Home /News /technology /

APPLE PAID MILLIONS TO WOMAN AFTER EXPLICIT PHOTOS POSTED ONLINE WHILE REPAIRING HER PHONE SU

Apple: ఓ యువతికి భారీగా సొమ్మును చెల్లించిన ఆపిల్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ యువతికి ఆపిల్ సంస్థ మల్టీ మిలియన్ డాలర్ల మొత్తం చెల్లించింది. ఇందుకు ఆ సంస్థతో సంబంధం ఉన్న టెక్నిషయన్స్ చేసిన పనే కారణం.

    ఓ యువతికి ఆపిల్ సంస్థ భారీ మొత్తంలో నగదు చెల్లించింది. ఆపిల్ రిపేర్ సెంటర్‌లో ఇద్దరు టెక్నిషియన్ష్ చేసిన తప్పుడు పనే ఇందుకు కారణం. ఈ ఘటన 2016లో చోటుచేసకుంది. ఈ విషయాన్ని లీగల్ డాక్యూమెంట్స్ వెల్లడించినట్టు The Telegraph ఓ కథనాన్ని ప్రచురించింది. త‌మ ద‌గ్గ‌రికి రిపేర్ కోసం వ‌చ్చిన యువతి ఐఫోన్‌లో ఉన్న ఆమె న‌గ్న ఫొటోలు, సెక్స్ వీడియోల‌ను టెక్నిషియన్‌లు సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఆమె న్యాయ పోరాటానికి సిద్దమైంది. దీంతో ఆపిల్ సంస్థ ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం ఆమెతో డీల్ కుదుర్చుకుంది. ఇందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించేందుకు ఆపిల్ సంస్థ అంగీకరించింది. ఆ మొత్తం ఎంత అనే విషయం స్పష్టత లేకపోయినప్పటికీ.. ఇందుకు నష్టపరిహారంగా 50 ల‌క్ష‌ల డాల‌ర్లు (సుమారు రూ.36 కోట్లు) చెల్లించాల‌ని ఆమె త‌ర‌ఫు లాయ‌ర్లు డిమాండ్ చేశారు.

    అయితే లీగల్ ఫైలింగ్స్‌లో మాత్రం స్టూడెంట్ పేరును వెల్లండించలేదు. ఒరెగాన్‌లోని ఓ యూనివర్సిటీలో చదువుతున్న స్టైడెంట్ తన ఫోన్ సరిగా వర్క్ చేయకపోవడంతో ఆపిల్ సంస్థకు పంపారు. కాలిఫోర్నియాలోని ఆపిల్ సంస్థకు చెందిన ఓ స్టోర్‌కు పంపించారు. అయితే ఫోన్ రిపేర్ చేస్తున్న సమయంలో ఇద్దరు టెక్నిషియన్స్ ఆమె 10 వ్యక్తిగత ఫొటోలను, ఒక సెక్స్ వీడియోను.. ఆమె ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. ఆమెనే వీటిని అప్‌లోడ్ చేసినట్టుగా సూచించే విధంగా వారు ఈ పని చేశారు.

    ఈ విషయంపై స్నేహితుల సమాచారం అందుకున్న ఆమె.. ఫొటోలను మాత్రం తొలగించబడింది. ఇక, ఇది అతిపెద్ద ప్రైవసీ ఉల్లంఘన కావడంతో.. బాధితురాలి తరఫున లాయర్లు ఆపిల్ సంస్థపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఈ ఘటన బాధితురాలిని మానసిక క్షోభకు గురిచేసిందని.. తాము కేసుపెట్టడంతో పాటుగా దావా వేయనున్నట్టు చెప్పారు. అలాగే మీడియాలో వచ్చే నెగిటివ్ పబ్లిసిటీపై హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఆ యువతికి మల్టీ మిలియన్ డాలర్లు చెల్లించి.. సెటిల్‌మెంట్ పూర్తి చేసినట్టుగా డాక్యూమెంట్స్‌లో ఉంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Apple, Iphone

    తదుపరి వార్తలు