APPLE VS FACEBOOK A LOSING BATTLE FOR FACEBOOK BECAUSE PRIVACY ALWAYS WINS WITH USERS BA GH
Apple Vs Facebook: కొత్త ఫీచర్లను చేర్చిన ఆపిల్.. వ్యతిరేకిస్తున్న ఫేస్బుక్.. ఇంతకీ ఏంటా ఫీచర్లు
ప్రతీకాత్మక చిత్రం
సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో యూజర్ డేటా ప్రైవసీపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆపిల్ తన యూజర్స్ డేటా భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్ డేటా భద్రత కోసం ఆపిల్ తన ఐఫోన్లలో సరికొత్త సెట్టింగ్స్‌ను చేర్చింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో యూజర్ డేటా ప్రైవసీపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆపిల్ తన యూజర్స్ డేటా భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్ డేటా భద్రత కోసం ఆపిల్ తన ఐఫోన్లలో సరికొత్త సెట్టింగ్స్‌ను చేర్చింది. కొద్ది రోజుల క్రితమే తన ఐఫోన్లలో ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్స్, నిబంధనలు తీసుకొచ్చినప్పటి నుండి ఫేస్బుక్, ఆపిల్ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఆపిల్ తన కొత్త విధానాలతో చిన్న వ్యాపారాలకు ఆటంకం కలిగిస్తోందని ఫేస్బుక్ విమర్షిస్తుండగా, ఫేస్బుక్ యూజర్ల డేటాను ఎటువంటి అనుమతి లేకుండా ఇతర కంపెనీలకు విక్రయిస్తోందని ఆపిల్ అంటోంది. వినియోగదారుల డేటా భద్రతే మా లక్ష్యమని, ఈ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ఆపిల్ స్పష్టం చేస్తోంది. దీనిలో భాగంగా ఆపిల్ తన ఐఫోన్ iOS 14.5, ఆపిల్ ఐప్యాడోస్ 14.5 డివైజెస్ అప్డేట్లో కొత్త సెక్యూరిటీ ఫీచర్లను చేర్చింది.
తద్వారా ఇకపై ఫేస్బుక్ లేదా ఏ ఇతర యాప్స్ అయినా, తమ ఐఫోన్ యూజర్ నుంచి డేటా సేకరించడానికి వారి అనుమతి తీసుకోవాల్సిందేనని ప్రకటించింది. ఈ మేరకు అప్డేట్లో సెక్యూరిటీ ఫీచర్లను కూడా జోడించింది. అయితే, ఈ నూతన సెక్యూరిటీ ఫీచర్లపై ఫేస్బుక్ భిన్నంగా వాదిస్తోంది. ఆపిల్ తన కొత్త విధానాలతో చిన్న వ్యాపారాలపై దాడి చేస్తుందని విమర్శిస్తోంది. ఈ వివాదం కారణంగానే ఇటీవల ఫేస్బుక్ తన ప్లాట్ఫామ్లో ఆపిల్ అధికారిక పేజీని తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, సాధారణంగా చాలా కంపెనీలు తమ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌ను వాడుకుంటాయి.
ఈ టెక్నాలజీతో వినియోగదారుడి అభిరుచులు, తన సెర్చింగ్ హిస్టరీ, షాపింగ్ హిస్టరీని బట్టి ఆయా ప్రోడక్ట్స్‌కు సంబంధించిన ప్రకటనలనే ఇస్తుంటాయి. అయితే, యూజర్ అనుమతి లేకుండానే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు థర్డ్ పార్టీ కంపెనీలతో యూజర్ వ్యక్తిగత డేటాను పంచుకుంటున్నాయిని, అవి ప్రకటనల పేరుతో యూజర్ డేటాను లాగేస్తున్నాయని ఆపిల్ అంటోంది.
త్వరలో ఆపిల్ బాటలోనే గూగుల్?
కాబట్టి, యూజర్ డేటా భద్రతే లక్ష్యంగా ఆపిల్ చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఇందులో భాగంగా యాప్ ట్రాకింగ్ ట్రాన్స్పరెన్సీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లోని వివిధ యాప్‌లు, వెబ్సైట్లు తమ యూజర్ల డేటాను ట్రాక్ చేయకుండా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంది. ఆయా యాప్‌లను అప్డేట్ చేసినప్పుడు వినియోగదారులకు ఈ కొత్త ఫీచర్ కనిపిస్తుంది. ఉదాహరణకు, మీరు మీ ఐఫోన్లో ఏదైనా యాప్‌ను తెరిచినప్పుడు, లేదా అప్డేట్ చేసిన తర్వాత ఓపెన్ చేసినప్పుడు ఆ యాప్ మీ హిస్టరీని ట్రాక్ చేయడానికి అనుమతించాలా? లేదా?” అనే విండో ప్రత్యక్షమవుతుంది. తద్వారా మీ అనుమతి లేకుండా ఆయా వెబ్సైట్లు మీ డేటాను యాక్సెస్ చేయలేవు.
ఇది యూజర్ డేటాకు మరింత భద్రతనిస్తుంది. అయితే, ఈ నూతన ఫీచర్‌పై ఫేస్బుక్ స్పందిస్తూ “ప్రతి ఒక్క యూజర్ న్యూస్ ఫీడ్ ప్రత్యేకమైనది. అంటే వారు చూడాలనుకుంటున్న కంటెంట్, వారు చేరాలనుకుంటున్న గ్రూప్స్, వారు అనుసరించాలనుకునే సెలబ్రెటీలు, వారు కొనాలనుకుంటున్న ఉత్పత్తులు, సేవలు ఇలా ఎవరికి వారు ప్రత్యేకమైన అభిరుచులను కలిగి ఉంటారు. వీటిని ట్రాక్ చేయడం వ్యక్తిగత విషయాల కిందికి రాదు. వారి అవసరాలకు సరిపోయే ఉత్పత్తులు, సేవలను కనుగొనడం కోసమే డేటా ట్రాక్‌ను ఉపయోగిస్తున్నాం. అంతేకాక, చిన్న వ్యాపారులకు ఇది ఎంతగానో ప్రయోజనం చేకూర్చుతుంది. దీని ద్వారా ఆయా కంపెనీలు తమ టార్గెట్ కస్టమర్లను సులభంగా చేరుగోగలరు.”అని తెలిపింది. ఇక ఆపిల్ ఐఓఎస్ బాటలోనే గూగుల్ తన ఆండ్రాయిడ్ డివైజెస్‌లో కూడా ఈ సెట్టింగులను తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఫేస్బుక్ కి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.