వాట్సప్ స్టిక్కర్స్ వాడుతున్నారా? మీకు బ్యాడ్ న్యూస్

చాలావరకు యాప్స్ ఒకేలా ఉండటం, వాటి డిజైన్లు కూడా ఒకేలా ఉండటం, ఇవన్నీ తమ గైడ్‌లైన్స్‌ని ఉల్లంఘిస్తుండటమే కారణమంటోంది యాపిల్. అందుకే యాప్ స్టోర్‌లోంచి వాట్సప్ స్టిక్కర్ యాప్స్ డిలిట్ కానున్నాయి.

news18-telugu
Updated: November 18, 2018, 5:39 PM IST
వాట్సప్ స్టిక్కర్స్ వాడుతున్నారా? మీకు బ్యాడ్ న్యూస్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వాట్సప్ యూజర్లకు ఇటీవలే స్టిక్కర్స్ రిలీజ్ చేసింది ఆ కంపెనీ. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్‌పై వచ్చిన ఈ కొత్త ఫీచర్‌ అందర్నీ ఆకట్టుకుంది. రకరకాల థీమ్స్, మూడ్స్, కేటగిరీల్లో స్టిక్కర్లున్నాయి. అయితే ఈ స్టిక్కర్స్ గతంలోనే హైక్ మెసెంజర్, టెలిగ్రామ్ లాంటి యాప్స్‌లో వచ్చాయి. వాట్సప్‌లోనే చాలా ఆలస్యంగా స్టిక్కర్ ఫీచర్ తీసుకొచ్చారు. ఈ ఫీచర్ రాగానే... గూగుల్ ప్లే స్టోర్, యాప్‌స్టోర్‌లో వాట్సప్ స్టిక్కర్ యాప్స్ కుప్పలుతెప్పలు పుట్టుకొచ్చాయి. వీటిని వాడాలంటే ఆ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యాప్స్‌ని యాప్ స్టోర్ నుంచి డిలిట్ చేయాలని యాపిల్ నిర్ణయించింది.

వాట్సప్ స్టిక్కర్ల విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలను వెల్లడించింది యాపిల్. చాలావరకు యాప్స్ ఒకేలా ఉండటం, వాటి డిజైన్లు కూడా ఒకేలా ఉండటం, ఇవన్నీ తమ గైడ్‌లైన్స్‌ని ఉల్లంఘిస్తుండటమే కారణమంటోంది యాపిల్. అందుకే యాప్ స్టోర్‌లోంచి వాట్సప్ స్టిక్కర్ యాప్స్ డిలిట్ కానున్నాయి. మరి గూగుల్ ప్లే స్టోర్ ఏం చేయనుందో ఇంకా స్పష్టత లేదు. అసలు వాట్సప్ స్టిక్కర్స్ ఫీచర్‌ తీసుకురావడంలోనే కొన్ని లోపాలున్నాయి. అదనంగా స్టిక్కర్స్ కావాలంటే థర్డ్ పార్టీ యాప్స్‌పై ఆధారపడాల్సి వస్తోంది. టెలిగ్రామ్‌లో థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండానే స్టిక్కర్స్ ఉపయోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

మూడు రూపాయలతో మీ బ్యాంక్ అకౌంట్‌ని కాపాడుకోండిలా...వాట్సప్‌లో ఈ కొత్త ఫీచర్స్ ఎలా వాడాలో తెలుసా?

పాన్ కార్డ్ ఆన్‌లైన్‌లో పొందండి... కేవలం రూ.101 మాత్రమే

గూగుల్ ఎర్త్‌లో కనిపించని పటేల్ విగ్రహం... ఏం జరిగింది?లోన్ తీసుకోకుండా క్రెడిట్ స్కోర్ పెంచుకోండిలా...

 
First published: November 18, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>