Home /News /technology /

APPLE TO OPEN ONLINE STORE IN INDIA BEFORE DUSSEHRA AND DIWALI FESTIVE SEASON SS

Apple: దసరా లోగా యాపిల్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్

Apple: దసరా లోగా యాపిల్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్
(ప్రతీకాత్మక చిత్రం)

Apple: దసరా లోగా యాపిల్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ (ప్రతీకాత్మక చిత్రం)

Apple | మీరు యాపిల్ ఐఫోన్ ఫ్యానా? ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? యాపిల్ వాచ్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.

    యాపిల్ ఫ్యాన్స్‌కు శుభవార్త. దసరా లోగా ఇండియాలో ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభించేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది నాటికి ఇండియాలో సొంత స్టోర్లను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే యాపిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అంతకన్నా ముందే ఆన్‌లైన్ స్టోర్ ఓపెన్ చేయాలని యాపిల్ భావిస్తోంది. వచ్చే ఫెస్టివల్ సీజన్‌లోగానే ఇండియాలో యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభం కానుంది. దసరా, దీపావళి సీజన్‌ను క్యాష్ చేసేందుకు యాపిల్ ఈ పావులు కదుపుతోంది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అన్ని బ్రాండ్లు మార్కెట్‌ను కోల్పోయినట్టే ఆ ప్రభావం యాపిల్ పైన కూడా ఉంది. లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో బిజినెస్ వ్యవహారాల్లో దూకుడు పెంచుతోంది యాపిల్. మొదట ఆన్‌లైన్ స్టోర్లు, ఆ తర్వాత ఆఫ్‌లైన్ స్టోర్లను తెరవనుంది.

    Redmi 9: రెడ్‌మీ 9 వచ్చేసింది... తక్కువ ధరకే 4GB+128GB స్మార్ట్‌ఫోన్‌తో షావోమీ సంచలనం

    Mobile Apps: మీ స్మార్ట్‌ఫోన్ నుంచి వెంటనే ఈ 23 యాప్స్ డిలిట్ చేయండి

    భారతదేశంలో యాపిల్‌కు చెప్పుకోదగ్గ మార్కెట్ ఉంది. అయితే థర్డ్ పార్టీ రీసెల్లర్స్ ద్వారా తమ ప్రొడక్ట్స్‌ని మార్కెట్ చేస్తోంది యాపిల్. ఇక డైరెక్ట్ మార్కెటింగ్‌పైన దృష్టిపెట్టబోతంది. అందులోభాగంగానే ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్ల గురించి ఆలోచిస్తోంది. దసరా, దీపావళి సీజన్‌లో యాపిల్ సొంతగా ఇండియాలో మార్కెట్ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆన్‌లైన్ స్టోర్ ఉపయోగపడనుంది. మరోవైపు ఆఫ్‌లైన్ స్టోర్ల ఏర్పాటు పనులు కూడా జరుగుతున్నాయి. ముంబైలోని బీకేసీ కాంప్లెక్స్‌లో ఇండియాలో తొలి యాపిల్ స్టోర్ ప్రారంభం కానుందని యాపిల్ స్పష్టం చేసింది. అయితే ముంబైలోని మేకర్ మ్యాగ్జిటీ మాల్‌లో 25,000 చదరపు అడుగుల స్థలాన్ని యాపిల్ కొన్నదన్న వార్తలున్నాయి. దీంతో పాటు బెంగళూరులో రెండో స్టోర్ తెరిచేందుకు యాపిల్ ప్రణాళికలు రూపొందిస్తోంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Apple, Ios, Iphone, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు