యాపిల్ వాచ్ సిరీస్ 7, యాపిల్ ఐపాడ్, ఐపాడ్ మినీ మోడల్స్. స్మార్ట్ డిజైన్‌తో పాటు అధునాతన ఫీచర్లను వీటిలో పొందుపరిచింది. ఐపాడ్ మినీ మోడల్లో 5జీ నెట్వర్క్ సపోర్ట్ కూడా ఉంది. ఇది లుక్ పరంగానూ ఎంతో స్టైలిష్ గా ఉంది. తాజాగా జరిగిన యాపిల్ ఈవెంట్- 2021లో వీటిని లాంచ్ చేశారు.
యాపిల్ సంస్థ నుంచి ఎలక్ట్రానిక్ డివైజ్‌లు లాంచ్ అవుతున్నాయంటే.. టెక్ ప్రేమికులకు దృష్టంతా వాటిపైనే ఉంటుంది. తాజాగా ఈ దిగ్గజ సంస్థ నుంచి సరికొత్త డివైజ్‌లు విపణిలోకి వచ్చాయి. అవే యాపిల్ వాచ్ సిరీస్ 7, యాపిల్ ఐపాడ్, ఐపాడ్ మినీ మోడల్స్. స్మార్ట్ డిజైన్‌తో పాటు అధునాతన ఫీచర్లను వీటిలో పొందుపరిచింది. ఐపాడ్ మినీ మోడల్లో 5జీ నెట్వర్క్ సపోర్ట్ కూడా ఉంది. ఇది లుక్ పరంగానూ ఎంతో స్టైలిష్ గా ఉంది. తాజాగా జరిగిన యాపిల్ ఈవెంట్- 2021లో వీటిని లాంచ్ చేశారు.
ఐపాడ్ మినీ 6 (ఐపాడ్ 2021)
ఐపాడ్ 2021 సరికొత్త డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఫ్లాట్ ఎడ్జ్‌తో అచ్చం ఐఫోన్ 12 సిరీస్ మాదిరే ఈ కాంపాక్ట్ ట్యాబ్లెట్ కనిపిస్తోంది. 8.3 అంగుళాల రెటినా డిస్ ప్లే, 500 నిట్స్ బ్రైట్నెస్, యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఇందులో నాలుగు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ టచ్ ఐడీతో పాటు పవర్ బటన్ టాప్‌లో ఉంది. అయితే ప్రాసెసర్‌కు సంబంధించిన సమాచారంపై స్పష్టత లేదు. గత మోడల్ తో పోలిస్తే దీని ప్రాసెసర్ 40 శాతం వేగంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
12-మెగాపిక్సెల్ రియర్ కెమెరా(F/1.8), 4కే రికార్డింగ్ సపోర్ట్‌తో మినీ 6 ఐపాడ్‌ను రూపొందించారు. వీడియో కాల్స్ కోసం సెంటర్ స్టేజ్ సపోర్ట్ ఉన్న 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇందులో ఉంది. వీటితో పాటు ఎనహాన్స్డ్ స్పీకర్ సిస్టమ్, సెకండ్ జనరేషన్ యాపిల్ పెన్సిల్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 5జీ, వైఫై6 లాంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ సరికొత్త ఐపాడ్లో ఉన్నాయి. ఇందులో 64జీబీ, 356 జీబీ కాన్ఫిగరేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఐపాడ్ మినీ 6 ప్రారంభ ధర రూ.46,900గా ఉంది. వైఫై ప్లస్ సెల్యూలర్ మోడల్స్ ప్రారంభ ధరను రూ.60,900 నిర్దేశించారు.
యాపిల్ ఐపాడ్ 2021
యాపిల్ ఐపాడ్ 2021 డివైజ్.. 10.2 అంగుళాల ట్రూ టోన్ డిస్ ప్లేతో అందుబాటులోకి రానుంది. ఇందులో ఏ13 బయానిక్ చిప్ సెట్ ఉంది. గత మోడల్‌తో పోలిస్తే ఇది 20 శాతం వేగంగా ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. 122-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, మెరుగైన వీడియో కాలింగ్ అనుభవం కోసం సెంటర్ స్టేజ్ సపోర్ట్ ఉన్న 12-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను ఈ ఐపాడ్లో చేర్చారు.
ఈ టాబ్లెట్ మొదటి తరం స్మార్ట్ కీ బోర్డును సపోర్ట్ చేస్తుంది. ఈ సరికొత్త ఐపాడ్ ప్రారంభ ధర రూ.30,900గా ఉంది. వైఫై ప్లస్ సెల్యూలర్ మోడల్స్ సిల్వర్, స్పేస్ గ్రే ఫినిషింగ్‌తో వచ్చే మోడల్ ధర రూ.42,900గా ఉంది. 64జీబీ, 256జీబీ కాన్ఫిగరేషన్‌లో ఈ డివైజ్ అందుబాటులోకి రానుంది. సెప్టెంబరు 24 నుంచి దీని సేల్ ప్రారంభమవుతుంది.
యాపిల్ వాచ్ సిరీస్ 7
ఈ సరికొత్త వాచ్ సిరీస్‌లో మూడు ఫినిషింగ్స్ ఉన్నాయి. అల్యూమినియం, స్టెయిన్ లెస్ స్టీల్, టైటానియం వేరియంట్స్‌లో ఇది లభ్యమవుతుంది. యూజర్ ఇంటర్ఫేస్, మెరుగైన బ్యాటరీ రీడబిలిటీతో పాటు అతిపెద్ద స్క్రీన్ దీని సొంతం. దీని ముందు మోడల్ తో పోలిస్తే 70 శాతం ప్రకాశవంతంగా ఉంది. యూజర్లు 18 గంటల యూసేజ్ టైం పొందుతారు. ఈసీజీ, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్‌తో పాటు ఫాస్టర్ ఛార్జింగ్, టైప్-సీ యూఎస్బీ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ప్రారంభ ధర 399 డాలర్లుగా(రూ.29,400) నిర్దేశించింది. ఈ ఏడాది చివర్లో అమ్మకానికి రానుంది. భారత్‌లో ఈ వాచ్ ధరను యాపిల్ త్వరలో నిర్ణయించనుంది. తాజా యాపిల్ ఈవెంట్లో యాపిల్ వాచ్ సిరీస్ 7, ఎయిర్ పాడ్స్ 3 తో పాటు ఐఫోన్ 13 సిరీస్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.