Home /News /technology /

APPLE TO SELL MAC IPAD WITH UP TO RS 24000 DISCOUNT FREE AIRPODS TO STUDENTS TEACHERS UMG GH

Apple: ఆహా.. యాపిల్ అదిరే ఆఫర్ అబ్బా.. ! ఫ్రీగా ఎయిర్‌పాడ్స్ పొందే అవకాశం..!!

విద్యార్థులు, ఉాపాధ్యాయులు యాపిల్ ఐపాడ్స్ ఫ్రీగా పొందే అవకాశం (Apple)

విద్యార్థులు, ఉాపాధ్యాయులు యాపిల్ ఐపాడ్స్ ఫ్రీగా పొందే అవకాశం (Apple)

టెక్ దిగ్గజం యాపిల్ (Apple) విద్యార్థులు, ఉపాధ్యాయులకు స్పెషల్ సేల్ (Special sale) ప్రకటించింది. కంపెనీ ప్రతి సంవత్సరం విద్యారంగానికి సంబంధించిన వారి కోసం ‘బ్యాక్ టూ స్కూల్’ పేరుతో స్పెషల్ ఆఫర్స్‌ (Offers) ప్రకటిస్తుంది. ఈ ఎడ్యుకేషనల్ ఇయర్‌కు సంబంధించిన సేల్ తాజాగా ప్రారంభమైంది.

ఇంకా చదవండి ...
టెక్ దిగ్గజం Apple విద్యార్థులు, ఉపాధ్యాయులకు Special Sale ప్రకటించింది. కంపెనీ ప్రతి సంవత్సరం విద్యారంగానికి సంబంధించిన వారి కోసం ‘బ్యాక్ టూ స్కూల్’ పేరుతో స్పెషల్ Offers ప్రకటిస్తుంది. ఈ ఎడ్యుకేషనల్ ఇయర్‌కు సంబంధించిన సేల్ తాజాగా ప్రారంభమైంది. ఈ సేల్‌లో ప్రీమియం డివైజ్‌లపై యాపిల్ భారీ ఆఫర్లను అందిస్తోంది. యూనివర్సిటీ స్టూడెంట్స్, టీచర్లు ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

ఆన్‌లైన్‌ యాపిల్ స్టోర్‌లో డిస్కౌంట్‌తో ప్రొడక్ట్స్‌ను లిస్ట్ చేసింది. ఐపాడ్‌ల నుంచి మ్యాక్ డివైజ్‌ల వరకు వేర్వేరు ప్రొడక్ట్స్‌పై రూ.24 వేల వరకు డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. వినియోగదారులు యాపిల్ మ్యూజిక్‌కి ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఉచితంగా ఒక జత ఎయిర్‌పాడ్‌లను కూడా పొందవచ్చు. ఈ స్పెషల్ సేల్ సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. అలాగే కంపెనీ Apple Care+పై 20% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆఫర్ ప్రైస్‌.. అన్ని గ్రేడ్‌ల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బంది, యూనివర్సిటీ స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటుంది.



ఆఫర్లలో లభిస్తున్న డివైజ్‌లు, వాటి ధరలు

  • MacBook Pro 13పై యాపిల్ రూ. 10,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 1,29,900 కాగా, తాజా ఆఫర్‌లో రూ. 1,19,900కి కొనుగోలు చేయవచ్చు.

  • MacBook Pro 14 ఇప్పుడు రూ. 1,75,410 ధర వద్ద లభిస్తోంది. దీని అసలు ధర రూ. 1,94,900 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఆఫర్‌లో దీనిపై రూ. 19,490 వరకు డిస్కౌంట్ ఉంది.

  • MacBook Pro 16పై యాపిల్ దాదాపు రూ. 23,990 డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 2,39,900తో ప్రారంభమవుతుంది. కానీ తాజా సేల్‌లో దీని ధర రూ. 2,15,910 నుంచి ప్రారంభమవుతోంది.

  • MacBook Air (M1) డివైజ్‌పై కంపెనీ రూ. 10,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. దీని అసలు ధర రూ. 99,900 కాగా, ఇప్పుడు ఆఫర్‌లో రూ. 89,900కే సొంతం చేసుకోవచ్చు.

  • మ్యాక్‌బుక్ ఎయిర్ (M2) డివైజ్‌ ధర ప్రస్తుతం రూ. 1,09,900తో ప్రారంభమవుతుంది. దీని అసలు ధర రూ. 1,19,900 నుంచి ప్రారంభమవుతుంది. కానీ ఆఫర్‌లో రూ.10వేల వరకు ధర తగ్గింది.

  • లేటెస్ట్ సేల్‌లో iMac ధర రూ. 1,07,910 నుంచి ప్రారంభమవుతుంది. దీని అసలు ధర రూ. 1,19,900 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మేరకు కంపెనీ డిస్కౌంట్ అందిస్తోంది.

  • Apple iPad Pro అసలు ధర రూ. 71,900 నుంచి ప్రారంభమవుతుంది. కానీ ఆఫర్‌లో దీని ధర రూ. 68,300కు తగ్గింది.

  • ఐప్యాడ్ ఎయిర్ ఇప్పుడు రూ. 50,780 వద్ద ప్రారంభమవుతుంది. ఆఫర్‌కు ముందు దీని అసలు ధర: రూ. 54,900గా ఉంది.


దీంతో పాటు కస్టమర్లు ఎయిర్‌పాడ్స్‌ను ఉచితంగా పొందవచ్చు. అదనంగా రూ. 6,400 లేదా రూ. 12,200 చెల్లించి తమ ప్రస్తుత ఎయిర్‌పాడ్‌లను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఇందుకు అర్హత ఉన్న కస్టమర్‌కు ఒక Mac, ఒక iPad లిమిట్ ఉంది.
Published by:Mahesh
First published:

Tags: Apple, Iphone, Offers, Students

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు