Apple: టెక్ దిగ్గజం యాపిల్ క్లాసికల్ మ్యూజిక్‌ను ఇష్టపడే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం ‘యాపిల్ మ్యూజిక్ క్లాసికల్’ (Apple Music Classical) పేరుతో కొత్త యాప్‌ను విడుదల చేసింది. యాపిల్ యాప్ స్టోర్ (Apple App Store) నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారు మాత్రమే దీనిని ఫ్రీగా యాక్సెస్ చేయగలుగుతారు. యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రైబర్లు ఆప్టిమైజ్ చేసిన సెర్చ్ ఫంక్షన్‌తో యాపిల్ మ్యూజిక్ క్లాసికల్ యాప్‌లో ఎలాంటి క్లాసికల్ మ్యూజిక్ కోసమైనా ఈజీగా సెర్చ్ చేయవచ్చు. మ్యూజిక్ లవర్స్‌కు అద్భుతమైన అనుభూతిని అందించే ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అవేవో చూద్దాం.
ఈ కొత్త యాప్ ఐదు మిలియన్లకు పైగా ట్రాక్‌లు, క్యూరేటెడ్ ప్లేలిస్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఆ ప్లేలిస్ట్ వల్ల క్లాసికల్ మ్యూజిక్‌ని కొత్తగా వినే వారికి క్లాసికల్ సాంగ్స్ కనిపెట్టడంలో పెద్దగా ఇబ్బంది ఉండదు.
* స్పెషల్ ఫీచర్లు
కొత్త యాపిల్ మ్యూజిక్ క్లాసికల్ యాప్‌తో యూజర్లు క్లాసికల్ సింగర్స్, సాంగ్స్ సులభంగా కనుక్కోవచ్చు. ఈ యాప్‌లో స్పేషియల్ ఆడియోతో 360-డిగ్రీల సరౌండ్ సౌండ్‌ను ఆస్వాదించవచ్చు. అంతేకాదు, 24 Bit/192 kHz వరకు లాస్‌లెస్ ఆడియోను కూడా వినవచ్చు. అలాగే, కంపోజర్ల జీవిత చరిత్రలు, వేలకొలది రచనల వివరణల (Classical music works)ను పొందవచ్చు. తద్వారా యూజర్లు వివిధ రకాల సంగీత శైలులను అర్థం చేసుకోవచ్చు.
ఈ యాప్‌లో ఇచ్చిన హై-రెస్ లాస్‌లెస్ మోడ్ (Hi-Res Lossless mode)లో సౌండ్ చాలా అద్భుతంగా, స్పష్టంగా ఉంటుంది. ప్రతి నోట్ హృదయాలను తాకుతుంది. యాపిల్ మ్యూజిక్ క్లాసికల్ ఎడిటర్లు 800 సంవత్సరాల సంగీతంలో యూజర్లు తమ అభిరుచికి తగినట్లు మ్యూజిక్ వినేలా 700కి పైగా ప్లేలిస్టులు క్రియేట్ చేశారు. త్వరలో మరిన్ని జోడించనున్నారు.
WhatsApp: వాట్సాప్ బీటా కొత్త అప్‌డేట్..లాగిన్ సమస్యలకు పరిష్కారం
* సమాచారం అంతా లభ్యం
ఈ క్లాసికల్ యాప్ ప్రముఖ ఆర్కెస్ట్రాల నుంచి వేలకొద్దీ ప్రత్యేకమైన ఆల్బమ్‌లను అందిస్తుంది. దీని సెర్చ్ బార్‌లో వివిధ కీవర్డ్స్ ఎంటర్ చేయడం ద్వారా యూజర్లు తాము వెతుకుతున్న వాటిని త్వరగా కనిపెట్టొచ్చు. యాప్ ఇంటర్‌ఫేస్ మ్యూజిక్ ట్రాక్ పేరు, ఆర్కెస్ట్రా, కండక్టర్, రికార్డింగ్ సంవత్సరం వంటి ముఖ్యమైన సమాచారమంతా అందిస్తుంది. తద్వారా యూజర్లకు తాము ఏమి వింటున్నామో అర్థమవుతుంది. యూజర్లు తమ పర్సనల్ లైబ్రరీకి క్లాసికల్ మ్యూజిక్ వర్క్స్, కంపోజర్స్, రికార్డింగ్స్‌ను కూడా జోడించవచ్చు.
వినియోగదారులు స్పెషల్ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయకుండానే, సాధారణ Apple Music సబ్‌స్క్రిప్షన్‌తో యాప్‌ను యాక్సెస్ చేయవచ్చు. కంపెనీ Apple Music సబ్‌స్క్రిప్షన్ ధరను నెలకు రూ.99గా నిర్ణయించింది.
యాపిల్ మ్యూజిక్ & బీట్స్ వైస్ ప్రెసిడెంట్ అయిన Oliver Schusser తాజాగా మాట్లాడుతూ, కొత్త వారితో పాటు శాస్త్రీయ సంగీత నిపుణులకు సైతం యాపిల్ మ్యూజిక్ క్లాసికల్ ఉత్తమంగా నిలుస్తుందన్నారు. ఇందులో గొప్ప క్లాసికల్ మ్యూజిక్ కలెక్షన్, బ్రౌజింగ్ ఫీచర్లు, స్పేషియల్ ఆడియో, వేలకొద్దీ ప్రత్యేకమైన రికార్డింగ్స్ ఉన్నాయని తెలిపారు. అందుబాటులో ఉన్న శాస్త్రీయ సంగీతానికి అత్యుత్తమ స్ట్రీమింగ్ అనుభవాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలానే, యాప్‌లో మరిన్ని సాంగ్స్‌తో పాటు ఫీచర్లను యాడ్ చేయనున్నట్లు హింట్ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.