈ విషయాలన్నీ తెలియడంతో ఆమె కూడా చాలా షాక్ గురయ్యారట. మూడు గంటల తర్వాత ఆమె హెల్దీ బేబీ గర్ల్‌కి జన్మనిచ్చారు.
* రెండు ప్రాణాలను నిలబెట్టిన వాచ్
ఈ ఘటన తర్వాత తన యాపిల్ వాచ్ తనని ఎలా కాపాడిందో జెస్సీ తెలియజేశారు. తన యాపిల్ వాచ్ కారణంగానే తనకున్న అనారోగ్య సమస్యల గురించి తెలుసుకున్నానని, తన ప్రాణాలను తన బిడ్డ ప్రాణాలను కాపాడుకోగలిగానని ఆమె చెప్పారు. శరీరం ఇచ్చే సంకేతాలు, యాపిల్ అలర్ట్స్‌ను ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయకూడదని ఆమె సలహా ఇచ్చారు.
ఇది కూడా చదవండి : క్రోమా రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే డిస్కౌంట్స్
ఈ ఘటనలోనే కాకుండా మరో ఘటనలో యాపిల్ వాచ్ హార్ట్ బ్లాకేజ్ గుర్తించి ఒక మహిళ జీవితాన్ని కాపాడింది. అలానే క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌తో యాపిల్ వాచ్ 8 సిరీస్ కారు యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా కాపాడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apple, Apple watch, Pregnant, Tech news