iPhone: ఈ యాపిల్ ఫోన్స్ ఇక ఇండియాలో దొరకవు

APPLE TO STOP IPHONE 6, 6 PLUS SALES | ఐఫోన్ 6 లేదా ఐఫోన్ 6 ప్లస్ మోడల్స్‌కు డిమాండ్ చాలా దారుణంగా ఉంది. నెలకు 35 యూనిట్స్ కంటే ఎక్కువ అమ్మలేకపోతోంది యాపిల్.

news18-telugu
Updated: March 14, 2019, 3:29 PM IST
iPhone: ఈ యాపిల్ ఫోన్స్ ఇక ఇండియాలో దొరకవు
iPhone (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు యాపిల్ ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? ఐఫోన్ 6 లేదా ఐఫోన్ 6 ప్లస్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారా? అయితే వెంటనే ఆ ఫోన్ కొనేయండి. లేకపోతే ఇక ఆ రెండు మోడళ్లు ఇండియాలో దొరక్కపోవచ్చు. కారణం... ఆ రెండు మోడల్స్ అమ్మకాలను అమ్మేయాలని యాపిల్ నిర్ణయించుకోవడమే. అంతేకాదు... ఎంట్రీ ప్రైజ్‌ను రూ.5,000 పెంచాలని యాపిల్ నిర్ణయించింది. ఐఫోన్ 6 లేదా ఐఫోన్ 6 ప్లస్ మోడల్స్‌కు డిమాండ్ చాలా దారుణంగా ఉంది. నెలకు 35 యూనిట్స్ కంటే ఎక్కువ అమ్మలేకపోతోంది యాపిల్. దీంతో వాటిని ఔట్‌లెట్ల నుంచి తొలగించాలని నిర్ణయించుకుంది.

Read this: JIO Prepaid Plans: రోజుకు 2GB హై స్పీడ్ డేటా... జియో ప్లాన్స్ ఇవే...

యాపిల్ అంటే గుర్తొచ్చేది ప్రీమియం ఐఫోన్. చేతిలో ఐఫోన్ ఉంటే అదో స్టేటస్ సింబల్. అందుకే ధర ఎక్కువైనా కొనేందుకు సిద్ధపడుతుంటారు. కొద్దిరోజుల క్రితం యాపిల్ ఐఫోన్ 6 ధరల్ని తగ్గించింది. ఇందుకు కారణం ఇవి స్థానికంగా తయారవుతుండటమే. అయితే వాటి అమ్మకాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. అయినా యాపిల్ మాత్రం తన బ్రాండ్‌కు ఉన్న ప్రీమియం ట్యాగ్‌ను కొనసాగించాలనుకుంటుంది. అందుకే ఐఫోన్ ఎంట్రీ ప్రైస్‌ను రూ.5,000 కన్నా ఎక్కువ పెంచాలనుకుంటుంది. మళ్లీ ప్రీమియం ట్యాగ్‌తో ఇండియాలో తమ బ్రాండ్‌ను బలోపేతం చేయాలని భావిస్తోంది యాపిల్.

Read this: One Nation One Card: వన్ నేషన్ వన్ కార్డ్ వాడితే 10% క్యాష్‌బ్యాక్... కార్డు ఫీచర్లు ఇవే

యాపిల్ బ్రాండ్ ఇండియాలో ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి కారణం వాటి ధరలే. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇప్పటికే అనేక కంపెనీలు పట్టు సాధించాయి. ఆయా బ్రాండ్‌లు రిలీజ్ చేసే స్మార్ట్‌ఫోన్లు సేల్స్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఆ బ్రాండ్లు రిలీజ్ చేసే ఖరీదైన ఫోన్లతో పోలిస్తే యాపిల్ ఐఫోన్ ధర మూడు రెట్లు ఎక్కువ. దీంతో స్మార్ట్‌ఫోన్ యూజర్లు యాపిల్ ఐఫోన్లను పెద్దగా పట్టించుకోవట్లేదు.

Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా 21 ఏళ్ల కైలీ జెన్నర్
ఇవి కూడా చదవండి:

WhatsApp Reverse Image Search: ఫేక్‌న్యూస్ గుర్తించేందుకు వాట్సప్‌లో కొత్త ఫీచర్

IRCTC Tatkal Rules: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? రూల్స్, ఛార్జెస్ వివరాలు తెలుసుకోండి

 
First published: March 14, 2019, 3:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading