Home /News /technology /

APPLE TO INTRODUCE LATEST TECHNOLOGY IPHONE 14 SERIES SATELLITE CONNECTIVITY IN APPLE WATCH GH VB

iPhone 14 With Satellite Connectivity: సరికొత్త టెక్నాలజీని పరిచయం చేయనున్న యాపిల్.. ఆ వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యాపిల్ నుంచి రానున్న ఐఫోన్ 14 (iPhone 14) శాటిలైట్ కనెక్టివిటీతో వస్తుందని ఇంతకుముందు నివేదికలు వెల్లడించాయి. అయితే త్వరలో రానున్న లేటెస్ట్ యాపిల్ వాచ్ (Apple Watch) కూడా శాటిలైట్ కనెక్టివిటీతో రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

స్మార్ట్‌ఫోన్(Smartphone) తయారీ సంస్థలు లేటెస్ట్ టెక్నాలజీని(Latest Technology) అందిపుచ్చుకుంటూ సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తున్నాయి. టెక్నాలజీని(Technology) అందిపుచ్చుకునే కంపెనీల జాబితాలో యాపిల్ (Apple) ఇతర సంస్థల కంటే ముందుంటుంది. యాపిల్ నుంచి రానున్న ఐఫోన్ 14 (iPhone 14) శాటిలైట్ కనెక్టివిటీతో(Connectivity) వస్తుందని ఇంతకుముందు నివేదికలు వెల్లడించాయి. నెట్‌వర్క్(Network) లేనప్పుడు మెసేజ్ పంపడానికి లేదా కాల్స్(Calls) చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. అయితే త్వరలో రానున్న లేటెస్ట్ యాపిల్ వాచ్ (Apple Watch) కూడా శాటిలైట్ కనెక్టివిటీతో రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

దీనికి సంబంధించిన వివరాలను యాపిల్ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన డెవలప్‌మెంట్స్ విశ్లేషించే నిపుణుడు, బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్ గుర్మాన్ తాజాగా వెల్లడించారు. 'పవర్ ఆన్' పేరుతో విడుదల చేసిన న్యూస్ లెటర్‌లో.. యాపిల్ వాచ్ కూడా శాటిలైట్ కనెక్టివిటీతో వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రొడక్ట్ ఈ ఏడాదిలో లేదా 2023లో రావచ్చని చెప్పారు. ఐఫోన్ లేదా యాపిల్ వాచ్‌లో అందుబాటులో ఉండే ఈ టెక్నాలజీ.. ఎన్నో సమస్యలకు ప్రత్యామ్నాయ మార్గాల్లో పరిష్కారాలను అందిస్తుందని గుర్మాన్ తన న్యూస్ లెటర్‌లో పేర్కొన్నారు.

ఈ సంవత్సరం యాపిల్ మూడు కొత్త ‘యాపిల్ వాచ్’ (Apple Watch) మోడల్స్ లాంచ్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త SE వేరియంట్, యాపిల్ వాచ్ సిరీస్ 8, యాపిల్ వాచ్ రగ్డ్ స్పోర్ట్స్ ఎడిషన్.. వంటి మూడు మోడళ్లు లిస్ట్‌లో ఉన్నాయి. ఒకవేళ శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఈ సంవత్సరం లాంచ్ అయితే.. ఇది యాపిల్ వాచ్ 8 లేదా రగ్డ్ యాపిల్ వాచ్‌ సిరీస్‌లో వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.

Flipkart Offer: ఈ పాపులర్ స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది... ఆఫర్ కొద్ది రోజులే

ఐఫోన్ 14 సిరీస్ శాటిలైట్ కనెక్టివిటీతో వస్తుందని గతంలో బయటకు వచ్చిన నివేదికల ద్వారా తెలిసింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు నెట్‌వర్క్ పరిధిలో లేనప్పుడు కూడా ఎమర్జెన్సీ టెక్స్ట్‌ సెండ్ చేసుకోవచ్చు. గత సంవత్సరం ఐఫోన్ 13 సిరీస్ కూడా శాటిలైట్ కనెక్టివిటీతో వస్తుందని గుర్మాన్ స్వయంగా ఊహించారు. ఆయనతో పాటు యాపిల్ ఎనలిస్ట్ మింగ్-చి కువో కూడా ఐఫోన్ 13 సిరీస్ శాటిలైట్ కనెక్టివిటీతో రావచ్చని చెప్పారు. అయితే ఐఫోన్ 13 ఎలాంటి శాటిలైట్ కనెక్టివిటీ లేకుండా లాంచ్ అవ్వడం గమనార్హం. దీంతో వీరి తాజా నివేదికలపై కూడా కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆ నెలలోనే లాంచింగ్?
యాపిల్ వాచ్ సిరీస్ 8 రీడిజైన్డ్ స్పీకర్ గ్రిల్‌తో రానున్నట్లు తెలుస్తోంది. బాడీ టెంపరేచర్ మానిటర్, కొత్త ప్రాసెసర్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, యూజర్ల బ్లడ్ గ్లూకోజ్‌ లెవల్స్ ట్రాక్ చేసే ఫీచర్.. వంటి అనేక కొత్త ఫీచర్లతో ఈ సిరీస్ వాచ్ రావచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఐఫోన్ 14 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 8 ను లాంచ్ చేసే అవకాశం ఉంది. సాధారణంగా యాపిల్ కంపెనీ కొత్త ఐఫోన్, యాపిల్ వాచ్‌లను సెప్టెంబర్‌లో విడుదల చేస్తుంది. అయితే కరోనా మహమ్మారి మళ్లీ తీవ్రంగా ప్రభావితం చేస్తే.. ఈ రిలీజ్ డేట్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. లేదంటే సెప్టెంబర్‌లోనే కొత్త ప్రొడక్ట్స్ రిలీజ్ అవుతాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Apple, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు