టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల నిర్వహించిన యాపిల్ స్ప్రింట్ ఈవెంట్ (Apple Sprint Event)లో రెండు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసింది. యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 2022 (Apple iPhone SE 2022), ఐప్యాడ్ ఎయిర్ 2022 (iPod Air 2022) ట్యాబ్లెట్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ రెండు ఉత్పత్తులను భారతదేశంలోని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఛానెల్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు ఉత్పత్తులు 5G నెట్‌వర్క్‌కు మద్దతిస్తాయి. ఐఫోన్ ఎస్ఈ A15 బయోనిక్ చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఐప్యాడ్ ఎయిర్ 2022లో M1 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌నే ఐప్యాడ్ ప్రో లైనప్, మ్యాక్‌బుక్‌లలో కూడా ఉపయోగిస్తుంది.
యాపిల్ ఐఫోన్ SE 2022 స్పెసిఫికేషన్స్:
ఐఫోన్ SE 2022 టచ్ ఐడీతో కూడిన 4.7 -అంగుళాల HD రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4GB ర్యామ్‌తో కూడిన A15 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది. దీన్ని 64GB, 128GB లేదా 256GB స్టోరేజ్‌తో పొందవచ్చు. ఐఫోన్ SE 2022 iOS 15.4 వెర్షన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఓఎస్‌పై పనిచేస్తుంది. దీని వెనుక భాగంలో 12 -మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, ముందు భాగంలో 7- మెగాపిక్సెల్ కెమెరాను అందించింది.
జియో సంచలన ఆఫర్లు.. రూ.200 లోపు 4 అన్ లిమిటెడ్ ప్లాన్లు.. వివరాలివే
యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 2022 స్పెసిఫికేషన్స్:
ఐప్యాడ్ ఎయిర్ 2022 ట్యాబ్లెట్ 10.9 -అంగుళాల LED లిక్విడ్ రెటినా డిస్‌ప్లేతో వస్తుంది. ఐప్యాడ్ ఓఎస్ సాఫ్ట్‌వేర్‌తో పాటు M1 చిప్ ద్వారా పనిచేస్తుంది. దీని ముందు భాగంలో మెరుగైన 12- మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను జోడించింది. ఇది మునుపటి వెర్షన్ మాదిరిగానే 12 -మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాను కలిగి ఉంటుంది. ఐప్యాడ్ ఎయిర్ 2022 64GB, 256GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఐప్యాడ్ ఎయిర్ 2022 ఛార్జింగ్ కోసం యూఎస్బీ టైప్ సీ ఇంటర్‌ఫేస్‌ను అందించింది.
Gmail Account: మీ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ కావట్లేదా? ఇలా ట్రై చేసి చూడండి
యాపిల్ ఐఫోన్ SE 2022, ఐప్యాడ్ ఎయిర్ 2022 ధర:
భారతదేశంలో యాపిల్ ఐఫోన్ SE 2022 బేస్ 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 43,900 నుండి ప్రారంభమవుతుంది. 128GB మోడల్ రూ.48,900 ధర వద్ద, 256GB మోడల్ రూ.58,900 ధర వద్ద లభిస్తాయి. ఆఫర్‌లో భాగంగా ICICI బ్యాంక్, కోటక్ బ్యాంక్ లేదా SBI కార్డ్‌లను ఉపయోగించి వీటిని కొనుగోలు చేస్తే రూ. 2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా మీరు ప్రత్యేక నో-కాస్ట్ ఈఎంఐ స్కీమ్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.
యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 2022 64GB వేరియంట్ ధర రూ. 54,900 నుండి ప్రారంభమవుతుంది. 256GB మోడల్‌ను రూ.68,900 వద్ద కొనుగోలు చేయవచ్చు. వైఫై, సెల్యులార్ 64GB వేరియంట్ రూ. 68,900 వద్ద, 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 82,900 వద్ద అందుబాటులో ఉంటాయి. కొనుగోలుదారులు ICICI బ్యాంక్, కోటక్ బ్యాంక్, SBI కార్డ్‌లను ఉపయోగించి రూ. 4,000 ప్రత్యేక క్యాష్‌బ్యాక్ తగ్గింపును పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.