Home /News /technology /

APPLE MAY STOP PRODUCTION FOR THE IPHONE 12 MINI DUE TO POOR DEMAND HERE DETAILS NS

iPhone: త్వరలో ఆ ఐఫోన్ల తయారీని నిలిపివేయనున్న ఆపిల్.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు ఎన్ని వచ్చినా యాపిల్ ఐఫోన్ కు ఉన్న క్రేజ్ మాత్రం అంతా ఇంతా కాదు. iPhone నుంచి ఏ కొత్త మోడల్ రిలీజ్ అయినా వినియోగదారులు ఎగబడి కొంటూ ఉంటారు. అయితే..

    కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు ఎన్ని వచ్చినా ఆపిల్ ఐఫోన్ కు ఉన్న క్రేజ్ మాత్రం అంతా ఇంతా కాదు. iPhone నుంచి ఏ కొత్త మోడల్ రిలీజ్ అయినా వినియోగదారులు ఎగబడి కొంటూ ఉంటారు. అయితే అంత డిమాండ్ ఉన్న ఈ సంస్థ నుంచి విడుదలైన iPhone 12 mini మాత్రం వినియోగదారులను మాత్రం అంతగా తన వైపు తిప్పుకోలేక పోయింది. దీంతో ఈ ఐఫోన్ డిమాండ్ దారుణంగా పడిపోయింది. దీంతో సంస్థ ఈ మోడల్ తయారీని త్వరలో నిలిపివేయనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ 2020 సెప్టెంబర్ లో విడుదలైంది. iPhone 12, iPhone 12 Pro, iPhone 12 Pro Max మాత్రం మంచి మార్కెట్ ను పొందాయి. దీంతో వాటి అమ్మకాలు ఆశించినంతగా సాగుతున్నాయి. iPhone 12 mini ప్రస్తుత ధర రూ. 65,900 గా ఉంది. అయితే ఈ ఫోన్ తయారీ ఆగిపోయినా.. మార్కెట్లో మాత్రం మరి కొంత కాలం అందుబాటులో ఉంటుంది.

    అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగిన అన్ని ఐఫోన్ అమ్మకాల్లో ఐఫోన్ 12 మినీ కేవలం 6 శాతం వాటాను మాత్రమే నమోదు చేసిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. స్మాల్ సైజ్ ఐఫోన్ కోసం ఎదురు చూస్తున్న వారి కోసం యాపిల్ ఈ ఐఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఐఫోన్ 12 మోడళ్లలో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది.

    కానీ వాటితో పోల్చితే డిస్ప్లే చిన్నదిగా ఉండడంతో పాటు, బ్యాటరీ లైఫ్ కూడా తక్కువగా ఉంటుంది. ఐఫోన్ 12 మినీ ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన, సన్నదైన, తేలికైన 5G ఫోన్ కావడం విశేషం. ఐఫోన్ 12 మినీ 5.4 ఇంచుల డిస్ప్లేను కలిగి ఉంటుంది. అదే ఐఫోన్ 12 ప్రో 6.1 ఇంచుల డిస్ప్లే, ఐఫోన్ 12 ప్రో మాక్స్ 6.7 ఇంచుల డిస్ప్లేను కలిగి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Apple, Iphone, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు