Home /News /technology /

APPLE OFFERS TO USERS 20 BONUS IN INDIA FOR ADDING MONEY TO APPLE ID KNOW DETAILS GH EVK

Apple ID: యాపిల్ యూజర్లకు బంపరాఫర్​.. యాపిల్​ ఐడీ వాడండి.. 20 శాతం బోనస్ పొందండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Apple ID : యాపిల్ ఐడీ బ్యాలెన్స్ ను ఉపయోగించి చెల్లింపులను ప్రోత్సహించేందుకు గాను బోనస్ ను అందిస్తోంది. భారతీయ వినియోగదారులు యాపిల్ ఐడీకి డబ్బు యాడ్ చేయడం వల్ల 20 శాతం బోన‌స్‌ను అందుకుంటారని స్పష్టం చేసింది.

ఇటీవల కాలంలో ఈ–వాలెట్లు (E-wallet) , ఆన్ లైన్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే (Google Pay) లాంటి డిజిటల్ చెల్లింపుల (Digital Transactions) వేదికలు అందుబాటులో ఉన్నాయి. టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కూడా ఈ జాబితాలో చేరింది. యాపిల్ ఐడీ (Apple ID) బ్యాలెన్స్ ను ఉపయోగించి చెల్లింపులను ప్రోత్సహించేందుకు గాను బోనస్ ను అందిస్తోంది.భారతీయ వినియోగదారులు యాపిల్ ఐడీకి డబ్బు యాడ్ చేయడం వల్ల 20 శాతం బోనస్ ను అందుకుంటారని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్(Twitter)  వేదికగా తెలియజేసింది.

అక్టోబరు 31 వరకు మాత్రమే ఆఫర్​..
ఇండియన్స్ యాపిల్ ఐడీకి ఫండ్స్ యాడ్ చేస్తే 20 శాతం బోనస్ అందుకుంటారని స్పష్టం చేసింది. ఈ ఆఫర్ అక్టోబరు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, యాపిల్ ఐడీ బ్యాలెన్స్ కు రూ.100నుంచి రూ.15 వేల వరకు డబ్బు యాడ్ చేసినప్పుడు ఈ బోనస్ వర్తిస్తుంది.

Technology : అస‌లు పాస్‌వ‌ర్డ్ ఎలా పెట్టాలి.. ఎలాంటి పాస్‌వ‌ర్డ్ పెడితే న‌ష్టం


ఉదాహరణకు ఎవరైనా వినియోగదారు వారి యాపిల్ ఐడికి రూ.2 వేలు జోడిస్తే వారురూ.400బోనస్​గాపొందుతారు. అదే రూ.10 వేలుయాడ్​ చేస్తే రూ.2 వేలు బోనస్ గా అందుకుంటారు.

ఆర్‌బీఐ కొత్త విధానంలో మార్పులు..
అయితే, క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించే రికరింగ్ లావాదేవీలను ఆమోదించడానికి సరికొత్త ప్రామాణీకరణ వ్యవస్థ అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) నూతన నిబంధన చెబుతోంది.

Smart Phone Tips : మీ ఫోన్ హ్యాక్ అయ్యింద‌ని అనుమానంగా ఉందా.. ఓసారి ఇలా చెక్ చేసుకోండి


ఆర్బీఐ విధించిన ఈ మార్గనిర్దేశం బ్యాంకులను బయపెట్టేలా ఉందనినివేదికలు చెబుతున్నాయి. ఈ నిబంధనలను తొలగించాలని కోరుతున్నాయి.ఈ నూతన ఆదేశాలు ఆటో రెన్యూవబుల్ సబ్‌స్క్రిప్షన్‌ల (Renewable Subscription) తో యాప్‌లను ప్రభావితం చేస్తాయని యాపిల్ సంస్థ తెలిపింది. అందుకే యాపిల్ ఐడీ బ్యాలెన్స్ ను ఉపయోగించి చెల్లింపులను ప్రోత్సహించమని కంపెనీ డెవలపర్లను అడుగుతోంది. ఎందుకంటే ఇది నూతన ఆదేశాలకు ప్రభావితం కాదు. 20 శాతం బోనస్ ఆఫర్ చేయడం అనేది యాపిల్ ఇన్-యాప్ (Apple in app) కొనుగోలు వ్యవస్థతో సమస్యలను నివారించడానికి, భారత యూజర్లు (Indian Users) వారి చెల్లింపు విధానాలను మార్చమని ప్రోత్సహించడానికి కచ్చితంగా గొప్ప మార్గం అవుతుందని నివేదిక పేర్కొంది.
Published by:Sharath Chandra
First published:

Tags: Apple, Google pay, Latest Technology, Online service

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు