Home /News /technology /

APPLE ROLLS OUT IMPORTANT UPDATE FOR IPHONES 11 FEATURES YOU MUST KNOW MK GH

Apple New Update: యాపిల్‌ కొత్త ఓఎస్‌ అప్‌డేట్‌ విడుదల... కొత్త ఫీచర్లు ఏమున్నాయో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కాలంలో మాస్క్‌ లేనిదే బయటకు వెళ్లలేకపోతున్నాం. అంతెందుకు ఇంట్లో ఉన్నా కూడా మాస్క్‌ పెట్టుకోమని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఫేస్‌ అన్‌లాక్‌ ఆప్షన్‌ వాడేవారికి ఇబ్బంది వస్తోంది. దీంతో మాస్క్‌ వేసుకున్నా ఫేస్‌ అన్‌లాక్‌ పని చేసేలా మార్పులు చేశారు. అయితే యాపిల్‌ వాచ్‌ ఉన్నవాళ్లకే ఇది సాధ్యమవుతుంది.

ఇంకా చదవండి ...
ఐఫోన్‌ వినియోగదారులకు ఒక గుడ్‌ న్యూస్‌. యాపిల్‌ సంస్థ ఐఫోన్‌లకు కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌డేట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ సంస్థ యూజర్లకు ios 14.5 అప్‌డేట్‌కు సంబంధించిన నోటిఫికేషన్లు పంపిస్తోంది. ఇప్పటికే ఈ ఐఓఎస్‌ అప్‌డేట్ చేసినవారికి కొత్త ఫీచర్ల గురించి తెలిసే ఉంటుంది. అప్‌డేట్‌ చేయనివారు సెట్టింగ్స్‌లోకి వెళ్లి ios 14.5ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. కొత్త అప్‌డేట్‌తో అనేక ఫీచర్లను యాపిల్ పరిచయం చేస్తోంది. వీటి గురించి తెలుసుకుందాం.

కరోనా కాలంలో మాస్క్‌ లేనిదే బయటకు వెళ్లలేకపోతున్నాం. అంతెందుకు ఇంట్లో ఉన్నా కూడా మాస్క్‌ పెట్టుకోమని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఫేస్‌ అన్‌లాక్‌ ఆప్షన్‌ వాడేవారికి ఇబ్బంది వస్తోంది. దీంతో మాస్క్‌ వేసుకున్నా ఫేస్‌ అన్‌లాక్‌ పని చేసేలా మార్పులు చేశారు. అయితే యాపిల్‌ వాచ్‌ ఉన్నవాళ్లకే ఇది సాధ్యమవుతుంది.

మొబైల్స్‌ వాడేవాళ్లకు పెద్ద సమస్య ట్రాకింగ్‌. చాలా సంస్థలు మొబైల్ యూసేజ్‌ని ట్రాక్‌ చేస్తున్నాయని టెక్‌ పరిశోధకులు చెబుతున్నారు. దీంతో యాప్‌ యూసేజ్‌ను మరింత పటిష్ఠం చేస్తూ యాపిల్‌ కొత్తగా యాప్‌ ట్రాకింగ్‌ ట్రాన్స్‌పరెన్సీ అనే ఫీచర్‌ను తెచ్చింది. దీని వల్ల మీరు ఇన్‌స్టాల్ చేసుకున్న యాప్‌ యూసేజ్‌ ట్రాక్‌ చేయడానికి, మీరే పర్మిషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

యాపిల్ 11 సిరీస్‌ వినియోగదారుల కోసం కొత్తగా బ్యాటరీ రీకాలిబ్రేషన్‌ ఫీచర్‌ను 14.5 పరిచయం చేస్తోంది. ఇది మీ మొబైల్‌ బ్యాటరీని అసెస్‌ చేసి రీకాలిబ్రేట్‌ చేస్తుంది. ఒకవేళ మీ మొబైల్‌లో బ్యాటరీ రీకాలిబ్రేషన్‌ జరగకపోతే ఆ బ్యాటరీని యాపిల్‌ ఉచితంగా మార్చి ఇస్తుంది. 11 సిరీస్‌ బ్యాటరీ పర్‌ఫార్మెన్స్‌పై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో యాపిల్‌ ఈ ఫీచర్‌ తెచ్చింది.

ఎమోజీలతో ఛాటింగ్‌ చేసే అలవాటు మీకుందా? అయితే ఐఓఎస్‌ 14.5లో కొత్తగా 200కుపైగా ఎమోజీలను తీసుకొచ్చింది. కొత్త స్మైలీ ఫేస్‌లు, హెడ్‌ఫోన్స్‌ సింబల్స్‌, హార్ట్‌ సింబల్స్‌లో కొత్త రకం ఇప్పుడు వచ్చాయి.

ఎప్పుడూ ఒకే తరహా సిరి వాయిస్‌ అసిస్టెంట్‌ వాయిస్‌ విని బోర్‌ కొట్టిందా. అయితే కొత్త వెర్షన్‌ ఓఎస్‌లో సరికొత్తగా రెండు సిరి వాయిస్‌లను యాడ్‌ చేశారు. అంతేకాకుండా ఇప్పడు సిరి సాయంతో ఫేస్‌ టైమ్‌ గ్రూప్‌ కాల్స్‌ కూడా చేయొచ్చు. ఇప్పుడు సిరి వాయిస్‌ను ఎంచుకునేటప్పుడు వాయిస్‌ 1, వాయిస్‌ 2 అని కనిపిస్తుంది. గతంలోలాగే పేర్లు ఉండవు అని అంటున్నారు.

