Home /News /technology /

APPLE SAYS NAMASTE LAUNCHES ITS FIRST ONLINE STORE IN INDIA SK GH

Apple Online Store: భారత్‌లో యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభం

Apple Online Store: 
(ప్రతీకాత్మక చిత్రం)

Apple Online Store: (ప్రతీకాత్మక చిత్రం)

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాపిల్ స్టోర్లలో అందించే సేవలన్నింటినీ భారత్‌లో ఆన్‌లైన్‌లో అందిస్తున్నట్టు యాపిల్ ఇండియా ప్రకటించింది. నిపుణులైన ఆన్‌లైన్ టీమ్ మెంబర్స్ ద్వారా ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ సేవలను అందించనున్నారు.

భారత్లో మొదటి ఆన్‌లైన్ స్టోర్‌ని యాపిల్ సంస్థ నేడు ప్రారంభించింది. సెప్టెంబర్ 23 నుంచి యాపిల్ ఇండియా వెబ్‌సైట్ (www.apple.com/in) ద్వారా వినియోగదారులు నేరుగా ఉత్పత్తులను కొనవచ్చని ఆ సంస్థ ప్రకటించింది. ఇకనుంచి థర్డ్ పార్టీ సేవలపై ఆధారపడకుండా నేరుగా యాపిల్ ప్రొడక్ట్స్‌ను కొనుక్కోవచ్చు. పాత యాపిల్ ఫోన్లను తమ ప్లాట్‌ఫామ్ ద్వారా అమ్మే అవకాశంతో పాటు ఇతర ప్రయోజనాలను కూడా ఆ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాపిల్ స్టోర్లలో అందించే సేవలన్నింటినీ భారత్‌లో ఆన్‌లైన్‌లో అందిస్తున్నట్టు యాపిల్ ఇండియా ప్రకటించింది. నిపుణులైన ఆన్‌లైన్ టీమ్ మెంబర్స్ ద్వారా ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ సేవలను అందించనున్నారు. ఆన్‌లైన్‌లో తమ ఉత్పత్తులు కొనాలనుకునే వారు వెబ్‌సైట్లోొ వాటికి సంబంధించిన సమాచారం గురించి ఆరా తీయొచ్చు. ఆదాయం, చెల్లింపులు, డెలివరీల పరంగా ఏ ఉత్పత్తి సరైనదో ఎంచుకోవడానికి స్పెషలిస్టులు సాయపడతారు.

* Macలకు ప్రత్యేక సేవలు
ఆన్లైన్ స్టోర్ ద్వారా యాపిల్ Macలను కూడా అమ్మనున్నారు. వినియోగదారుల ప్రాధాన్యాన్ని బట్టి, వారికి వివిధ రకాల Macలను అందుబాటులోకి తీసుకొస్తామని ఆ సంస్థ తెలిపింది. యాపిల్ ఆన్లైన్ స్టోర్లో Macను కొనుగోలు చేసినప్పుడు.. ఎక్స్ట్రా మెమరీ, ఎడిషనల్ స్టోరేజ్, ఎక్స్‌ట్రా పవర్ఫుల్ గ్రాఫిక్స్ కార్డ్ వంటి సదుపాయాలను అదనంగా కోరవచ్చు. వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా కొత్త మ్యాక్ను సంస్థ అందిస్తుంది.

* అదనపు వారంటీ కూడా..
యాపిల్ ఆన్లైన్ స్టోర్ కల్పిస్తున్న మరో ప్రయోజనం “ట్రేడ్-ఇన్” ఆప్షన్. కొత్త ఐఫోన్ కొనాలనుకునేవారు తమ వద్ద ఉన్న పాత స్మార్ట్ ఫోన్లను ఆన్లైన్లోనే ఎక్చేంజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు యాపిల్ కేర్ ప్లస్(AppleCare+) సేవలు కూడా పొందొచ్చు. దీని ద్వారా యాపిల్ ఉత్పత్తులకు అదనంగా రెండు సంవత్సరాల వారంటీ కల్పిస్తారు. టెక్నికల్ సపోర్టు, యాక్సిడెంటల్ డ్యామేజీ కవరేజ్ వంటి సేవలను దీంట్లో భాగంగా యాపిల్ అందించనుంది.

* డెలివరీ ఉచితం
క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, రూపే, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఆన్ డెలివరీ ద్వారా కొనుగోలుదారులు ఆన్‌లైన్‌ స్టోర్లో చెల్లింపులు చేయవచ్చు. ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేసిన ఏ ఉత్పత్తికైనా ఫ్రీ డెలివరీ చేస్తామని యాపిల్ ప్రకటించింది. ప్రొడక్ట్‌లను కొనాలనుకునేవారు యాపిల్ స్పెషలిస్ట్‌తో ఆన్‌లైన్‌లో మాట్లాడే సదుపాయమూ ఉంది. యాపిల్ స్పెషలిస్ట్లు తమ ఉత్పత్తులకు సంబంధించిన సాంకేతిక సహాయం కూడా చేస్తారు. హార్డ్‌వేర్ సాఫ్ట్‌వేర్ సమస్యలు, డివైజ్ సెట్టింగ్స్, యాపిల్ ఐడీ రికవరీకి సంబంధించి ఎలాంటి సహాయం కావాలన్నా ఆన్‌లైన్  ద్వారా అందించనున్నారు.


భారతదేశంలో తొలి ఆఫ్‌లైన్ స్టోర్ ప్రారంభిస్తామని ఇప్పటికే యాపిల్ ప్రకటించింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో తొలి యాపిల్ స్టోర్, బెంగళూరులో రెండో స్టోర్ తెరవనుంది. అయితే అంతకన్నా ముందే ఇండియాలోని యాపిల్ ఫ్యాన్స్‌కు దగ్గరయ్యేందుకు ఆన్‌లైన్ స్టోర్ ను ప్రారంభించింది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Apple, Iphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు