హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Apple Watch: యాపిల్‌ వాచ్‌తో ప్రెగ్నెన్సీ టెస్ట్.. ఆ ఫీచర్‌తో సాధ్యమే అంటున్న మహిళ!

Apple Watch: యాపిల్‌ వాచ్‌తో ప్రెగ్నెన్సీ టెస్ట్.. ఆ ఫీచర్‌తో సాధ్యమే అంటున్న మహిళ!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Apple Watch: ఓ మహిళ గర్భం దాల్చిన విషయాన్ని ముందుగా యాపిల్‌ వాచ్‌ గుర్తించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆమె రెడ్డిట్ పోర్టల్‌లో షేర్ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ (Technology) అన్ని రంగాల్లో కీలక మార్పులను తీసుకొస్తుంది. ముఖ్యంగా వైద్య రంగంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ కారణాలతో మార్కెట్‌లో స్మార్ట్‌ వాచ్‌(Smart Watches)లకు డిమాండ్‌ కనిపిస్తోంది. ఇప్పుడు స్మార్ట్‌ వాచ్‌లు హెల్త్‌ ట్రాకింగ్‌ ఫీచర్‌ (Health Tracking Features)లపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. వీటితో శరీరంలో జరిగే అనూహ్య మార్పులను సులువుగా గుర్తించే అవకాశం దక్కుతోంది. ఈ తరహాలోనే ఓ మహిళ గర్భం దాల్చిన విషయాన్ని ముందుగా యాపిల్‌ వాచ్‌ గుర్తించింది.

గర్భం దాల్చిన విషయం తాను గుర్తించక ముందే యాపిల్‌ వాచ్‌(Apple watch) సూచించిందని ఓ మహిళ పేర్కొంది. ఆమె వయసు 34 సంవత్సరాలు. తన యావరేజ్‌ రెస్టింగ్‌ హార్ట్‌ రేట్‌ కొన్ని రోజులలో గణనీయంగా పెరిగినట్లు యాపిల్‌ వాచ్‌ చూపించిందని ఆమె తెలిపారు. యావరేజ్‌ రెస్టింగ్‌ హార్ట్‌ రేట్‌ పెరగడం చూసి శరీరంలో ఏవో మార్పులు జరిగినట్లు అనుమానించినట్లు రెడ్డిట్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

* పెరిగిన రెస్టింగ్‌ హార్ట్‌ రేట్‌

సోషల్ బ్లాగింగ్ సైట్ రెడ్డిట్‌లో ఆమె చేసిన పోస్ట్‌లో.. ‘సాధారణంగా నా రెస్టింగ్‌ హార్ట్‌ రేట్‌ 57గా ఉంటుంది. అయితే కొన్ని రోజులలోనే నా రెస్టింగ్‌ హార్ట్‌ రేట్‌ 72కి పెరిగింది. రెస్టింగ్‌ హార్ట్‌ రేట్‌లో ఆందోళన చెందాల్సిన స్థాయిలో మార్పులు కనిపించకపోయినా.. 15 రోజులుగా ఎక్కువగా ఉన్నట్లు వాచ్‌ అలర్ట్‌ చేసింది. ఈ తేడా ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేశాను. నాకు తెలియకముందే నేను గర్భం దాల్చినట్లు యాపిల్‌ వాచ్‌కు తెలుసు! పీరియడ్‌ ఎప్పుడూ ఆలస్యం కాలేదు, అందుకే ఎలాంటి టెస్టింగ్‌ కూడా చేయించుకోలేదు. కేవలం వాచ్‌ రీడింగ్‌తోనే ఈ విషయం తెలిసింది’ అని వివరించింది.

* పీరియడ్స్‌ ట్రాకింగ్‌ ఫీచర్‌

టెక్‌ దిగ్గజం యాపిల్‌ కంపెనీ ఇండియాలో వాచ్ సిరీస్ 8ను అనౌన్స్ చేసింది. ఇందులో మహిళల హెల్త్‌ను ట్రాక్ చేసేందుకు అత్యాధునిక ఫీచర్లను, హెల్త్‌ కేపబిలిటీస్‌ను అందిస్తుంది. యాసిల్‌ సిరీస్ 8 శరీరం బేసల్ టెంపరేచర్‌ను గుర్తించడంలో సహాయపడే కొత్త టెంపరేచర్‌ సెన్సార్‌తో వస్తుంది. ఈ ఫీచర్‌ సిరీస్ 8, అల్ట్రాలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ మహిళల పీరియడ్‌ డేట్స్ గురించి అలర్ట్‌ చేస్తుంది. పీరియడ్స్‌ సైకిల్‌ను ట్రాక్‌ చేస్తుంది.

ఇది కూడా చదవండి : అత్యంత అసురక్షిత ఇంటర్నెట్ బ్రౌజర్‌గా గూగుల్ క్రోమ్

* ధరలు ఇలా

యాపిల్ వాచ్ సిరీస్ 8 ప్రారంభ ధర రూ.45,900 కాగా, యాపిల్ వాచ్ SE ప్రారంభ ధర రూ.29,900గా ఉంది. యాపిల్‌ వాచ్ సిరీస్ 8పై రూ.3,000, యాపిల్‌ వాచ్‌ SEపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.2,000 క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది.

* యాపిల్‌ వాచ్ సిరీస్ 8 ఇతర స్పెసిఫికేషన్‌లు

వాచ్ సిరీస్ 8 స్మార్ట్‌ డివైజ్‌.. 41mm ఆల్వేస్‌ ఆన్ రెటినా LTPO OLED డిస్‌ప్లే, 45mm 352 by 430 పిక్సెల్స్, 396 by 484 పిక్సెల్స్, 1000 nits బ్రైట్నెస్‌ వంటి స్పెసిఫికేషన్లతో వస్తుంది. 32GB స్టోరేజ్ స్పేస్‌, 64-బిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌, W3 యాపిల్ వైర్‌లెస్ చిప్, U1 చిప్ (అల్ట్రా వైడ్‌బ్యాండ్) ఉన్నాయి. Wi-Fi 802.11b/g/n 2.4GHz, 5GHz, బ్లూటూత్ 5.3 వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. USB-C మాగ్నెటిక్ ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్ వస్తుంది. 256 g-ఫోర్స్ వరకు ఫాల్ డిటెక్షన్, క్రాష్ డిటెక్షన్ అందిస్తుంది.

First published:

Tags: Apple, Latest Technology, Pregnancy, Smart watch, Tech news

ఉత్తమ కథలు