Apple iPhone 11 Series: యాపిల్ ఐఫోన్ 11 సిరీస్‌లో 3 ఫోన్లు రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే

Apple iPhone 11 Series Release | ఐఫోన్ 11 సిరీస్ ప్రారంభ ధర రూ.64,900. ఇండియాలో సెప్టెంబర్ 27న సేల్ ప్రారంభం కానుంది. ఇండియాలో వీటిని ఏ ధరకు రిలీజ్ చేయనుందో స్పష్టతనివ్వలేదు యాపిల్.

news18-telugu
Updated: September 11, 2019, 3:28 PM IST
Apple iPhone 11 Series: యాపిల్ ఐఫోన్ 11 సిరీస్‌లో 3 ఫోన్లు రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే
Apple iPhone 11 Series: యాపిల్ ఐఫోన్ 11 సిరీస్‌లో 3 ఫోన్లు రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే (image: Apple)
  • Share this:
యాపిల్ ఐఫోన్ 11 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో జరిగిన స్పెషల్ ఈవెంట్‌లో బ్రాండ్ న్యూ ఐఫోన్లను రిలీజ్ చేసింది యాపిల్. ఈ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ కాకముందే స్పెసిఫికేషన్స్ గురించి చాలా లీకులొచ్చాయి. ఫోటోలు కూడా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. ఆన్‌లైన్‌లో ప్రచారం జరిగినట్టుగానే ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసింది. ఐఫోన్ 11 డ్యూయెల్ కెమెరా ఫోన్ కాగా, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ట్రిపుల్ కెమెరా ఫోన్లు. ఇవన్నీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. ఐఫోన్ 11 సిరీస్ ప్రారంభ ధర రూ.64,900. ఇండియాలో సెప్టెంబర్ 27న సేల్ ప్రారంభం కానుంది. యాపిల్ రిలీజ్ చేసిన మూడు కొత్త స్మార్ట్‌ఫోన్ల స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో, మూడు మోడల్స్ మధ్య తేడాలు ఏంటో తెలుసుకునేందుకు ఈ చార్ట్ చూడండి.








Loading...
































































 ఐఫోన్ 11 ఐఫోన్ 11 ప్రో  ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్
 డిస్‌ప్లే  6.1 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే  5.8 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే  6.5 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే
 ర్యామ్  4 జీబీ  6 జీబీ  6 జీబీ
 ఇంటర్నల్ స్టోరేజ్  64 జీబీ, 128 జీబీ, 256 జీబీ  64 జీబీ, 256 జీబీ, 512 జీబీ  64 జీబీ, 256 జీబీ, 512 జీబీ
 ప్రాసెసర్  యాపిల్ ఏ13 బయోనిక్  యాపిల్ ఏ13 బయోనిక్  యాపిల్ ఏ13 బయోనిక్
 రియర్ కెమెరా  12+12 మెగాపిక్సెల్  12+12+12 మెగాపిక్సెల్  12+12+12 మెగాపిక్సెల్
 ఫ్రంట్ కెమెరా  12 మెగాపిక్సెల్  12 మెగాపిక్సెల్ 12 మెగాపిక్సెల్
 బ్యాటరీ  3,110 ఎంఏహెచ్  3,190 ఎంఏహెచ్  3,190 ఎంఏహెచ్
 ఆపరేటింగ్ సిస్టమ్  ఐఓఎస్ 13  ఐఓఎస్ 13  ఐఓఎస్ 13
 కలర్స్  పర్పుల్, గ్రీన్, యెల్లో, బ్లాక్  స్పేస్ గ్రే, సిల్వర్, గోల్డ్, మిడ్‌నైట్ గ్రీన్  స్పేస్ గ్రే, సిల్వర్, గోల్డ్, మిడ్‌నైట్ గ్రీన్
 ప్రారంభ ధర  రూ.64,900  రూ.99,900  రూ.1,09,900

iPhone 11 series, Apple iPhone 11 series, iPhone 11 price in india, iPhone 11 Pro price in india, iPhone 11 Pro Max price in india, iPhone 11 specifications, iPhone 11 Pro specifications, iPhone 11 Pro Max specifications, iPhone 11 features, iPhone 11 Pro features, iPhone 11 Pro Max features, ఐఫోన్ 11 సిరీస్, యాపిల్ ఐఫోన్ 11 సిరీస్, ఇండియాలో ఐఫోన్ 11 ధర, ఇండియాలో ఐఫోన్ 11 ప్రో ధర, ఇండియాలో ఐఫోన్ ప్రో మ్యాక్స్ 11 ధర, ఐఫోన్ 11 స్పెసిఫికేషన్స్, ఐఫోన్ 11 ప్రో స్పెసిఫికేషన్స్, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్స్, ఐఫోన్ 11 ఫీచర్స్, ఐఫోన్ 11 ప్రో ఫీచర్స్, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ఫీచర్స్
News18 Creative


ఈ ధరలు అంచనా మాత్రమే. ఇండియాలో వీటిని ఏ ధరకు రిలీజ్ చేయనుందో స్పష్టతనివ్వలేదు యాపిల్. అయితే పేటీఎం మాల్‌లో ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై రూ.10,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుందన్న ప్రచారం జరుగుతోంది.

iPhone 11 Series: యాపిల్ ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్లు ఎలా ఉన్నాయో చూడండి



ఇవి కూడా చదవండి:

Video: షాక్... 13,000 అడుగుల ఎత్తు నుంచి దూకేసిన రియల్‌మీ సీఈఓ

'Joker' Malware: 24 యాప్స్‌లో 'జోకర్' మాల్‌వేర్... మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలిట్ చేయండి

Camera Tips: ఫోటోలు బాగా రావాలా? స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ఎంత ఉండాలో తెలుసుకోండి
First published: September 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...