డ్యూయల్‌ సిమ్‌ సదుపాయం ఉన్న ఐఫోన్స్‌కు 5జీ సపోర్టును యాపిల్‌ తీసుకొచ్చింది. ప్రస్తుతం మన దేశంలో 5జీ అందుబాటులో లేని విషయం తెలిసిందే. ఉన్న దేశాల్లో వాడుకుంటారు మరి. యాపిల్‌ 12 సిరీస్‌ మొబైల్స్‌కు మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తోందని సమాచారం.

గేమర్స్‌కు కూడా యాపిల్‌ భలే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. పీఎస్‌, ఎక్స్‌ బాక్స్‌ కంట్రోలర్స్‌కు ఇప్పుడు ఐఫోన్‌ సపోర్టు చేస్తుంది. ఈ మేరకు 14.5 ఓఎస్‌ అప్‌డేట్‌లో మార్పులు చేశారు.

చాలా రోజుల నిరీక్షణ తర్వాత యాపిల్‌ ఎయిర్‌ ట్యాగ్స్‌ మన దేశానికి వచ్చాయి. అందుకు తగ్గట్టుగా ఐఓఎస్‌లో కూడా మార్పులు అవసరం. కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో ఈ మేరకు మార్పులు చేశారు.

యాపిల్‌లో పాడ్‌కాస్ట్‌ యాప్‌ చాలా రోజుల నుండి అందుబాటులో ఉంది. కొత్త ఓఎస్‌లో దాని డిజైన్‌ ఇంకాస్త ఆకర్షణీయంగా మార్చారు. యాపిల్‌ మ్యూజిక్‌ అప్‌ స్టైల్‌లో పాడ్‌ కాస్ట్‌ యాప్‌ను తీర్చిదిద్దారు. దీంతోపాటు రిమైండర్స్‌ యాప్‌లోనూ మార్పులు చేశారు. మ్యాప్స్‌లోనూ కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది యాపిల్‌. గూగుల్‌ మ్యాప్స్‌లో ఉన్న ఫీచర్లను ఇప్పుడు యాపిల్‌లో కూడా పొందొచ్చు.

14.5 ఏయే మొబైల్స్‌కు అందుబాటులోకి వస్తుందంటే....

ఐఓఎస్‌ 14తో పని చేస్తున్న అన్ని స్మార్ట్‌ ఫోన్లకు 14.5ను యాపిల్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే 12 సిరీస్‌లో ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 ప్రో, ఐఫోన్‌ 12 మినీ, ఐఫోన్‌ 12 ప్రో మ్యాక్స్‌కు 14.5 వస్తుంది. ఇక 11 సిరీస్‌ చూస్తే... ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌ ఉన్నాయి. వీటితోపాటు ఐఫోన్‌ Xఆర్‌, ఐఫోన్‌ Xఎస్‌, ఐఫోన్‌ Xఎస్‌ మ్యాక్స్‌కు కూడా వస్తుంది. ఐఫోన్‌ 8 సిరీస్‌, ఐఫోన్‌ 7 సిరీస్‌, ఐఫోన్‌ 6ఎస్, ఐఫోన్‌ ఎస్‌ఈ (2016), ఎస్‌ఈ (2020తోపాటు ఐఫోన్‌ టచ్‌ (7వ జనరేషన్‌)కు 14.5 అప్‌డేట్‌ వస్తుంది.

ఎలా డౌన్‌లోడ్‌ చేయాలంటే...

మీ మొబైల్‌కు ఓఎస్‌ అప్‌డేట్‌ వచ్చినప్పుడు నోటిఫికేషన్‌ రూపంలో యాపిల్‌ తెలియజేస్తుంది. అప్పుడు ఆ నోటిఫికేషన్‌ క్లిక్‌ చేస్తే ఓఎస్‌ అప్‌డేట్‌ పేజీలోకి వెళ్తుంది. అక్కడ డౌన్‌లోడ్‌ అండ్‌ ఇన్‌స్టాల్‌ అని ఉంటుంది. అది క్లిక్‌ చేస్తే ఇన్‌స్టాల్‌ అవుతుంది. ఆ తర్వాత మీ మొబైల్‌ రీస్టార్ట్‌ అవుతుంది. దాంతో అప్‌డేట్ పూర్తయినట్లే. ఒకవేళ నోటిఫికేషన్‌ రాకపోయుంటే... నేరుగా మొబైల్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అందులో జనరల్‌ ఆప్షన్‌లోకి వెళ్లండి. అక్కడ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అని ఉంటుంది. అందులోకి వెళ్తే ముందు చెప్పినట్లు డౌన్‌లోడ్‌ అండ్‌ ఇన్‌స్టాల్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. అది క్లిక్‌ చేస్తేసరి. అయితే ఓఎస్‌ అప్‌డేట్‌ చేసుకునేటప్పుడు మొబైల్‌లో ఛార్జింగ్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అప్‌డేట్‌ ప్రాసెస్‌ సమయంలో బ్యాటరీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అన్నట్లు బ్యాటరీ 30 శాతం కంటే తక్కువగా ఉంటే ఓఎస్‌ అప్‌డేట్‌ ప్రాసెస్‌ అవ్వదు కూడా. ఛార్జింగ్‌ పెట్టుకోండి అని యాపిల్‌ సూచిస్తుంది. దీంతోపాటు వైఫై అందుబాటులో ఉన్నప్పుడే ఓఎస్‌ అప్‌డేట్‌ పెట్టుకోవడం ఉత్తమం అని టెక్‌ నిపుణులు సూచిస్తుంటారు. మొబైల్‌ డేటాతో అప్‌డేట్‌ చేస్తున్నట్లయితే మధ్యలో డేటా ప్లాన్‌ అయిపోకుండా చూసుకోండి.
Published by:Krishna Adithya
First published:

Tags: Apple, Ios

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు