యాపిల్ మ్యూజిక్ స్టూడెంట్ ప్లాన్ రేట్‌లు(Plan Rates) ఇండియా(India) సహా చాలా దేశాల్లో పెరిగాయి. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా కంపెనీ(Company) ధరలను పెంచింది. చాలా మార్కెట్‌లలో(Market) ప్రస్తుతం ఉన్న ధరలపై 20 శాతం వరకు పెరుగుదల కనిపిస్తోంది. యాపిల్ మ్యూజిక్(Apple Music) వినియోగదారుల కోసం యాపిల్ కంపెనీ(Company) విభిన్నమైన ఆఫర్‌లను(Offers) అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్నింటిలో స్టూడెంట్ ప్లాన్ చాలా తక్కువ ధరకు లభిస్తుంది. భారతదేశంలోని విద్యార్థులకు యాపిల్ మ్యూజిక్ ప్లాన్(Music Plan) ఇప్పుడు నెలకు రూ.59కి అందుబాటులో ఉంది. ఇది గతంలో ఉన్న రేటు కంటే రూ.10 ఎక్కువ కావడం గమనార్హం. యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌తో(Website) పాటు యాపిల్ మ్యూజిక్ యాప్‌లో ధరలను కంపెనీ మార్చింది. యాపిల్ మ్యూజిక్ ప్లాన్ కోసం సైన్‌ఇన్ చేసిన విద్యార్థులకు ఈ వారం ఈ మెయిల్ ద్వారా ధర మార్పులకు సంబంధించిన వివరాలను కంపెనీ తెలియజేస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.
* ఈమెయిల్ ద్వారా ధరల పెంపుపై సమాచారం
భారతదేశంతో పాటు ఇజ్రాయెల్, కెన్యా, ఆస్ట్రేలియా, మలేషియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, సింగపూర్ మరికొన్ని దేశాలలో యాపిల్ మ్యూజిక్ స్టూడెంట్(Apple Music Student) ప్లాన్ ధరలు పెరిగాయి. యాపిల్ స్టూడెంట్ ప్లాన్‌ల ధరల పెంపునకు సంబంధించి ఎలాంటి కారణాలను కంపెనీ ప్రకటించలేదు. అయితే కంపెనీ మార్కెట్‌లోని కొన్ని చౌకైన ఆఫర్‌ల నుంచి మరింత సంపాదించాలని భావిస్తున్నట్లు ఉండవచ్చు. అందుకు అతి తక్కువ ధరకు అందిస్తున్న యాపిల్ మ్యూజిక్ స్టూడెంట్ ప్లాన్ ధరలను పెంచేందుకు ముందుకు వచ్చిందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇందులో భాగంగా యాపిల్ కంపెనీ ఏకంగా 20 శాతం వరకు ప్లాన్ ధరలను పెంచినట్లు చెబుతున్నారు. ఉదాహరణకు సాధారణ యాపిల్ మ్యూజిక్ ప్లాన్‌ని పొందడానికి భారతదేశంలో నెలకు రూ.99 ఖర్చవుతుంది. నెలకు రూ.149కి వచ్చే ఫ్యామిలీ ప్లాన్‌ని తీసుకునే అవకాశం కూడా ఉంది.
* స్టూడెంట్‌గా ధ్రువీకరణ అవసరం..
యాపిల్ మ్యూజిక్ స్టూడెంట్ ప్లాన్ నెలకు రూ.49కి అందుబాటులో ఉంది. ఈ వారం తర్వాత ప్లాన్ ధర రూ.59 అవుతుంది. కానీ యాపిల్ మ్యూజిక్ స్టూడెంట్ ప్లాన్ కోసం విద్యార్థి IDని షేర్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థిగా ధ్రువీకరణ అయిన తర్వాత మాత్రమే యాపిల్ మ్యూజిక్ స్టూడెంట్ ప్లాన్ పొందే అవకాశం ఉంటుంది. లేదా విద్యార్థిగా ఆధారాలను ధ్రువీకరించగల ఈ మెయిల్ అడ్రస్ ఉంటే ఈ ప్లాన్‌తో లాస్‌లెస్ ఆడియో సపోర్ట్ లభిస్తుంది. Apple Music దేశంలోని Spotify, Amazon Prime Music, Gaana వంటి ఇతర మ్యూజిక్ స్ట్రీమింగ్ బ్రాండ్‌లతో పోటీపడుతుంది. Android యాప్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఇది ప్రధానంగా iPhone వినియోగదారులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, Apple, Technology