Home /News /technology /

APPLE SECURITY FLAW SERIOUS SECURITY VULNERABILITIES FOR IPHONES IPADS AND MACS THAT COULD POTENTIALLY ALLOW ATTACKERS TO TAKE COMPLETE CONTROL GH SRD

Apple Security Flaw: ఐఫోన్, ఐప్యాడ్‌ యూజర్లకు అలర్ట్.. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్‌తో బోలెడు సమస్యలు.. ముఖ్యంగా..

Apple Security Flaw

Apple Security Flaw

Apple Security Flaw: ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌ ఓఎస్‌లలో ఉన్న ఒక సాంకేతిక లోపం హ్యాకర్లకు సైబర్ అటాక్స్‌ చేయడానికి మార్గం సుగమం చేస్తోంది. ఈ సాంకేతిక లోపం వల్ల సైబర్ అటాకర్స్ చాలా ఈజీగా ఐప్యాడ్స్‌ లేదా ఐఫోన్ మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోగలరు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) తయారుచేసే ఐఫోన్స్‌ (iPhones), ఐప్యాడ్స్‌ (iPads) కట్టుదిట్టమైన భద్రత అందిస్తాయని యూజర్లు భావిస్తారు. హ్యాకర్లు (Hackers) తమ డివైజ్‌పై దాడి చేయడం దాదాపు అసాధ్యం అనుకుంటారు. కానీ ప్రస్తుతం ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌ ఓఎస్‌లలో ఉన్న ఒక సాంకేతిక లోపం హ్యాకర్లకు సైబర్ అటాక్స్‌ చేయడానికి మార్గం సుగమం చేస్తోంది. ఈ సాంకేతిక లోపం వల్ల సైబర్ అటాకర్స్ చాలా ఈజీగా ఐప్యాడ్స్‌ లేదా ఐఫోన్ మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోగలరు. ఈ డేంజరస్ సెక్యూరిటీ లోపం (Major Security Flaw) గురించి యాపిల్ బుధవారం వెల్లడించింది. ఆ తర్వాత యూజర్లు తమ డివైజ్‌ను న్యూ సెక్యూరిటీ అప్‌డేట్‌ (New Security Update)కు అప్‌డేట్‌ చేసుకోవాల్సిందిగా టెక్ ఎక్స్‌పర్ట్స్ సూచించారు.

యాపిల్ కంపెనీ బుధవారం నాడు రెండు సెక్యూరిటీ లోపాల (Security vulnerabilities) గురించి రెండు సెక్యూరిటీ రిపోర్ట్‌లను విడుదల చేసింది. అవి పెద్దగా ఎవరి దృష్టిని ఆకర్షించలేదు. వీటిలో ఒక సెక్యూరిటీ లోపం యూజర్లకు చాలా డేంజరస్ అని కంపెనీ తెలిపింది. ఈ సెక్యూరిటీ లోపాన్ని సద్వినియోగం చేసుకుంటూ హ్యాకర్లు యూజర్ డివైజ్‌కు "ఫుల్ అడ్మిన్ యాక్సెస్" పొందవచ్చు. ఆ తర్వాత డివైజ్‌లో యూజర్ లాగా ఏ మాల్వేర్ కోడ్ అయినా రన్ చేయచ్చు. యూజర్ పేరు మీద ఏ సాఫ్ట్‌వేర్‌నైనా ఎగ్జిక్యూట్ కూడా చేయగలరు. ఈ విషయాన్ని సోషల్ ప్రూఫ్ సెక్యూరిటీ CEO రేచెల్ టొబాక్ తెలిపారు.

యూజర్లు తమ డివైజ్‌ను ఎలా రక్షించుకోవాలి?
సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్ ప్రభావితమైన డివైజ్‌లను లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌కు అప్‌డేట్ చేయమని వినియోగదారులకు సలహా ఇచ్చారు. iPhone6S, ఆపై మోడల్స్.. 5వ జనరేషన్ ఐప్యాడ్ సహా ఆపై మోడల్స్.. అన్ని ఐప్యాడ్ ప్రో మోడల్స్‌, ఐప్యాడ్ ఎయిర్ 2, MacOS Monterey పై రన్ అయ్యే Mac కంప్యూటర్లను అప్‌డేట్ చేయాలన్నారు. ఈ లోపం కొన్ని ఐపాడ్ మోడల్‌లను కూడా ప్రభావితం చేస్తుంది. ఎలా, ఎక్కడ లేదా ఎవరి ద్వారా ఈ లోపం బహిర్గతం అయిందో యాపిల్ కంపెనీ తన రిపోర్టులలో వెల్లడించలేదు.

ఇజ్రాయెలీ స్పైవేర్ సంస్థ NSO గ్రూప్‌కి దీనితో లింకేంటి?
ఇజ్రాయెల్ NSO గ్రూప్ వంటి కమర్షియల్ స్పైవేర్ కంపెనీలు పైన పేర్కొన్న లోపాలను వెంటనే పసిగడతాయి. ఈ లోపల ద్వారా ప్రయోజనాన్ని పొందడం, టార్గెట్‌ల స్మార్ట్‌ఫోన్‌లకు రహస్యంగా మాల్వేర్‌లలో పంపించి కంటెంట్‌లను తస్కరించడం, రియల్-టైమ్‌లో యూజర్లను పర్యవేక్షించడంలో ముందుంటాయి. NSO గ్రూప్‌ని యూఎస్ కామర్స్ డిపార్ట్‌మెంట్ బ్లాక్‌లిస్ట్ చేసింది. ఈ గ్రూప్‌కి సంబంధించిన స్పైవేర్‌ను యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో జర్నలిస్టులు, మానవ హక్కులపై ఉపయోగించారు.

ఇది కూడా చదవండి : ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో స్క్రీన్‌షాట్ బ్లాకింగ్ ఫీచర్.. ఇక మీ ఫొటోలు మరింత భద్రం..!

భద్రతా పరిశోధకుడు విల్ స్ట్రాఫాచ్ మాట్లాడుతూ, యాపిల్ రీసెంట్‌గా పాచ్‌లోని లోపాల సాంకేతిక విశ్లేషణను తాను చూడలేదన్నారు. కంపెనీ ఇంతకుముందు ఇదే విధమైన లోపాలను గుర్తించింది. చాలా సందర్భాలలో ఇలాంటి భద్రతా లొసుగుల వల్ల డివైజ్‌లు సైబర్ అటాక్స్‌కి గురవుతున్నాయని తనకు తెలుసునని స్ట్రాఫాచ్ పేర్కొన్నారు. అయితే ఆపిల్ కంపెనీ మాత్రం తాజా లోపం వల్ల ఎంత మంది యూజర్లు ప్రభావితులయ్యారో తెలపలేదు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Apple, Apple iphone, Iphone, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు