మూడు కొత్త ఫోన్స్ లాంఛ్ చేసిన యాపిల్

news18-telugu
Updated: September 13, 2018, 10:55 AM IST
మూడు కొత్త ఫోన్స్ లాంఛ్ చేసిన యాపిల్
  • Share this:
మొబైల్ రంగంలో ఆపిల్ కంపెనీని తలదన్నే మరే బ్రాండ్ ఇంతవరకు మార్కెట్లో అడుగుపెట్టలేదనే చెప్పాలి. ఈ బ్రాండ్ నుండి ఏ కొత్త మొబైల్ బయటికొచ్చిన ధరతో సంభందం లేకుండా హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. ఇప్పుడు ఆపిల్ సంస్థ మరో మూడు కొత్త ఫోన్స్ ను అంతర్జాతీయ మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. ఇందులో ఐఫోన్ ఎక్స్ ఆర్, ఐఫోన్ ఎక్స్ ఎస్, ఐఫోన్ ఎక్స్ మాక్స్ మోడళ్ళు ఉన్నాయి.
ఈ సాయంత్రం ఆపిల్ క్యాంపస్ లోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో జరిగిన లాంచింగ్ కార్యక్రమంలో ఈ మూడు ఫోన్స్ ను రిలీజ్ చేశారు. మరి వీటిలో కొత్తగా ఏమేమి టెక్నాలజీ, ఫీచర్స్, వాటి ధరల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఐఫోన్ ఎక్స్ ఆర్ : 6.1 అంగుళాలతో LCD స్క్రీన్ తో ముస్తాబైంది. ఈ స్క్రీన్ రెజల్యూషన్ 1792x 828 గా ఉంది. A11/A12 చిప్ తో పనిచేస్తుండగా, 3 GB RAM తో నడవనుంది. దీనికి సింగల్ 12 MP కెమెరాతో పేస్ ఐడి టెక్నాలజీ ఇందులో ఉంది. గ్లాస్ & అల్యూమినియంతో దీని బాడీని రూపొందించారు. ఈ మోడల్ 64 GB /256 GB లతో లభిస్తుంది. దీని ధర $699గా నిర్ణయించారు.

ఐఫోన్ ఎక్స్ ఎస్ : 5.8 అంగుళాలతో OLED స్క్రీన్ తో తయారైంది. ఈ స్క్రీన్ రెజల్యూషన్ 2436x 1125 గా ఉంది. A12 చిప్ తో పనిచేస్తుండగా, 4 GB RAM తో నడవనుంది. 12 MP డ్యూయల్ కెమెరా మరియు పేస్ ఐడి టెక్నాలజీ ఇందులో ఉంది. గ్లాస్ & స్టైన్ స్టీల్ తో దీని బాడీని రూపొందించారు. ఈ మోడల్ 64 GB /256 GB / 512 GB లతో లభిస్తుంది. దీని ధర $899గా నిర్ణయించారు.ఐఫోన్ ఎక్స్ ఎస్ మ్యాక్స్ : 6.5 అంగుళాలతో OLED స్క్రీన్ తో తయారైంది. ఈ స్క్రీన్ రెజల్యూషన్ 2688x 1242 గా ఉంది. A12 చిప్ తో పనిచేస్తుండగా, 4 GB RAM తో నడవనుంది. 12 MP డ్యూయల్ కెమెరా మరియు పేస్ ఐడి టెక్నాలజీ ఇందులో ఉంది. గ్లాస్ & స్టైన్ స్టీల్ తో దీని బాడీని రూపొందించారు. ఈ మోడల్ 64 GB /256 GB / 512 GB లతో లభిస్తుంది. దీని ధర $999గా నిర్ణయించారు.

ఈ మొబైల్స్ ప్రీ ఆర్డర్ రేపటి నుండే మొదలు కానుంది. ఐఫోన్ ఎక్స్ ఎస్ మరియు ఐఫోన్ ఎక్స్ ఎస్ మ్యాక్స్ మొబైల్స్ సెప్టెంబర్ 21 నుంచి మార్కెట్లోకి రానుండగా, ఐఫోన్ ఎక్స్ ఆర్ మాత్రం అక్టోబర్ 26 నుండి అందుబాటులోకి రానుందని ఆపిల్ సంస్థ తెలిపింది.

First published: September 13, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...