APPLE MAY SELL IPHONE IPAD AS A SUBSCRIPTION SERVICE HERE ALL DETAILS NS GH
Apple iPhones: ఐఫోన్, ఐప్యాడ్ కోసం యాపిల్ సబ్స్క్రిప్షన్ సర్వీస్.. యాపిల్ డివైజ్‌లను రెంట్‌కు తీసుకునే ఛాన్స్
ప్రతీకాత్మక చిత్రం
టెక్ దిగ్గజం యాపిల్ (Apple) ఇప్పటికే యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ+, ఐక్లౌడ్+ వంటి అనేక డిజిటల్ సబ్స్క్రిప్షన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఇప్పుడు ఆ కంపెనీ కొత్తగా హార్డ్‌వేర్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది.
టెక్ దిగ్గజం యాపిల్ (Apple) ఇప్పటికే యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ+, ఐక్లౌడ్+ వంటి అనేక డిజిటల్ సబ్స్క్రిప్షన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఇప్పుడు ఆ కంపెనీ కొత్తగా హార్డ్‌వేర్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ పరిచయం చేసేందుకు సిద్ధమవుతోందని ఓ లేటెస్ట్ నివేదిక వెల్లడించింది. బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం, యాపిల్ సంస్థ హార్డ్‌వేర్ సబ్స్క్రిప్షన్లలోకి అడుగుపెట్టాలని యోచిస్తోంది. ఆ నివేదిక ప్రకారం, యాపిల్ సంస్థ ప్రస్తుతం ఐఫోన్, ఇతర హార్డ్‌వేర్ ప్రొడక్ట్స్ కోసం ఓ సబ్స్క్రిప్షన్ సర్వీస్‌పై పని చేస్తోంది. దీనర్థం ఒక ఐఫోన్‌ను వాడాలనుకుంటే.. దాన్ని కొనుగోలు చేసే బదులు జస్ట్ సబ్స్క్రిప్షన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఐఫోన్‌ను ఒక నిర్దిష్ట సమయం వరకు లీజు లేదా రెంట్ లాగా తీసుకోవచ్చు. ఆ సమయం వరకు సబ్స్క్రిప్షన్ ఫీజు చెల్లించి తర్వాత ఐఫోన్‌ను రిటర్న్ చేస్తే సరిపోతుంది.
ప్రస్తుతం యాపిల్ సబ్స్క్రిప్షన్ లాంటి ఐఫోన్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌ను అందుబాటులో ఉంచింది. ఇది పాత ఐఫోన్ ఇచ్చి కొత్త ఐఫోన్ సొంతం చేసుకోవడానికి 12 నెలల వ్యవధిలో నెలనెలా కొంత డబ్బులు చెల్లించడానికి అనుమతిస్తుంది. అయితే ఈ ఇన్స్టాల్మెంట్ పద్ధతి వేరు, ఇప్పుడు యాపిల్ తీసుకురావాలని అనుకుంటున్న సర్వీస్ వేరు. ఈ సర్వీసులో ఐఫోన్ ధరను విభజించి నెలకి ఇంత కట్టాలి అని కాకుండా.. జస్ట్ సబ్స్క్రిప్షన్ ఫీజు మాత్రమే వసూలు చేస్తారు. అయితే యాపిల్ ఒక నెలకు సబ్స్క్రిప్షన్ ఫీజుని ఎంతగా నిర్ణయిస్తుందో తెలియాల్సి వుంది. యూజర్లు సెలెక్ట్ చేసుకునే మోడల్ ని బట్టి నెలవారీ ఫీజు నిర్ణయించవచ్చని తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, కొత్త సబ్స్క్రిప్షన్ మోడల్ అందుబాటులోకి వస్తే.. ఇది ఆటోమేటిక్‌గా రికరింగ్ సేల్స్ కి అతిపెద్ద పుష్ ఇస్తుంది. దీనివల్ల యాపిల్ బాగా లాభపడే అవకాశం ఉంది. అంతేకాదు యూజర్లు మొదటిసారి హార్డ్‌వేర్ ప్రొడక్ట్స్ కు సబ్స్క్రిప్షన్ పొందేలా చేస్తుంది. JIO | IPL 2022: జియో కస్టమర్లకు బంపరాఫర్.. ఫ్రీగా IPL చూసే ఛాన్స్.. ఎలా అంటే?
ఈ హార్డ్‌వేర్ సబ్స్క్రిప్షన్ ప్రాజెక్ట్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది. సబ్స్క్రిప్షన్ ఫీజు చెల్లించిన యూజర్లకు ఐఫోన్లు ఎలా డెలివర్ చేస్తుంది, తిరిగి ఎలా కలెక్ట్ చేసుకుంటుంది వంటి విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. సబ్స్క్రిప్షన్-బేస్డ్ ప్లాన్‌ను తీసుకొస్తే.. కొంత ఫీజు చెల్లించి ఐఫోన్ ఇంటికి తీసుకెళ్లవచ్చు. చాలామందిలో ఐఫోన్లను ఒక్కసారైనా యూజ్ చేయాలనే కోరిక ఉంటుంది. కానీ వీటి ధర చాలా ఎక్కువ కాబట్టి అది అందరికీ సాధ్యం కావడం లేదు. అందుకే ఇప్పుడు ఎవరైనా సరే ఐఫోన్ వాడేలా సబ్స్క్రిప్షన్ సర్వీసు తీసుకొచ్చేందుకు యాపిల్ రెడీ అయినట్లు తెలుస్తోంది.
నివేదిక ప్రకారం, ఐక్లౌడ్ లేదా యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ కోసం చెల్లించినంత సులభంగా ఐఫోన్ లేదా ఐప్యాడ్‌ని కొనుగోలు చేసే ప్రక్రియను తీసుకురావాలని యాపిల్ ఆలోచన. యాప్‌లను కొనుగోలు చేయడానికి, సేవలకు సబ్‌స్క్రైబ్ చేయడానికి కస్టమర్లు ఉపయోగించే అదే యాపిల్ ఐడీ, యాప్ స్టోర్ ఖాతాతో హార్డ్‌వేర్‌కు సబ్‌స్క్రైబ్ అయ్యేలా యాపిల్ ప్లాన్ చేస్తోందని నివేదిక తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, సబ్స్క్రిప్షన్ సర్వీస్ 2022 చివరి నాటికి అందుబాటులోకి రావచ్చు. లేదా 2023లో ఈ సర్వీస్ రోల్అవుట్ అవ్వచ్చు. లేదా సబ్స్క్రిప్షన్ మోడల్ క్యాన్సిల్ కూడా అవ్వచ్చని నివేదిక పేర్కొంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.