వినియోగదారుల ప్రైవసీకి యాపిల్ (Apple) పెట్టింది పేరు. ఇందులోని సమాచారం చాలా గోప్యంగా ఉంటుంది. అందుకే చాలా మంది యాపిల్ ఫోన్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. కీలకమైన సమాచారాన్ని దాచుకోవడానికి ఐఫోన్‌ను చాలామంది బెస్ట్ ప్లాట్‌ఫామ్‌గా భావిస్తారు. అయితే తాజాగా ఐఫోన్ల కోసం యాపిల్ తీసుకొచ్చిన ఓ ఫీచర్, యూజర్లను మరింత ఆకర్షిస్తోంది. యూజర్లను ఆకట్టుకునేందుకు, వారికి మరిన్ని అధునాతన ఫీచర్లను అందించేందుకు టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుంది. తాజాగా ఈ కంపెనీ ఐఫోన్‌లోని ఐమెసేజ్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను ఎనేబుల్ చేసింది. ‘ఇన్‌విజిబుల్ మెసేజెస్’ ఫీచర్‌ను ఐమెసేజ్ యాప్‌లో ప్రవేశపెట్టింది. అంటే దీని సాయంతో యూజర్లు పంపించే మెసేజ్‌లు ఇతరులకు నేరుగా కనిపించవు.
ఇన్‌విజిబుల్ మెసేజ్ ఫీచర్ ఎనేబుల్ చేసిన యూజర్లు ఇతరులకు టెక్స్ట్ పంపిస్తే.. అవతలి వారు దాన్ని నేరుగా చూడలేరు. బ్లర్‌గా కనిపిస్తుంటుంది. స్వైప్ చేసి చూస్తే గానీ ఆ మెసేజ్ ఏంటో తెలియదు. అదే ‘ఇన్‌విజిబుల్ మెసేజెస్’ ఫీచర్ ముఖ్య ఉద్దేశం. ఇలా కొన్ని కీలకమైన, అతి ముఖ్యమైన మెసేజ్‌లను పంపించేందుకు యూజర్లకు అవకాశం ఏర్పడింది. అయితే, కొందరిని సరదాగా ఆటపట్టించడానికి కూడా ఈ ఫీచర్ పనికొస్తుందంటూ టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
* ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి?
ముందుగా ఐఫోన్‌లోని ఐమెసేజ్ యాప్ ఓపెన్ చేయండి. ఇన్‌విజిబుల్ మెసేజ్ పంపాలనుకునే వారి చాట్ ఓపెన్ చేయండి. లేదా న్యూ చాట్ క్లిక్ చేసి కాంటాక్ట్ సెలక్ట్ చేసుకోండి.
మెసేజ్ టైప్ చేయడం ప్రారంభించగానే చాట్ బాక్సులో మీకు అప్‌వర్డ్ యారో(Upward Arrow) బటన్ కనిపిస్తుంది. దాన్ని టచ్ చేసి హోల్డ్ చేయండి. మెసేజ్ ప్రివ్యూ చూడాలని అనుకుంటే సెండ్ చేయడానికి ముందే గ్రే డాట్స్‌పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఈ ఎఫెక్ట్‌లను ఎంపిక చేసుకున్న అనంతరం మెసేజ్ పంపించడానికి సెండ్ బటన్‌పై క్లిక్ చేయండి.
అవతలి వ్యక్తులను మరింత మైమరిపించడానికి స్లామ్ అండ్ లౌడ్ వంటి కొన్ని ఎఫెక్టులను ఉపయోగించవచ్చు. లైవ్‌లీ లేసర్స్, బబుల్స్ వంటి ఫుల్‌స్క్రీన్ ఎఫెక్టుల ద్వారా కూడా మెసేజ్‌లను పంపించవచ్చు.
* ఐఫోన్‌లో ఫుల్‌స్క్రీన్ ఎఫెక్ట్స్‌తో మెసేజ్‌లను ఎలా పంపించాలి?
ముందు ఫోన్‌లోని ఐమెస్సేజ్ యాప్ ఓపెన్ చేయండి. ప్రస్తుతమున్న లేదా కొత్త చాట్‌ని ఎంపిక చేసుకోండి.
ఏదైనా మెసేజ్ టైప్ చేయండి. లేదా ఒక ఫోటోను లేదా ఒక మెమోజీని ఇన్సర్ట్ చేయండి.
సెండ్ బటన్‌ని టచ్ చేసి హోల్డ్‌లో ఉంచండి. ఆ తర్వాత స్క్రీన్‌ని ట్యాప్ చేయండి.
లెఫ్ట్‌కి స్లైడ్ చేస్తే.. వివిధ స్క్రీన్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. వీటిలో ఏదైనా సెలక్ట్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apple, Iphone, New features, New technology, Tech news