APPLE SMART BOTTLES APPLE SELLING SMART WATER BOTTLES HERE ARE THE PRICES FEATURES DETAILS HERE GH VB
Apple Smart Bottles: యాపిల్ నుంచి స్మార్ట్ వాటర్ బాటిల్స్.. వీటి ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
ప్రతీకాత్మక చిత్రం
టెక్ దిగ్గజం యాపిల్ (Apple) ఎవరూ ఊహించని ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ కంపెనీ గతేడాది పాలిషింగ్ క్లాత్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కంపెనీ కొత్తగా రెండు రకాల వాటర్ బాటిల్స్ (Water Bottles) విక్రయించడం ప్రారంభించింది.
టెక్ దిగ్గజం యాపిల్ (Apple) ఎవరూ ఊహించని ప్రొడక్ట్స్(Products) లాంచ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ కంపెనీ గతేడాది పాలిషింగ్ క్లాత్‌ను(Cloth) విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కంపెనీ(Company) కొత్తగా రెండు రకాల వాటర్ బాటిల్స్ (Water Bottles) విక్రయించడం ప్రారంభించింది. ఇవి మామూలు వాటర్ బాటిల్స్ కావు. రకరకాల స్మార్ట్ ఫీచర్లతో వచ్చే స్మార్ట్ బాటిళ్లు (Smart Bottles). హైడ్రేట్‌స్పార్క్ (HidrateSpark) అనే కంపెనీ నుంచి ఈ రెండు కొత్త స్మార్ట్ వాటర్ బాటిళ్లను యాపిల్ సంస్థ తన స్టోర్లలో అమ్మడం స్టార్ట్ చేసింది. ఈ బాటిల్స్ కంపెనీ ఆన్లైన్, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. మరి యాపిల్ తీసుకొచ్చిన ఈ కొత్త స్మార్ట్ బాటిళ్ల ఫీచర్లు ఏంటి? ఇవి ఎలా పనిచేస్తాయి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హైడ్రేట్‌స్పార్క్ వాటర్ బాటిల్స్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లో మాత్రమే లభిస్తున్నాయి. యాపిల్ కంపెనీ వెబ్సైట్లో దీని ధర 59.95 (దాదాపు రూ.4,600) డాలర్లుగా ఉంది. ఈ స్మార్ట్ వాటర్ బాటిళ్లు యూజర్లు తీసుకునే వాటర్ కంటెంట్‌ను ఆటోమేటిక్‌గా ట్రాక్ చేస్తాయి. తరువాత వాటర్ ఇన్‌టేక్ (Water Intake)కి సంబంధించిన డేటాను యాపిల్ హెల్త్ (Apple Health)కి సింక్ (Sync) చేయడానికి యూజర్లను అనుమతిస్తాయి. ఈ బాటిళ్లలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి హైడ్రేట్‌స్పార్క్ ప్రో (HidrateSpark Pro) కాగా దీని ధరను 59.95 డాలర్లుగా నిర్ణయించారు. హైడ్రేట్‌స్పార్క్ ప్రో స్టీల్ (HidrateSpark Pro STEEL) ధర రూ.79.95 (దాదాపు రూ.6,130) డాలర్లుగా ఉంది.
* హైడ్రేట్‌స్పార్క్ ప్రో స్టీల్ ప్రత్యేకతలు
హై-ఎండ్ మోడల్, హైడ్రేట్‌స్పార్క్ ప్రో స్టీల్ బాటిల్ సిల్వర్, బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇది రెండు రకాల మూతలతో కూడిన వాక్యూమ్-ఇన్సులేటెడ్ (Vacuum-Insulated) 32-ఔన్స్ వాటర్ బాటిల్ అని కంపెనీ తెలిపింది. యూజర్లు ఈ మూతలు ఉపయోగించి ఒకేసారి చాలా నీటిని తాగొచ్చు లేదా ఒక స్ట్రా ఉపయోగించి కొద్దికొద్దిగా నీటిని తీసుకోవచ్చు. ఈ బాటిల్ కింద భాగంలో ఎల్ఈడీ లైట్ ఇచ్చారు. ఇది యూజర్లు ఎంత వాటర్ తాగుతున్నారనే దాన్ని గ్రహించి, ఆ డేటాను బ్లూటూత్ ద్వారా వారి ఫోన్‌కి, యాపిల్ హెల్త్‌కి సెండ్ చేస్తుంది.
ఈ వాక్యూమ్-ఇన్సులేటెడ్ బాటిల్స్ వాటర్ లేదా ఇతర ద్రవాలను 24 గంటల వరకు చల్లగా ఉంచగలవు. హైడ్రేట్‌స్పార్క్ ప్రో స్టీల్ బాటిల్, దాని మూత బిస్ ఫినాల్ ఎ (BPA-free) ఫ్రీగా, అలానే డిష్వాషర్-సేఫ్ గా వస్తుంది. ఎల్ఈడీ లైట్ ఉన్న భాగాన్ని కడగడం సాధ్యం కాదు. దీన్ని తడి గుడ్డతో మాత్రమే శుభ్రం చేయాలి.
* హైడ్రేట్‌స్పార్క్ ప్రో ప్రత్యేకతలు
హై-ఎండ్ బాటిల్ కంటే కాస్త చౌకైన హైడ్రేట్‌స్పార్క్ ప్రో బాటిల్ గ్రీన్ లేదా బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది. దీన్ని వాక్యూమ్-ఇన్సులేటెడ్ స్టీల్‌కు బదులుగా షటర్ ప్రూఫ్ (Shutter Proof), ఓడర్ ప్రూఫ్ ట్రైటాన్ ప్లాస్టిక్ (odour proof Tritan plastic)తో తయారు చేశారు. ఇది హై-ఎండ్ వాటర్ బాటిల్ వలె అదే ఎల్ఈడీ సెన్సార్ ని కలిగి ఉంటుంది. అదేవిధంగా స్టీల్ బాటిల్ లాంటి రెండు రకాల మూతలతో వస్తుంది.
యాపిల్ స్టోర్‌లో హైడ్రేట్ స్పార్క్ స్టీల్, హైడ్రేట్ స్పార్క్ 3తో సహా పాత హైడ్రేట్ స్పార్క్ వాటర్ బాటిళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. హైడ్రేట్ స్పార్క్ స్టీల్, ధర వరుసగా 70 (దాదాపు రూ. 5,400) డాలర్లు, హైడ్రేట్ స్పార్క్ 3 ధర 60 (సుమారు రూ.4,600) డాలర్లుగా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో హైడ్రేట్‌స్పార్క్ స్మార్ట్ వాటర్ బాటిళ్లు అందుబాటులో లేవు. హైడ్రేట్‌స్పార్క్ స్మార్ట్ వాటర్ బాటిళ్ల కోసం యాపిల్ ఇండియా అధికారిక ఆన్లైన్ స్టోర్‌ని చెక్ చేయగా.. స్టోర్‌లో బాటిల్స్ కనిపించలేదు. ఇవి త్వరలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.