Home /News /technology /

APPLE USERS FACING NEW PROBLEMS AFTER UPDATING IOS 15 KNOW DETAILS EVK

Apple Users : యాపిల్ యూజార్ల‌కు షాక్‌.. ఐఓఎస్ 15 ఇన్‌స్టాల్ చేశాక కొత్త స‌మ‌స్య‌

ఐఫోన్‌

ఐఫోన్‌

ఐఫోన్‌ (iPhone) యూజర్ల‌కు కొత్త స‌మ‌స్య ఎదుర‌వుతోంది. ఎంతో ఇష్టంగా అప్డేట్ చేసుకొన్న ఐఓఎస్‌15 (ioS 15) కార‌ణంగా ఫోన్‌లో కొన్ని ఫీచ‌ర్స్ స‌రిగా ప‌ని చేయ‌ట్లేదంటూ పేర్కొంటున్నారు. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

  ఐఫోన్‌ (iPhone) యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఓఎస్‌ 15 (ioS 15) అప్‌డేట్‌ని యాపిల్‌ విడుదల చేసింది. సెప్టెంబరు 20 రాత్రి 10.30 తరువాత నుంచి ఐఫోన్‌ యూజర్లు తమ డివైజ్‌లలో ఈ కొత్త ఐఓఎస్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చని తెలిపింది. కానీ ఆ త‌ర్వాతే అస‌లు క‌థ మొద‌లైంది. ప‌లువురు ఐఓఎస్ యూజ‌ర్లు త‌మ ఫోన్ అప్డేట్ చేసిన త‌రువాత కొత్త స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నామ‌ని తెలిపారు. యూజర్లు కొత్త ఐవోఎస్‌ వెర్షన్‌కి అప్‌డేట్ చేసిన తర్వాత, మెసేజెస్ యాప్‌లో (Messages app) ఫోటోస్‌ థ్రెడ్‌ని డౌన్‌లోడ్‌ చేశాక థ్రెడ్‌ను డిలీట్‌ చేయగానే ఫోన్‌ మెమరీలో కన్పించడం లేదంటూ తెలుస్తోంది. మరికొంత మంది యూజర్లకు డిఫాల్ట్ కెమెరా (Default camera) యాప్ కొన్నిసార్లు నాన్-ఫంక్షనల్ వ్యూఫైండర్‌ను ఆటోమేటిక్‌గా ఆన్‌ అవుతున్నట్లు ఫిర్యాదు చేశారు.

  అంతే కాకుండా ఐఫోన్ ప్ర‌త్యేకంగా అందించే సిరి అందించే కామండ్స్‌ను కూడా ఈ బగ్‌ తొలగిస్తున్నట్లు వినియోగ‌దారులు గుర్తించారు. దీనిపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఐఫోన్ వేకప్‌లో కూడా సమస్యలు ఉ‍న్నట్లు పేర్కొంటున్నారు. డిఫాల్ట్ మెయిల్ యాప్‌ కూడా నిలిచిపోతున్నట్లు చాలా మంది తెలిపారు.

  Latest Technology : ఫోన్‌ల‌తో కార్‌డోర్ ఓపెన్ చేయొచ్చు.. శాంసంగ్ కొత్త ప్ర‌యోగం


  దీంతో యూజర్లు ఆపిల్‌ సపోర్ట్‌ కమ్యూనిటీ ఫోరమ్స్‌కు రిపోర్ట్‌ చేస్తున్నారు. ఇంకా యాపిల్ ఈ సమస్య స్పందించలేదు. మెసేజ్‌ యాప్‌ థ్రెడ్‌ నుంచి ఫోటోస్‌ థ్రెడ్‌ను డిలీట్‌ చేయకుండా ఉంటే ఫోన్‌ మేమోరీలోను ఉంటాయి. ఆపిల్‌ ఈ బగ్‌ సమస్యను పరిష్కరించే వరకు ఈ పద్దతినే ఫాలో అవ్వడం ఉత్తమమని టెక్ ఎక్స్‌ప‌ర్ట్‌లు సూచిస్తున్నారు.

