Home /News /technology /

APPLE STARTS MAKING IPHONE 11 IN INDIA BN

ఐ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి తక్కువ ధరకే..

(image: Apple)

(image: Apple)

ఆపిల్ తన ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 11ను ఇండియాలో తయారు చేసేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల గతంలో కంటే తక్కువ ధరకే ఐఫోన్లు ఇండియన్ కస్టమర్లకు అందనున్నాయి.

    ఐ ఫోన్.. దాదాపు ఈ ఫోన్‌ను ఇష్టపడని వారు ఉండరు. ఐ ఫోన్ పట్ల ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కొంతమంది ఏకంగా అప్పు చేసి మరీ కొంటుంటారు. ఇది చేతిలో ఉంటే ప్రెస్టేజీగా ఫీలవుతుంటారు. అందుకే ఆపిల్ స్మార్ట్ ఫోన్ దిగ్గజంగా మారిపోయింది. ఇప్పటివరకు ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తి విదేశాలకే పరిమితమయ్యింది. అయితే తాజాగా ఆపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆపిల్ తన ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 11ను ఇండియాలో తయారు చేసేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల గతంలో కంటే తక్కువ ధరకే ఐఫోన్లు ఇండియన్ కస్టమర్లకు అందనున్నాయి. ఆపిల్ సంస్థ తమిళనాడు రాజధాని చెన్నైలో తన ఉత్పత్తిని ప్రారంభించింది. ఫాక్స్‌కాన్ ప్లాంట్లో ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 11ను తయారు చేస్తోంది. ఆపిల్ ఐఫోన్ 11ను తొలిసారిగా దేశీయంగా ఉత్పత్తి చేస్తోంది. ఆపిల్ ఐఫోన్‌లను దేశీయంగా తయారు చేయడం ప్రయోజనకరంగా ఉండనుంది. అయితే ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాక మంత్రి పీయూష్ గోయల్ ట్టిట్టర్ ద్వారా ప్రకటించారు.

    మేడ్ ఇన్ ఇండియాలో ఇది చాలా కీలకమైన పురోగతిగా అభివర్ణించారు. ఆపిల్ దేశంలో తొలిసారిగా టాప్ ఆఫ్ ది లైన్ మోడల్‌ను తీసుకొస్తోందంటూ ట్వీట్ చేశారు. ఐఫోన్ ఎక్స్‌ఆర్ స్మార్ట్ ఫోన్ అసెంబ్లింగ్ ప్రారంభించిన 9 నెలల తర్వాత ఈ కొత్త పరిణామం జరిగింది. మేడ్ ఇన్ ఇండియా యూనిట్లతో పోలిస్తే దిగుమతి చేసుకున్న స్మార్ట్‌ఫోన్లపై 20 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇండియాలో ఐఫోన్లు తయారు అవుతుండడం వల్ల వీటి ధరలు తగ్గనున్నాయి. దీంతో ఐఫోన్ వినియోగదారులకు తక్కువ ధరలకే ఇక నుంచి ఐఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Apple, Chennai, Iphone, Tamil nadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు