APPLE RUMOURED TO LAUNCH A NEW LOW COST EXTERNAL DISPLAY FOR MACS GH VB
Apple External Display: యాపిల్ మ్యాక్ యూజర్ల కోసం త్వరలోనే ఎక్స్టర్నల్ డిస్ప్లే లాంచ్.. లీకైన ఫీచర్ల వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
ప్రస్తుతం పెద్ద స్క్రీన్ కోసం చూస్తున్న మ్యాక్ వినియోగదారులకు $4,999 (సుమారు రూ. 3,79,311) వద్ద ప్రో డిస్ప్లే మాత్రమే అందుబాటులో ఉంది. మరింత మెరుగైన డిస్ప్లే కోరుకునే వారి కోసం వచ్చే నెలలో కొత్త ఎక్స్టర్నల్ మానిటర్‌ను సరసమైన ధరకే లాంచ్ చేయనుంది యాపిల్.
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాపిల్ ఉత్పత్తులను స్టేటస్ సింబల్‌గా భావిస్తుంటారు చాలా మంది. అందుకే ప్రీమియం రేంజ్లో లభించే యాపిల్ ఉత్పత్తులు హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తుంది యాపిల్ సంస్థ. ఈ ప్రీమియం బ్రాండ్ తన మ్యాక్ యూజర్ల కోసం త్వరలోనే ఎక్స్టర్నల్ డిస్ప్లేను (Apple External Display) ఆవిష్కరించనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ డిస్ప్లే కన్జ్యూమర్ ఫ్రెండ్లీగా ఉంటుందని లీకేజీలను బట్టి తెలుస్తోంది.
ప్రస్తుతం $4,999 (సుమారు రూ. 3,79,311) ధర వద్ద లభిస్తున్న ప్రో డిస్ప్లే ఎక్స్‌డీఆర్ కంటే ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉండనుందని ప్రముఖ టిప్‌స్టర్ మార్క్ గుర్మాన్ తన తాజా బ్లూమ్‌బెర్గ్ 'పవర్ ఆన్' న్యూస్లెటెర్లో పేర్కొన్నారు. యాపిల్ తన మ్యాక్ యూజర్ల కోసం కొత్త ఎక్స్టర్నల్ మానిటర్లను సైతం లాంచ్ చేయనుందని ఆయన చెప్పుకొచ్చారు.
‘‘ప్రో డిస్ప్లే ఎక్స్‌డీఆర్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఎక్స్టర్నల్ డిస్ప్లేను యాపిల్ త్వరలో ఆవిష్కరించనుంది. మ్యాక్‌బుక్ ప్రోకి పెద్ద స్క్రీన్‌ను జోడించాలనుకునే వ్యక్తుల కోసం తక్కువ ధరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది.” అని మార్క్ గుర్మాన్ తెలిపారు. కాగా, ఈ మానిటర్‌ను "హాట్ సెల్లర్" గా ఆయన పేర్కొన్నారు. కొత్త డిస్ప్లే మెరుగైన బ్రయిట్నెస్, కాంట్రాస్ట్ రేషియోతో వస్తుందని చెప్పారు. ఈ ఎక్స్టర్నల్ డిస్ప్లే జనవరి 2021లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు.
ప్రస్తుతం పెద్ద స్క్రీన్ కోసం చూస్తున్న మ్యాక్ వినియోగదారులకు $4,999 (సుమారు రూ. 3,79,311) వద్ద ప్రో డిస్ప్లే మాత్రమే అందుబాటులో ఉంది. మరింత మెరుగైన డిస్ప్లే కోరుకునే వారి కోసం వచ్చే నెలలో కొత్త ఎక్స్టర్నల్ మానిటర్‌ను సరసమైన ధరకే లాంచ్ చేయనుంది యాపిల్. అయితే, ఈ డిస్ప్లే పరిమాణం కొంచెం చిన్నదిగా ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాక్ ఎక్స్టర్నల్ డిస్ప్లేలు 24, 27, 32 అంగుళాల సైజులో లభిస్తాయి.
ప్రో డిస్ప్లే ఎక్స్డీఆర్కు సక్సెసర్‌గా ఎల్జీ మూడు ఎక్స్టర్నల్ డిస్‌ప్లేలపై పనిచేస్తోందని ప్రఖ్యాత టిప్‌స్టర్ @dylandkt ట్వీట్ చేశారు. 32 అంగుళాల డిస్ప్లే కస్టమ్ సిలికాన్ కోటింగ్‌తో ఇది లభిస్తుంది. 27 అంగుళాలు, 32 అంగుళాల మోడల్ మినీ ఎల్ఈడీ డిస్ప్లేలు, 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌తో వస్తాయని ఆయన తెలిపారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.