  అప్డేట్ చేసుకోండిలా..
  ఐఫోన్ 13 అన్ని మోడ‌ల్స్‌లో ఐవోఎస్ 15తోనే వినియోగ‌దారుల ముందుకు వ‌స్తున్నాయి. సెప్టెంబ‌ర్ 20 రాత్రి 10.30 త‌రువాత ఈ అప్‌డేట్‌కు అవ‌కాశం ఉంది. ఫోన్‌లో ఈ సాఫ్ట్ వేరు అప్‌డేట్ చేసుకోవాలనుకొంటే ఫోన్‌లో Settings > General > Software update లోకి వెళ్లి క్లిక్ చేస్తే స‌రిపోతుంది. మాక్ కంప్యూట‌ర్‌లో మాన్యువ‌ల్‌గా ఐవోఎస్ 15ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

  కొత్త అప్‌డేట్ ఫీచ‌ర్స్ ఇవే

  - iOS 15లో యాపిల్ కొత్తగా ఫేస్‌టైమ్‌ ఫీచర్‌ను తీసుకొస్తుంది. ఈ ఫీచ‌ర్‌లో క్వాలిటీ వీడియో, ఆడియో అవ‌కాశం ఎక్కువ‌గా ఉండేలా రూపొందించారు. ఫేస్ క‌నిపిస్తూ మిగతా ప్రాంత‌మంతా బ్ల‌ర్ అవుతుంది.
  - యూజ‌ర్ల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డే యాపిల్ మ్యాప్‌లో ప్ర‌త్యేక ఫీచ‌ర్ అందిస్తుంది. 3డీ ల్యాండ్ మార్కింగ్‌తోపాటు మ్యాప్ ఆధారంగా వెళ్లిన ప్ర‌దేశానికి ప‌ట్టిన స‌మ‌యం కూడా తెలుసుకోవ‌చ్చు.
  - కొత్త సాఫ్ట్ వేర్‌లో యూజ‌ర్ల‌కు మెరుగైన అనుభ‌వాన్ని క‌లిగించేందుకు పిక్చ‌ర్ల‌ను ఐఫోన్ అందిస్తోంది. Shared with You ఫోల్డ‌ర్ ద్వారా వాటిని ఎమోజీలు, పిక్చ‌ర్ల‌ను ప‌దిల ప‌రుచుకోవ‌చ్చు. అంతే కాకుండా లైవ్ టెక్ట్స్ ఫీచ‌ర్‌ను అందిస్తోంది. దీని ద్వారా ఫొటోలపైన ఉండే టెక్ట్స్‌ని డైరెక్టుగా కాపీ, పేస్ట్, షేర్‌ చేసుకొనే వెసులుబాటు ఇస్తోంది. ఇందుకోసం ఐఓఎస్‌ 15లో ఓసీఆర్ అనే ఫీచర్‌ను అంద‌నంగా అందిస్తున్నారు.
  - కొత్త సాఫ్ట్ వేర్‌లో నోటిఫికేష‌న్ బార్‌ల‌ను సెట్ చేసుకొనే అవ‌కాశం ఉంది. యూజ‌ర్లు త‌మ‌కు న‌చ్చిన అంశాల‌నే నోటిఫికేష‌న్ రూపంలో పొందేలా ఈ సాఫ్ట్ వేర్‌ను రూపొందించారు. అయితే మిస్డ్ కాల్స్‌, మెసేజ్‌లు ఈ క్యాట‌గిరీలోకి రావు.
  - ఐఓఎస్ 15లో షేర్‌ప్లే ఆప్ష‌న్‌ను అద‌నంగా అందిస్తున్నారు. ఈ ఫీచ‌ర్ ద్వారా ఫోన్ స్క్రీన్‌ను ఎంత‌సైపైనా షేర్ చేసేలా రూపొందించింది.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Apple, Ios, Latest Technology

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు