APPLE MIGHT SOON ALLOW IPHONE USERS TO TYPE IN THE RAIN UNDERWATER CHECK DETAILS HERE GH SK
Apple iPhone: వర్షంలో మాత్రమే కాదు.. నీటి అడుగునా వాడగలిగే ఐఫోన్.. ఎలా పనిచేస్తుందంటే..
ప్రతీకాత్మక చిత్రం
Apple Iphone: యాపిల్ ఒక అప్‌కమింగ్ ఐఫోన్లో ఓ సరికొత్త టెక్నాలజీని లాంచ్ చేయాలని యోచిస్తోంది. ఈ టెక్నాలజీ సహాయంతో ఆ ఐఫోన్‌ను వర్షం (Rain)లో, నీటి అడుగున (Underwater) కూడా వాడవచ్చు.
Apple iPhone: టెక్ దిగ్గజం యాపిల్ (Apple) ఐఫోన్ల (iPhones)లో అదిరిపోయే టెక్నాలజీలను పరిచయం చేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ ఐఫోన్లలో అద్భుతమైన వాటర్ ప్రూఫ్ టెక్నాలజీని అందించింది. ఈ టెక్నాలజీ వల్ల ఐఫోన్స్ నీటి లోపల ఎంత కాలం మునిగి ఉన్నా అసలు పాడు కావడం లేదు. అయితే ఇప్పుడు యాపిల్ ఒక అప్‌కమింగ్ ఐఫోన్లో ఓ సరికొత్త టెక్నాలజీని లాంచ్ చేయాలని యోచిస్తోంది. ఈ టెక్నాలజీ సహాయంతో ఆ ఐఫోన్‌ను వర్షం (Rain)లో, నీటి అడుగున (Underwater) కూడా వాడవచ్చు. అంతేకాదు, టైపింగ్ కూడా చేయొచ్చు. యాపిల్ వాటర్ రెసిస్టెంట్ బిల్డ్ (Water Resistance Build)తో ఒక కొత్త ఐఫోన్‌ను లాంచ్ చేసే అవకాశముందని లేటెస్ట్ టెక్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. ఈ టెక్నాలజీ పేటెంట్ (Patent)ను యాపిల్ ఇప్పటికే పొందింది. దాంతో వెట్ మోడ్‌తో కూడిన కొత్త ఫీచర్లను ఈ కంపెనీ త్వరలో పరిచయం చేయవచ్చని తెలుస్తోంది. ఈ ఫీచర్లతో డిస్ప్లేపై నీటి బిందువులు ఉన్నప్పుడు కూడా యూజర్లు టైప్ చేయడం సాధ్యమవుతుంది.
యాపిల్ దాఖలు చేసిన పేటెంట్ ప్రకారం, ఐఫోన్ త్వరలో వాతావరణంలో మార్పులను కూడా గుర్తించగలదు. తద్వారా డిస్ప్లే టచ్ సెన్సిటివిటీని వాతావరణానికి తగినట్లుగా ఐఫోన్ మార్పు చేయగలదు. అప్పుడు ఐఫోన్ యూజర్లు వర్షంలో కూడా ఫోన్ పై టైప్ చేయగలుగుతారు. యూఎస్ పేటెంట్, ట్రేడ్‌మార్క్ ఆఫీస్‌లో యాపిల్ దాఖలు చేసిన పేటెంట్ పేరు "మాడిఫైయింగ్ ఫంక్షనాలిటీ ఆఫ్ యాన్ ఎలక్ట్రానిక్ డివైజ్ డ్యూరింగ్ ఏ మాయిశ్చర్ ఎక్స్పోజర్ ఈవెంట్". వాతావరణంలో మార్పులను గుర్తించడానికి ఐఫోన్ ఇన్-బిల్ట్ మాయిశ్చర్, ప్రెషర్ సెన్సార్లను ఉపయోగిస్తుంది. అలా వేలు ఒత్తిడితో టచ్ ఇన్పుట్లకు, ఇతర టచ్‌లకు తేడాను గ్రహిస్తుంది. ఐఫోన్ ఫింగర్టచ్స్ మాత్రమే గుర్తించినప్పుడు కమాండ్స్ ఇస్తుంది. వర్షపు చినుకుల వంటి నీటి బిందువులు డిస్ప్లే పడినా టచ్ ఇన్పుట్లను ఐఫోన్ నిలిపివేస్తుంది. యాపిల్ దీనిని "ఫాల్స్ ట్యాప్స్" అని పిలుస్తుంది. సాధారణంగా ఇప్పటి స్మార్ట్‌ఫోన్స్ డిస్‌ప్లేలపై నీటి బిందువులు పడగానే వేలుతో టచ్ చేసిన విధంగానే పనిచేస్తాయి. కొత్త ఐఫోన్ మాత్రం అందుకు భిన్నంగా పనిచేస్తుంది.
యాపిల్ దాఖలు చేసిన పేటెంట్ ప్రకారం, ఎలక్ట్రానిక్ డివైజ్‌లో ప్రొటెక్టివ్ కవర్ వద్ద ఉన్న తేమ మొత్తాన్ని గుర్తించగలిగే మాయిశ్చర్ డిటెక్టర్ ఉంటుంది. ఇక్కడ తేమ మొత్తం థ్రెషోల్డ్ మొత్తం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రాసెసర్ టచ్ ఈవెంట్ స్థానాన్ని నిర్ణయిస్తుంది. కెపాసిటన్స్ డిటెక్టర్ అప్లైడ్ ఫోర్స్ డిటెక్టర్ అందించిన డిటెక్షన్ సిగ్నల్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ టచ్ రెస్పాన్స్‌లు తడి (Wet), పొడి (Dry), నీటి అడుగున (Under water) అనే మూడు మోడ్‌లుగా ఉంటాయని యాపిల్ పేటెంట్ తెలిపింది. నీటి అడుగున ఉపయోగించడం సాధ్యమయ్యేందుకు ఐఫోన్‌లోని యూఐని అండర్‌వాటర్ మోడ్ మారుస్తుంది. నీటి అడుగున వీడియోలను షూట్ చేస్తున్నప్పుడు లేదా ఫొటోలు క్లిక్ చేస్తున్నప్పుడు ఈ మోడ్‌ను ఎనేబుల్ చేయవచ్చు. డిస్ప్లే బ్రైట్నెస్, వైట్ బ్యాలెన్స్, ISO సెన్సిటివిటీ, కెమెరా క్లారిటీని కూడా ఈ మోడ్ అడ్జస్ట్ చేస్తుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.