మీరు ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? కొన్ని రోజులు ఆగండి. మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ రాబోతోంది. ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలోనే తయారు చేయనుంచి యాపిల్. భారతీయ కస్టమర్లకు ఇక్కడే తయారు చేసి ఐఫోన్లను డెలివరీ చేయనుంది కంపెనీ. ఐఫోన్ 13 మోడల్‌ను భారతదేశంలో తయారు చేయనంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇక్కడి నుంచే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయనుంది. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఉన్న శ్రీపెరంబదూర్లోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్ తయారుకానుంది. ఏప్రిల్‌లోనే ఐఫోన్ 13 తయారీ ప్రారంభం కానుంది. ఐఫోన్ 13 ఇండియాలోనే తయారవుతుంది కాబట్టి ధర కాస్త తగ్గుతుందా అన్న చర్చ జరుగుతోంది.
గతంలో ఐఫోన్ 11, ఐఫోన్ 12 స్మార్ట్ఫోన్లను కూడా ఇండియాలోనే తయారు చేసింది యాపిల్. కానీ... అప్పుడు ధరలు తగ్గలేదు. ఐఫోన్ 13 ధర తగ్గుతుందా లేదా అన్న స్పష్టత లేదు. అయితే యాపిల్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఫెస్టివల్ సేల్ సందర్భంగా యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లపై ఆఫర్స్ పొందొచ్చు. ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.1 అంగుళాల డిస్ప్లే ఉంది. 6 కోర్ సీపీయూ, 4 కోర్ జీపీయూ, 16 కోర్ న్యూరల్ ఇంజిన్‌తో ఉన్న ఏ15 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది. పింక్, బ్లూ, మిడ్నైట్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ రెడ్ కలర్స్‌లో లభిస్తుంది. 128జీబీ వేరియంట్ ధర రూ.69,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.79,900. ఇక హైఎండ్ వేరియంట్ 512జీబీ మోడల్ ధర రూ.99,900.
యాపిల్ చాలా ఏళ్ల క్రితం ఐఫోన్ 6 సిరీస్ స్మార్ట్ఫోన్లను స్థానికంగా తయారీ చేసింది. అప్పుడు కూడా ఐఫోన్ ధరలు ఏమీ తగ్గదు. ఐఫోన్ 11, ఐఫోన్ 12 స్మార్ట్ఫోన్లు కూడా స్థానికంగా తయారయ్యాయి. ఐఫోన్లను ఫాక్స్‌కాన్‌తో పాటు విస్ట్రాన్, ఫాక్స్‌లింక్, ఫ్లెక్స్ లిమిటెడ్ లాంటి కంపెనీలు కూడా తయారు చేస్తాయి. ఇక యాపిల్ మొదటి రీటైల్ స్టోర్‌ను ముంబైలో ప్రారంభించే ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. 2021 లోనే యాపిల్ రీటైల్ స్టోర్ ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆలస్యం అవుతోంది.
ఇక ఇటీవల ఐఫోన్ ఎస్ఈ 2022 మోడల్ రిలీజైంది. 64జీబీ వేరియంట్ ధర రూ.43,900 కాగా, 128జీబీ వేరియంట్ ధర రూ.48,900. ఇక హైఎండ్ వేరియంట్ 256జీబీ మోడల్ ధర రూ.58,900. ఇందులో 4.7 అంగుళాల డిస్ప్లే, ఏ15 బయోనిక్ ప్రాసెసర్, 12మెగాపిక్సెల్ వైడ్ కెమెరా, ఐఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. మిడ్నైట్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ రెడ్ కలర్స్‌లో కొనొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.