APPLE RELEASES SCREEN CLEANING CLOTH SETS HIGH BAR FOR BRAND EXTRAS HERE IS ITS PRICE DETAILS GH SK
Apple Polishing Cloth: యాపిల్ నుంచి సరికొత్త స్క్రీన్ క్లీనింగ్ క్లాత్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
(ప్రతీకాత్మక చిత్రం)
Apple Polishing cloth: ఎలాంటి రాపిడి కలిగించని నాన్ అబ్రెసివ్ మెటీరియల్‌తో తయారు చేసిన క్లాత్ యాపిల్ లోగోతో అందుబాటులోకి వచ్చింది. సాధారణ మైక్రోఫైబర్ వస్త్రం కంటే ఇది భిన్నంగా ఉంటుందని, దీన్ని వాడేవారికి ఆ అనుభూతి తెలుస్తుందని యాపిల్ ప్రకటించింది.
ప్రీమియం గ్యాడ్జెట్లు, ప్రొడక్ట్స్‌తో కస్టమర్లను ఆకట్టుకునే యాపిల్ (Apple) సంస్థ సోమవారం సరికొత్త మ్యాక్‌బుక్ ప్రో (Mac Book Pro) డివైజ్‌లను, థర్డ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ (3rd generation airpods) ను విడుదల చేసింది. అయితే దీంతో పాటు మరో ప్రొడక్ట్‌ను కూడా సంస్థ లాంచ్ చేసింది. టచ్ స్క్రీన్లను, గాడ్జెట్లను శుభ్రం చేసే ప్రత్యేకమైన పాలిషింగ్ క్లాత్ (polishing Cloth)ను యాపిల్ ఆవిష్కరించింది. అయితే దీని ధర మాత్రం ఎవరూ ఊహించనంతగా ఉంది. దీని ధరను సంస్థ ఏకంగా 19 డాలర్లుగా (సుమారు రూ.1500) నిర్దేశించింది. ఐఫోన్ 6 నుంచి 2012 మ్యాక్ డివైజ్‌ల వరకు.. అన్ని యాపిల్ ప్రొడక్ట్స్‌ను ఈ క్లాత్‌తో క్లీన్ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది.
ఈ క్లాత్‌తో ఎలక్ట్రానిక్ డివైజ్‌లను, టచ్ స్క్రీన్ ప్యాడ్స్‌ను క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి రాపిడి కలిగించని నాన్ అబ్రెసివ్ మెటీరియల్‌తో తయారు చేసిన క్లాత్ యాపిల్ లోగోతో అందుబాటులోకి వచ్చింది. సాధారణ మైక్రోఫైబర్ వస్త్రం కంటే ఇది భిన్నంగా ఉంటుందని, దీన్ని వాడేవారికి ఆ అనుభూతి తెలుస్తుందని యాపిల్ ప్రకటించింది. ముఖ్యంగా యాపిల్ ప్రొడక్ట్స్‌ను శుభ్రం చేసేటప్పుడు మృదువైన లింట్-ఫ్రీ క్లాత్‌ను ఉపయోగించాలని.. రాపిడి కలుగజేసే క్లాత్‌లు, పేపర్ టవల్స్ వంటివి వాడకూడదని యాపిల్ ముందు నుంచి సిఫార్సు చేస్తోంది. ఈ క్రమంలో కొత్త పాలిషింగ్ క్లాత్‌ను సంస్థ విడుదల చేసింది. ఇప్పటికే దీనికి కొరత ఉంది. రవాణా చేయడానికి 3 నుంచి 4 వారాలు పడుతుందట. అమెజాన్‌లో ప్రీమియం మైక్రోఫైబర్ వస్త్రాలు ఒక్కొక్కటి $ 1.50 చొప్పున అందుబాటులో ఉన్నాయి. అయితే కొత్త పాలిషింగ్ క్లాత్‌కు మాత్రం యాపిల్ అత్యధిక ధరను నిర్దేశించింది. మన దేశంలో దీని ధర రూ.1900గా ఉంది.
కాలిఫోర్నియాకు చెందిన కుపెర్టినో (Cupertino) కంపెనీ తమ ఉత్పత్తులు, యాక్సెసరీలను అత్యధిక ధరల్లో అమ్ముతూ వార్తల్లో నిలిచేది. ఆ తరువాత 1,000 డాలర్ల మార్కును చేరుకున్న, అధిగమించిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ రికార్డు సృష్టించింది. అప్పటి నుంచి ఐఫోన్లకు ప్రజాదరణ లభిస్తూనే ఉంది. దీంతో మొబైల్ పరిశ్రమ సైతం వీటికి పోటీగా ఇతర ప్రీమియం డివైజ్‌లపై దృష్టి సారించాయి. 2019లో యాపిల్ ఏకంగా 50,000 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన మాక్ ప్రో ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టింది. టాప్ కాన్ఫిగరేషన్ ఆప్షన్లతో అప్డేట్ చేసిన మ్యాక్ ప్రో మంచి ఆదరణ పొందింది. దానితో పాటు విడుదల చేసిన ప్రో డిస్ప్లే XDR మానిటర్ ధరను (స్టాండ్ లేకుండా) 4,999 డాలర్లుగా నిర్దేశించింది. దీని స్టాండ్‌ను యాపిల్ ఏకంగా 999 డాలర్లతో అందుబాటులో ఉంచింది. ఇలా అన్ని డివైజ్‌లను యాపిల్ అత్యధిక ధరల వద్ద విడుదల చేస్తోంది.
కొత్త మాక్‌బుక్ ప్రో 16 అంగుళాల మోడల్లో M1 మ్యాక్స్ ప్రాసెసర్, 8TB స్టోరేజ్, మెరుగైన మెమరీ ఆప్షన్లు ఉన్నాయి. అత్యాధునిక ఫీచర్లు, సామర్థ్యాలతో రూపొందించిన ఈ నోట్బుక్కు ఆన్లైన్లో పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. భారత్‌లో కొత్త మాక్‌బుక్ ప్రో మోడల్స్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 26 నుంచి ఇవి స్టోర్లలో అందుబాటులోకి రానున్నాయి.
14 అంగుళాల మాక్‌బుక్ ప్రో ధర రూ.1,94,900 నుంచి ప్రారంభమవుతుంది. 16 అంగుళాల మోడల్ ధర రూ.2,39,900 నుంచి ప్రారంభమవుతుంది. అయితే 14 అంగుళాల మాక్‌బుక్ ప్రోను విద్యార్థులు రూ.1,75,410 వద్ద, 16 అంగుళాల మోడల్‌ను రూ.2,15,910 వద్ద కొనుగోలు చేయవచ్చు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.