Apple Online Store: ఇండియాలో యాపిల్ ఆన్‌లైన్ స్టోర్... లాంఛింగ్ ఎప్పుడంటే

Apple Online Store | యాపిల్ ఫ్యాన్స్‌కు శుభవార్త. ఇండియాలో యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభం కాబోతోంది. విశేషాలేంటో తెలుసుకోండి.

news18-telugu
Updated: September 18, 2020, 11:29 AM IST
Apple Online Store: ఇండియాలో యాపిల్ ఆన్‌లైన్ స్టోర్... లాంఛింగ్ ఎప్పుడంటే
Apple Online Store: ఇండియాలో యాపిల్ ఆన్‌లైన్ స్టోర్... లాంఛింగ్ ఎప్పుడంటే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియాలో యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ లాంఛింగ్‌కు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 23న యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభం కానుంది. యాపిల్ ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్... ఇలా యాపిల్ ప్రొడక్ట్స్ అన్నింటినీ కస్టమర్లు నేరుగా ఈ ప్లాట్‌ఫామ్ పైనే కొనొచ్చు. భారతదేశంలో తొలి ఆఫ్‌లైన్ స్టోర్ ప్రారంభిస్తామని ఇప్పటికే యాపిల్ ప్రకటించింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో తొలి యాపిల్ స్టోర్, బెంగళూరులో రెండో స్టోర్ తెరవనుంది. అయితే అంతకన్నా ముందే ఇండియాలోని యాపిల్ ఫ్యాన్స్‌కు దగ్గరయ్యేందుకు ఆన్‌లైన్ స్టోర్ పైన దృష్టిపెట్టింది. దసరా ఫెస్టివల్ సీజన్ లోపే యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభించాలని వేగంగా ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 23న యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభిస్తామని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ట్విట్టర్‌లో ప్రకటించారు.


యాపిల్ ఏ ప్రొడక్ట్ లాంఛ్ చేసినా ఇండియాలో థర్డ్ పార్టీ సెల్లర్ల ద్వారా అమ్ముతోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్ లాంటి ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో యాపిల్ ప్రొడక్ట్స్ కొంటున్నారు కస్టమర్లు. తమ ప్రొడక్ట్స్‌ని నేరుగా కస్టమర్లు అమ్మేందుకు యాపిల్ ఈ ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభిస్తోంది. ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న ఐఫోన్ మోడల్స్, త్వరలో రిలీజ్ కాబోయే ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్లు, ఇటీవల రిలీజ్ అయిన ఐప్యాడ్ ఎయిర్, యాపిల్ వాచ్ సిరీస్ 6 లాంటి ప్రొడక్ట్స్ అన్నీ ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో కొనొచ్చు. కార్డు పేమెంట్, ఈఎంఐ ఆప్షన్స్ లాంటివి ఉంటాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఉండకపోవచ్చు. విద్యార్థులకు మ్యాక్, ఐప్యాడ్ ప్రత్యేక ధరలు ఉండే అవకాశముంది. యాపిల్ తమ ప్రొడక్ట్స్‌ని ఉచితంగా డెలివరీ చేసేందుకు బ్లూ డార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 24 గంటల నుంచి 72 గంటల్లోగా కస్టమర్లకు ప్రొడక్ట్స్‌ని డెలివరీ చేయనుంది. భారతదేశంలోని 13,000 పిన్ కోడ్స్‌కు డెలివరీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

Samsung Galaxy M51: ఈరోజే సాంసంగ్ గెలాక్సీ ఎం51 ఫస్ట్ సేల్... రూ.2,000 డిస్కౌంట్Redmi 9i: కాసేపట్లో రెడ్‌మీ 9ఐ సేల్... రూ.10,000 లోపే 4GB+128GB స్మార్ట్‌ఫోన్

యాపిల్ ప్రొడక్ట్స్ కొనే కస్టమర్లకు డైరెక్ట్ కస్టమర్ సపోర్ట్ కూడా లభించనుంది. ఇంగ్లీష్‌లో ఆన్‌లైన్ సపోర్ట్, హిందీ, ఇంగ్లీష్‌లో ఫోన్ సపోర్ట్ లభిస్తుంది. ఇక ప్రొడక్ట్స్ కస్టమైజేషన్, ప్యాకేజింగ్, కౌన్సిలింగ్ సెషన్స్ లాంటి వినూత్న పద్ధతులతో కస్టమర్లను ఆకట్టుకోనుంది యాపిల్. కస్టమర్లు ఏ ప్రొడక్ట్ కొన్నా స్థానిక యాపిల్ ఎక్స్‌పర్ట్స్ నుంచి 30 నిమిషాల ఉచిత కౌన్సిలింగ్ సెషన్ ఉంటుంది. ఆన్‌లైన్ స్టోర్‌లో మ్యాక్ కొనాలనుకునే కస్టమర్లు తమకు నచ్చినట్టుగా కాన్ఫిగ్యురేషన్ మార్చుకోవచ్చు. ఇక ఐప్యాడ్, యాపిల్ పెన్సిల్ ఆర్డర్ చేసిన కస్టమర్లు తమకు కావాల్సిన మెసేజెస్‌ని ఇంగ్లీష్‌లో చెక్కించుకోవచ్చు. ఎయిర్‌పాడ్స్ కొనే కస్టమర్లు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, తమిళ్ భాషల్లో టెక్స్ట్ లేదా ఎమొజీస్ చెక్కించుకోవచ్చు.
Published by: Santhosh Kumar S
First published: September 18, 2020, 11:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading